హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వివాదంలో పిఠాపురం మహారాజా భూములు..! తెరవెనక ఉన్నది ఆ పార్టీ నేతలేనా..? అసలేం జరుగుతోంది..?

వివాదంలో పిఠాపురం మహారాజా భూములు..! తెరవెనక ఉన్నది ఆ పార్టీ నేతలేనా..? అసలేం జరుగుతోంది..?

వివాదంలో పిఠాపురం రాజావారి భూములు

వివాదంలో పిఠాపురం రాజావారి భూములు

కాకినాడ (Kakinada)‌, పిఠాపురంతోపాటు తూర్పు గోదావ‌రి జిల్లా (East Godavari District) లో చాలా భూములను దానం చేసిన పిఠాపురం మ‌హారాజా పేరు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. పిఠాపురం మ‌హారాజా త‌మ‌కు భూములు అమ్మాడని.. అవి తమవేనంటూ కొంత మంది ఇప్పుడు రొడ్డెక్కారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Pithapuram, India

  P. Ramesh, News18, Kakinada

  కాకినాడ (Kakinada)‌, పిఠాపురంతోపాటు తూర్పు గోదావ‌రి జిల్లా (East Godavari District) లో చాలా భూములను దానం చేసిన పిఠాపురం మ‌హారాజా పేరు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. పిఠాపురం మ‌హారాజా త‌మ‌కు భూములు అమ్మాడని.. అవి తమవేనంటూ కొంత మంది ఇప్పుడు రొడ్డెక్కారు. మ‌రోప‌క్క ఈ వివాదంలో వైసీపీ నేత‌ల పేర్లు బ‌య‌ట‌కొస్తున్నాయి. ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జాతీయ ర‌హ‌దారికి ఆనుకుని ఉన్న సీత‌య్యగారి తోట‌లోని రూ.12 కోట్లు విలువైన భూమిపై వివాదం రేగింది. పిఠాపురం మ‌హారాజా 1964లో త‌మ‌కు భూమి అమ్మార‌ని, ఇప్పడు ఆయ‌న కుమారుడొచ్చి దౌర్జన్యం చేస్తున్నారంటూ వీధికెక్కారు. ఇదిలా ఉంటే పిఠాపురం మ‌హారాజా కుమారుడైన రామ ర‌త్నారావు త‌న తండ్రి ఆస్తిని కాజేశార‌ని, ఆయ‌నకు భూమి అమ్ముకునే దుస్థితి ఎందుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. కావాల‌నే న‌కిలీ ప‌త్రాలు సృష్టించి క‌బ్జా చేశార‌ని ఆరోపించారు.

  ఈ నేప‌థ్యంలో పిఠాపురంలోని స్థలం ప్రాంతంలో ఇరువ‌ర్గాలు మోహ‌రించ‌డంతో వివాదం మ‌రింత ముదిరింది. దీంతో త‌మ‌ను పిఠాపురం రాజా త‌న‌యుడు రామ‌ర‌త్నారావు బెదిరిస్తున్నార‌ని వ్యతిరేఖ వ‌ర్గం పోలీసుల‌ను ఆశ్రయించ‌డంతో రామ‌రత్నారావుపై ట్రెస్‌పాస్‌, బెదిరింపుల సెక్షన్ల కింద కేసు న‌మోదు చేశారు పిఠాపురం ప‌ట్టణ పోలీసులు. దీనిపై తాను కోర్టును ఆశ్రయిస్తాన‌ని రాజకీయ ప‌లుక‌బ‌డి ఉప‌యోగించి త‌మ ఆస్తుల‌ను క‌బ్జా చేయ‌డం త‌గ‌ద‌ని చెబుతున్నారు యువరాజా రామ ర‌త్నాక‌ర‌రావు. త‌మ ఆస్తులు ఏమి ఉన్నా పేద‌ల‌కు మాత్రమే ద‌క్కాల‌ని ఆయ‌న వెల్లడించారు.

  ఇది చదవండి: ఇక్కడ తమిళనాడు మార్కెట్ కు ఫుల్ డిమాండ్..! పండగవస్తే ప్రత్యేక సందండి.. స్పెషల్‌ ఏంటంటే..!

  ఎస్సీ కార్పోరేష‌న్ ఛైర్మన్ అమ్మాజీపై ఆరోప‌ణ‌లు..!

  ఇదిలా ఉంటే ఈ భూమిని మ‌హారాజా త‌న‌యుడి నుంచి వైఎస్సార్‌సీపీ నేత‌, ఏపీ ఎస్సీ కార్పోరేష‌న్ ఛైర్మన్ పాయ‌క‌రావు పేట‌కు చెందిన పెద్దపాటి అమ్మాజీ కొనుగోలు చేశారంటూ ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. ఈ నేప‌థ్యంలో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు దృష్టికి స‌మస్య వెళ్లడం, రాజ‌కీయంగా రాజా వారి భూమి వివాదం వైపు వెళుతుంద‌నే చెప్పాలి. మ‌హారాజా త‌న‌యుడి ద‌గ్గర నుండి అమ్మాజీ భూమి కొనుగోలు చేయ‌డం అనేది ఇప్పుడు ఇక్కడ చ‌ర్చనీయాంశంగా మారింది. అయితే కేవ‌లం మూజువాణి ప‌ద్ధతిలో మాత్రమే స్థలం శుభ్రం చేసి తిరిగి అప్పగించాల‌ని యువ‌రాజా చెబుతున్నారు. మరోవైపు ఆ స్థల వివాదంలో త‌న పాత్రలేద‌ని అమ్మాజీ వివ‌రిస్తున్నారు.

  ఇప్పటి వ‌ర‌కూ ఆ స్థలం త‌మ ఆధీనంలో ఉంద‌ని, కావాల‌నే రాజ‌కీయ పెత్తందార్లు పెరిగి త‌మ‌కు అన్యాయం చేస్తున్నార‌ని యువరాజా వ్యతిరేఖ వ‌ర్గం ఎమ్మెల్యే దొర‌బాబు ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఒకే పార్టీలో అటు కార్పోరేష‌న్ ఛైర్‌ప‌ర్సన్‌ అమ్మాజీ ఇటు దొర‌బాబుల మ‌ధ్య స‌మ‌స్య ఊగుతోంది. మొత్తం మీద ఇది ఏ దారికి వెళ్తుందో అని గోదావరి వాసులు చర్చించుకుంటున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East godavari, Local News

  ఉత్తమ కథలు