Ramesh, News18, East Godavari
ఆ మెస్సెజ్ వచ్చిందంటే..అప్రమత్తంగా ఉండాల్సిందే..పిల్లల కేరీర్ బాగుండాలన్నా..బడి పథకాలు రావాలన్నా కీలకమైన ఆ సందేశమెంటో తెలుసా..?
కేంద్ర ప్రభుత్వం విద్యా విదానంలో తీసుకొస్తున్న మార్పులు చూస్తుంటే అబ్బో అనాల్సిందే. దాదాపుగా అన్ని పథకాల్లోనూ విద్యార్థులకు ప్రాధాన్యత కల్పిస్తూనే వచ్చారు. కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో జరుగుతున్నా ఆన్లైన్ విధానం కూడా సాంకేతిక విప్లవం తెచ్చిందనే చెప్పాలి. అలాంటిది ప్రస్తుతం ఏపీలో కూడా కొనసాగించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇటీవల కాలంలో విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్స్‌కు ఎస్ఎమ్ఎస్ లను పంపుతుంది. అందులో ఉన్న సందేశం పరిశీలిస్తే..మీ అబ్బాయి ఈ రోజు పాఠశాలకు రాలేదు. కారణాలు తెలపండి అనేది కనిపిస్తోంది. ప్రస్తుతం కార్పోరేట్ విద్యా విధానంలో అమలయ్యే ఈ ఎస్ఎమ్ఎస్ల విధానం ప్రభుత్వ పాఠశాలకు వర్తింపజేయడం వెనుక పెద్ద చర్చనడుస్తోంది. దీని ప్రకారంగా ఎవరైతే వరుసగా మూడు రోజులు పాఠశాలకు వెళ్ళకుండా మానేస్తారో, వారి వివరాలను విద్యార్థి నివాసముంటున్న ఏరియాలోని వాలంటీర్‌కు చేరుతుంది. వారు సంబంధిత విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేస్తారు.
Read Also : East Godavari: వాహనం కొనుగోలు చేశారా..? అది మాత్రం రాదు..!
ముఖ్యంగా డ్రాప్ ఔట్లు, పాఠశాలకు సక్రమంగా హాజరుకాకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులు, పాఠాలు సమయానికి అందుకోలేని విషయాలను సైతం తల్లిదండ్రులకు వివరించి, విద్యార్థులను పాఠశాలకు పంపించే ప్రయత్నం చేయడంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ కొత్త విధానానికి తెరలేపింది. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో(కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి) మొత్తం 3,971 పాఠశాల ఉండగా, 4,17,963 మంది విద్యార్థులు చదువుతున్నారు.వీరి వివరాలను ఉపాధ్యాయులు ఇప్పటికే సీఎస్ఈ వెబ్సైట్లో నమోదు చేశారు. పాఠశాల అటెండెన్స్ యాప్‌తో వాటిని లింక్ చేయడంతో మొన్నటి సెప్టెంబర్ నుండి ఎస్ఎమ్ఎస్లను పంపించడం మొదలుపెట్టారు. అందుబాటులో ఫోన్ నెంబరు లేకపోతే, ముందే తీసుకున్న అడిషనల్ నెంబరుకు సమాచారం ఇస్తున్నారు.
పథకాలు బ్రేక్ అవుతాయా..?
ప్రస్తుతం ఏపీలో అమ్మఒడి పథకానికి సంబంధించి హాజరుశాతం 75 శాతం ఉండాలనేది ప్రధాన నిర్ణయం. అయితే ప్రస్తుతం పాఠశాలలు ఏడాదిలో పనిచేసిన హాజరును బట్టి, 75 శాతం కంటే తక్కువ ఉంటే అమ్మఒడి వర్తించదు. ఈపథకం అమలు కావాలంటే హాజరు తప్పనిసరి. అందుకే ప్రభుత్వం కూడా ఈపథకం అర్హులకు మాత్రమే వర్తించేలా చర్యలు తీసుకోవడానికి హాజరు శాతాన్ని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం తరుపున విద్యార్థుల హాజరు సమాచారాన్ని ముందుగానే తల్లిదండ్రులకు చేరవేసి పథకం వర్తించకపోతే తమ తప్పేందకాదనేటట్లు ప్రణాళికలు వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇందుకోసం ఉదయం 10.45 లోపులోనే విద్యార్థుల హాజరును యాప్‌లో అప్లోడ్ చేయాలి. 10,45 తర్వాత యాప్ లాక్ అవుతుంది. ఉపాధ్యాయులు కనుక యాప్‌లో హాజరును 10.45 లోపు పూర్తిచేయలేకపోతే ఆ తర్వాత హాజరు వేయడానికి అవకాశం ఉండదు. వీటితోపాటు ఉపాధ్యాయులు విధిగా నిర్వర్తించే పాఠశాలలోని పనులకు సంబంధించి అధికారులు చెప్పిన చిత్రాలను ఎప్పటికప్పుడు యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News