P Ramesh, News18, Kakinada
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) ల్లో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇటీవల కాలంలో పోలీసులు ఎక్కడికక్కడ గంజాయిని పట్టుకుంటున్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా అవుతోంది. ఇటివల కాలంలో పెద్దెత్తున గంజాయినిస్వాదీనం చేసుకున్న పోలీసులు వాటి వివరాలను ప్రకటించారు. అన్నవరంలో గంజాయిని పట్టుకున్న పోలీసులు అక్కడ 35 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పెద్దాపురం డీఎస్సీ మురళీమోహన్ వివరాలను వెల్లడించారు. ఈ గంజాయి ప్రభావంతో యువత పెడదోవ పడుతుందన్నారు డీఎస్పీ. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు గంజాయి కేటుగాళ్లు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం నుండి యధేచ్ఛగా గంజాయిని తరలించడంతో అది పట్టణాల్లోకి చేరుతుంది. దీంతో ఎక్కడికక్కడ గంజాయిని పొట్లాల రూపంలో అమ్మేస్తున్నారు.
సరఫరా చేయడంతో గంజాయి స్మగ్లర్లు రంపపొట్టు బస్తాలను అనువుగా ఉపయోగించుకుంటున్నారు. బస్తాలలో గంజాయిని కుక్కి మధ్యలో ఉంచుతున్నారు. పైకి రంపపొట్టు కాగా, లోపల మాత్రం గంజాయి ఉంటుంది. ఇలా రక రకాల ప్రయోగాలతో ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయిని దూర ప్రాంతాలకు తరలిస్తూ అనూహ్యంగా పట్టుబడుతున్నారు.
ఎన్నెన్నో కేసులు..
రాజమండ్రి మోరంపూడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యాన్ డ్రైవర్, వి.ఎల్.పురానికి చెందిన సత్తిబాబు అనే క్లినర్ కలిపి, సీలేరు ప్రాంతానికి చెందిన పాండు, గణేష్ లు ముఠాగా కలిపి గంజాయి సరఫరాకు తెరలేపారు. రాజమండ్రి నుండి హైదరబాద్‌కు గంజాయి చేరవేసేందుకు రక రకాలు ఎత్తులు ఉపయోగించారు. ఇందులో భాగంగా శ్రీనివాసరావుకు చెందిన వ్యాన్‌క్యాబిన్‌లో ప్రత్యేక అరను తయారు చేయించి, గంజాయి తరలించే ప్రయత్నంలో హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్ ఇన్స్‌పెక్టర్ రాజేష్ బృందానికి చిక్కడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ట్రిప్పుకి గంజాయిని రాజమండ్రి నుండి హైదరబాద్‌కు చేరవేస్తే లక్షన్నర కిరాయికి ఇస్తానని బేరం కుదుర్చుకున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతికొస్తుందనే ఆశతో డీల్ చేసుకుని దొరికిపోయారు. అలాగే ఒడిస్సా నుండి తమిళనాడుకు తరలిస్తున్న 170 కేజీల గంజాయిని రాజమండ్రి బొమ్మూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దివాన్ చెరువు పండ్ల మార్కెట్ దగ్గర ఒక వ్యాను నుండి మరో కారులోకి గంజాయిని డంప్ చేస్తుండగా స్థానికుల సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుండి రూ.3.52 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లను, రెండు మోటారు సైకిళ్లు, 9 సెల్ ఫోన్లను సీజ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.