కాలం మారిపోయింది. క్రైమ్‌పెరిగిపోయింది. మానవుని ఆలోచనలో సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతుంటే, కేటు గాళ్లు ఆలోచన కూడా అదే స్థాయిలో ఉంది. ప్రధాని మాదీ బ్లాక్ కరెన్సీని కట్టడి చేయాలని నోట్ల రద్దు చేసి డిజిటల్ మార్కెట్ వైపు వెళుతుంటే, ఇంకా ఎక్కడో మాలు మూల గ్రామాల్లో ఏకంగా కొత్తగా దొంగ నోట్ల తయారీకి పడగలెత్తారు. తాజాగా ఏజెన్సీలో పట్టుబడ్డ కరెన్సీ విలువ, సామాగ్రి చూసి విస్తుపోయారు పోలీసులు. గత కొంత కాలంగా వివిధ ప్రాంతాల్లో ఈనోట్ల బయటకు వస్తున్నాయని చెబుతున్నప్పటికీ ఎక్కడా ఆధారాల్లేవు. కానీ తాజాగా పట్టుబడ్డ నోట్లు చూసి, వారు తయారు చేసిన విధానం చూసి పోలీసులే షాక్ తినాల్సి వచ్చింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీలో దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వి.ఆర్ పురం,చింతూరు మండలాల పరిధిలో దొంగనోట్లు మారుస్తూ తెలంగాణాకు చెందిన 9 మంది ముఠా సభ్యులు పోలీసులకి చిక్కారు.అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్టేషలో జిల్లా ఎస్పీసతీష్ కుమార్ ఆధ్వర్యంలో దొంగనోట్ల ముఠాను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. 9 మంది ముఠా సభ్యులు, దొంగ నోట్లను చలామణి చేస్తూ వి.ఆర్ పురం పోలీసుల చేతికి చిక్కారు.
వీరి వద్ద నుండి 40 లక్షల దొంగనోట్లు, ప్రింటర్లు,లామినేషన్ మిషన్ ప్రింటింగ్ కోసం ఉపయోగించిన పేపర్ బండిల్స్ స్వాధీన పరుచుకున్నారు. వాటితో పాటు, మోటార్ లో వాడే బ్లాక్ పేపర్ ను సైతం కరెన్సీ సైజు లో కట్ చేసి వాటిని కెమికల్ తో కడిగితే 500 రూపాయల నోట్ వస్తుందని నమ్మబలికే బ్లాక్ పేపర్ బండిల్స్ ను స్వాధీన పరుచుకున్న పోలీసులు ప్రింటింగ్ ఎక్కడెక్కడ చేశారనే కోణంలో విచారణ చేపట్టారు.
నిందితులు గతంలో ఎక్కడ ఈ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చారనే దానిపై కూపీ లాగుతున్న పోలీసులు, ప్రజలు డిజిటల్ మార్కెట్ వైపు అడుగులేస్తేనే మంచిదని చెబుతున్నారు. నకిలీ నోట్ల చలామణి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లోనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ నిరక్ష్యారాసులు ఎక్కువ. పశువుల సంత, మేకల సంతతోపాటు, ఎక్కువగా వాణిజ్య సముదాయాలకు సంబంధించిన చోట్ల ఈ నకిలీ నోట్లను చలామణిలోకి తేవాలని చూస్తున్నారు.
గతంలో పట్టుబడిన కేసుల్లో కూడా ఎక్కువగా వాణిజ్య పరంగా నోట్లను ఉపయోగించి పట్టుబడ్డ సందర్భాలే ఉన్నాయి. నగరాల్లో ఎక్కువగా ఇప్పుడు డిజిటల్ మనీ అమలులో ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మనీ అనేది చాలా తక్కువ. అందుకే గ్రామీణ ప్రజలు, ఏజెన్సీ వాసులే లక్ష్యంగా నకిలీ నోట్లను చలమాణీలోకి తీసుకురావడానికి దొంగల ఎత్తుగడ. తద్వారా ఈ ప్రభావం ఆర్థిక మాంద్యంపై పడుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటి దొంగనోట్ల తయారీ దారులను అడ్డుకోవచ్చని అంటున్నారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, East godavari, Local News