హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మీరు మార్కెట్‌లో బియ్యం కొంటున్నారా..! జాగ్రత్త..! నిజం తెలిస్తే వాటి జోలికెళ్లరు..!

మీరు మార్కెట్‌లో బియ్యం కొంటున్నారా..! జాగ్రత్త..! నిజం తెలిస్తే వాటి జోలికెళ్లరు..!

తూర్పు గోదావరి జిల్లాలో రేషన్ మాఫియా

తూర్పు గోదావరి జిల్లాలో రేషన్ మాఫియా

పేద‌ల‌కు రేష‌న్ బియ్యమనేది (Ration Rice) చాలా ద‌శ‌బ్దాల నుండి అందుతున్న ప‌థ‌కం. కానీ ఆ జిల్లాలో ఆ ప‌థ‌కం వారికి వ‌రంగా మారింది. ల‌క్షలు కాదు కోట్లలో స్కామ్ జ‌రుగుతోంది. పేదవాడిని పెట్టుబ‌డిగా పెట్టి కోట్లు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • East Godavari, India

  P. Ramesh, News18, Kakinada

  పేద‌ల‌కు రేష‌న్ బియ్యమనేది (Ration Rice) చాలా ద‌శ‌బ్దాల నుండి అందుతున్న ప‌థ‌కం. కానీ ఆ జిల్లాలో ఆ ప‌థ‌కం వారికి వ‌రంగా మారింది. ల‌క్షలు కాదు కోట్లలో స్కామ్ జ‌రుగుతోంది. పేదవాడిని పెట్టుబ‌డిగా పెట్టి కోట్లు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. పేద‌ల బియ్యంతో ప‌క్కాగా వ్యాపారం సాగిస్తున్నారు. అందుకు వేదికైంది తూర్పుగోదావ‌రి. తెల్లరేష‌న్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి ఆ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత‌మందికి ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వీటిని పంపిణీ చేస్తోంది. జాతీయ ఆహార పంపిణీ సంస్థ అందించే ఉచిత బియ్యం కొంత మందికి సిరులు కురిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్‌డియు (MDU vans) వాహ‌నాల ద్వారా రేషన్‌ బియ్యం స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఇందుకోసం దాదాపుగా ఒక్కొక్క వాహ‌నానికి రూ.22 వేల వ‌ర‌కూ ఖ‌ర్చుచేస్తుంది ప్రభుత్వం.

  ఇక్కడ వ‌ర‌కూ బాగానే ఉంది కానీ. అస‌లు క‌థ ఇక్కడే మొద‌ల‌వుతోంది. ఈవాహ‌నాల ద్వారా కొనుగోలు చేసిన బియ్యాన్ని కొంత మంది మోపెడ్లు, ఆటోలు తీసుకొచ్చి మూట‌ల‌ను కొనుగోలు చేస్తున్నారు. ఒక కేజీ బియ్యాన్ని రూ.13 నుండి 15 వ‌ర‌కూ కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని కొన్ని రైసుమిల్లుల‌కు త‌ర‌లిస్తున్నారు.

  ఇది చదవండి: వివాదంలో పిఠాపురం మహారాజా భూములు..! తెరవెనక ఉన్నది ఆ పార్టీ నేతలేనా..?

  అక్కడ రైసు మిల్లుల‌లో పాలిష్ చేసిన ఈ బియ్యం తిరిగి కొత్త ప్యాకింగ్ చేయ‌బ‌డి మార్కెట్ల‌కు పంపించ‌డం పెద్ద వ్యాపారంగా సాగిపోతుంది. కాకినాడ జిల్లాలోని కాకినాడ ప‌ట్ట‌ణం, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు పెద్దాపురం, పిఠాపురం, సామ‌ర్లకోట‌, గొల్ల‌ప్రోలు, క‌త్తిపూడి, ప్రత్తిపాడు ప్రాంతాల్లో విరివిగా రేష‌న్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు కొంద‌రు చిరు వ్యాపారులు.

  ఇది చదవండి: ఇక్కడ తమిళనాడు మార్కెట్ కు ఫుల్ డిమాండ్..! పండగవస్తే ప్రత్యేక సందండి..

  ఈ బియ్యాన్ని నేరుగా మిల్లుల‌కు త‌ర‌లించి అధిక లాభం వేసుకుని అమ్ముతున్నారు. మిల్లర్లు ఆ బియ్యాన్ని పాలిష్ చేసి మెరుగైన ర‌కం బియ్యంగా చూపించి జ‌నాల్ని మోసం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యాపారం కోట్లలో జ‌రుగుతుంది. కాకినాడ ద‌గ్గర్లో ఉన్నటువంటి పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని బి.ప్రత్తిపాడు కేంద్రం ఈ బియ్యం కొనుగోలుకు ప్రధాన వేదిక అవుతోంది. ఇక్కడ నుండి అక్రమ రేష‌న్ బియ్యం వ్యాపారం గ‌తం నుండి సాగుతున్నప్పటికీ చిన్నపాటి కేసులతో మ‌మా అనిపించేస్తున్నారు.

  ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. యథేచ్చగా సాగుతున్న వ్యాపారం..!

  ఈ అక్రమ బియ్యం వ్యాపారంలో ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఎవ్వరు అధికారంలో ఉంటే వారి తోడు తీసుకుంటున్నారు రేష‌న్‌బియ్యం వ్యాపార‌స్తులు. అధికారులు దాడులు చేసిన‌ప్పుడు మాత్రం అడ‌పా ద‌డ‌పాగా కేసులు న‌మోదు చేస్తున్నారు. 6 (A) కేసు మాత్రమే ఈ బియ్యం వ్యాపారులపై పెడుతుండటంతో రెవిన్యూ అధికారుల అండ‌తో ఆ త‌ర్వాత కేసు నుంచి ఎలాగోలా బయటపడుతున్నారు. ఒక ప్రత్యేక చ‌ట్టం అంటూ రానంత కాలం ఈ అక్రమ రేష‌న్ బియ్యం వ్యాపారానికి అవ‌దులండ‌వ‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇప్పటికైనా ప్రభుత్వం పేద‌ల బియ్యం విక్రయాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌క‌పోతే ఉచిత బియ్యం ప‌థ‌కం ఫ‌లితం లేకుండా పోతోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East Godavari Dist, Local News

  ఉత్తమ కథలు