రిపోర్టర్: రమేశ్ బాబు
లొకేషన్: కోనసీమ జిల్లా
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటంతో తూర్పుగోదావరి జిల్లాకు పెట్టింది పేరు. ఇక్కడ ఏ పండగ జరిగినా, జాతర ఉన్నా జరిగే వేడుకలకు కొదువ ఉండదు. ప్రతీ దాంట్లో కొత్త దనం చూపించడం ఈ జిల్లా వాసులకే దక్కింది. ఇటీవల వరుసగా గ్రామాల వారీగా ఎడ్ల పందాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజానగరం వద్ద జరిగిన ఎడ్ల పందాలు చూసేందుకు భారీగా జనం రావడంతో అక్కడ వాతావరణం కిక్కిరిసిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల -వీరవరం రోడ్డులో జరిగిన ఎడ్ల పరుగు పందెం పోటీలు ఉత్కంఠ భరింతంగాసాగాయి. మురమండ గ్రామానికి చెందిన రైతు మొగలపు హరిశ్చంద్ర ప్రసాద్, మరియు గ్రామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుండి ఎడ్ల జతలు పాల్గొన్నాయిఈపోటీలలో కోనసీమ జిల్లా తోకలంకకు చెందిన గెడ్డం ప్రసాద్ ఎడ్ల జత ప్రథమస్థానం దక్కించుకోగా, తూర్పుగోదావరి జిల్లా నామవరం గ్రామానికి చెందిన ఈలీ శ్రీరాములకు చెందిన ఎడ్ల జత ద్వీతయ స్థానంలోనూ, మురమండకు చెందిన మిద్దె సురేష్ ఎడ్ల జత తృతీయ స్థానం దక్కించుకున్నాయి. విజేతలకు మెమోంటోలతోపాటు, నగదును బహుమతిగా అందజేశారు నిర్వాహకులు.
కూతురి ప్రేమ పెళ్లి ఇష్టం లేని తండ్రి.. అల్లుడిని నడిరోడ్డుపై నరికి చంపేశాడు
ఎడ్ల జతలలో కొన్ని వ్యవసాయానికి మాత్రమే పనిచేస్తాయని, కానీ కొన్నింటిని ప్రత్యేకంగా వాటి పరుగు బలం చూసేందుకు సిద్దం చేస్తామని రైతులు చెబుతున్నారు. బాగా మేపి, బలవర్థకమైన ఆహారం అందించడంతోపాటు వాటికి పోషకాలు కలిగిన ఆహారం అందించడం ద్వారా వాటిని పందాలకు సిద్ధం చేస్తున్నామంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎడ్ల పందాలు జరిగినా వీటిని అక్కడకు పంపిస్తారు.
ఈ పోటీల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా తోకలంక చెందిన గెడ్డం ప్రసాద్ ఎడ్లు నిర్దేశించిన హద్దును కేవలం 21 సెకన్లలో అధిగమించి విజేతగా నిలిచి ప్రథమ స్థానం దక్కించుకుంది. తూర్పుగోదావరి జిల్లా నామవరంకు చెందిన ఈలి శ్రీరాములు ఎడ్లు 22.66 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. మురమండకు చెందిన మిద్దె సురేష్ ఎడ్లు 22.81 సెకన్లలో మూడవ స్థానాన్నిదక్కించుకోవడంతో ఆ ఎడ్ల యజమానులు సంబరపడిపోతున్నారు.
విజేతలకు విలువైన మెమోంటోలుతో పాటు , వరుసగా 5 వేలు, మూడు వేలు, రెండు వేలు నగదు బహుమతులను రాజమహేంద్రవరం రూరల్ వైకాపా కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ చేతులు మీదుగా అంద చేశారు. అలాగే పోటీలో పాల్గొన్న రైతులందరికీ ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, East godavari, Local News