Ramesh, News18, East Godavari
మీరు కొత్త వాహనం కొనుగోలు చేసారా.. సీబుక్ కోసం మాత్రం రాదండోయ్..అక్కడ సీబుక్ కోసం వెళ్లి బుక్కయిపోతున్న తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
కొత్త వాహనం కొనుగోలు చేసి చక చకా చక్కెర్లు కొట్టేద్దామనుకున్న వారికి గొంతులో వెలగపండులా మారింది ఏపీలోని రవాణా శాఖ తీరు. ఎందుకంటే కొత్త వాహనాలకు సంబంధించి సీబుక్ రావడం లేదు. వాహనాల మార్పిడిపత్రాలు చేతికి చేరడం లేదు. నెలలు గడిచి పోతున్నాయి కాని కొన్న వాహనాలనికి దారి లేదు. ఇదండి మన రవాణా శాఖ తీరు.. అసలెందుకు అలా జరుగుతోంది అంటున్నారా..అయితే ఈస్టోరీ చదవండి.
Read Also : Vijayawada: ఎలక్ట్రిక్ బైక్స్ ప్రయాణం.. అద్భుతం..!
ప్రస్తుతం ఏపీ రవాణాశాఖకు సంబంధించి మనం ఏ వాహనాన్ని కొనుగోలు చేయాలన్న తొందరి పడితే మాత్రం పని జరగదు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలోని ఏ కొత్త వాహనానికి సరియైన ధృవపత్రాలు లేవు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది. ఎందుకంటే సీబుక్ ముద్రించే ఏజెన్సీలు రవాణాశాఖ మధ్య ఒప్పందం కుదరలేదో తెలియదు కానీ మొత్తంమీద సమస్య జఠిలంగా మారింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనవరి 2022 నుండి నేటి వరకూ కొత్త వాహనాలకు సీబుక్ లు లేవు. పాత వాహనం కొన్నవారికి బదిలీ పత్రం లేదు. ఇలా స్కూటర్లు, కార్లు, లారీలు, బస్సులకు కూడా ఇదే పరిస్థితి. మరోపక్క వాహనాల తనిఖీల పేరుతో పోలీసులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. కాకినాడ జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. ఒక పక్క సీబుక్ లేక, మరోపక్క పెనాల్టీల మోతతో వాహన వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్త బైక్ కొనాలంటే డబ్బులుంటే కాదు, కొత్త సీబుక్ రావాలంటే మాత్రం గగనంగా మారింది.
ఎందుకిలా ...?
రవాణాశాఖ ఆధ్వర్యంలో ఈ-ప్రగతి ఉండేది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ-ప్రగతి నుండి ఎన్ఐసీ విధానంలోకి సాఫ్ట్ వేర్ ను మార్చింది. డే మొత్తం బదిలీ కావాల్సి ఉంది. అయితే ఇంతలో సీబుక్ ముద్రణ ఏజెన్సీలతో ఉన్న ఒప్పందం పై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. గుత్తేదార్ల సమస్యో, లేక గుత్తదార్లకు ప్రభుత్వానికి ఒప్పందాల సమస్య మొత్తం మీద వాహనాదారులు మాత్రం ముప్పు తిప్పలు పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 3.20 లక్షల వాహనాలకు అతిగతీ లేదదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చ. మరోపక్క డ్రైవింగ్ లైసెన్సులకు దరఖాస్తులు పెట్టడం తప్పితే, లైసెన్స్ బుక్ రావడం లేదు. దీంతో వాహనాదారులకు కొత్త వాహనాలు వచ్చినప్పటికీ ప్రదాన సమస్య మాత్రం తీరడం లేదు.
అయితే దీనిపై అధికారులు మాత్రం సీబుక్ సమస్య జనవరి నుండి ఉందని బదులిస్తున్నారు. అయితే పోలీసు అధికారులకు కొత్త వాహనాల తనిఖీలలో వెసులుబాటు ఇవ్వాలని తెలిపామన్నారు. సీబుక్ ముద్రణ సమస్యల వల్ల పోలీసు తనిఖీల్లో కొత్త వాహనాలకు, బదిలీ వాహనాలకు వెసులుబాటు ఇవ్వాలని కోరామంటున్నారు. మొత్తం మీద కొత్త వాహనదారులకు వాహనం వస్తుంది తప్పితే, సీబుక్ రాదని తొందరపాటు వద్దని చెప్పకనే చెబుతున్నారు అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kakinada, Local News