Ramesh, News18, East Godavari
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను తుఫాను ముప్పు (Cyclone Effect) భయపెడుతోంది.. ఆరు జిల్లాలకు తుఫాను ఎఫెక్ట్ ఉంటుందని భయపడుతున్నారు. ఈ ప్రభావం ఇటు రైతుల పైనా భారీగానే ఉంటుంది. ఒకపక్క వాతావరణంలో రోజుకో మార్పు ఎక్కడ ధాన్యం అక్కడే.. ఏం చేయాలో తెలియడం లేదు. పండించిన పంట ఎలా అమ్మాలో అర్థం కాక అవస్థలు పడుతున్నారు. రైతులు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా నష్టాల్లోనే ఉన్నారని చెప్పవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు నామ మాత్రంగానే ఉంది. ఏపీలో ఇప్పుడు తుఫాను ముప్పు పొంచి ఉంది. గత రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. తేమ తగ్గుతుందని పండించిన ధాన్యం మొత్తం రోడ్లపై పోసి ఎండకు ఆరోబోస్తున్నారు.
వాతావరణం మారిపోయింది. ముఖ్యంగా ఉభయగోదావరి (Godavari District), విశాఖ జిల్లా (Visakha District) లకు ముప్పు తప్పదనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డుపై ఉన్న ధాన్యాన్ని ఎలా రక్షించుకోవాలనే దానిపై రైతుల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే బరకాలు తెప్పించుకుని ధాన్యంపై మూత వేసేందుకు అవస్థలు పడుతున్నారు రైతులు.
సేకరణలో తలనొప్పులు ధాన్యం సేకరణలో ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా నిర్వాహణ చేస్తోంది. నేరుగా మిల్లర్లకు అమ్మే పరిస్థితి లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఆపై రైతులకు సరియైన ధర ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్ధేశ్యం.కానీ ధాన్యం కొనుగోలులో నిబంధనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ధాన్యంలో ఉన్న తేమ శాతం లెక్కింపుతో రైతులకు తలనొప్పిగా మారింది.
ఇదీ చదవండి : వైసీపీ డ్రామాలు ఆడుతోందా..? బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తేమ శాతం లెక్కింపు చేయడం పెద్ద ప్రహసనంగా మారడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక చేసేది లేక తేమ శాతం తగ్గించుకునేందుకు రోడ్లపై ఆరబోస్తున్నారు. మరోపక్క ఛార్జీలు ఇవ్వకపోవడం, హమాలీ ఖర్చులు రైతులే భరించడం వివాదస్పదంగా మారింది. ప్రభుత్వం మాత్రం ధాన్యం సేకరణకు మండలానికొక అధికారిని నియమించింది. వీరికి తోడు వలంటీర్లను ఏర్పాటు చేసింది. ఎన్ని చేసిన కొనుగోలు నిబంధనలు మాత్రం సడలించడం లేదు.
ఇదీ చదవండి : ఆ కాలేజ్లో ఫ్రీగా పని చేయాలా..? జీతం ఇవ్వకుండానే ఇచ్చినట్టు సంతకం పెట్టాలా..?
చాలా చోట్ల తేమ శాతంలో తేడాలు కనిపించడంతో రైతులకు అందించే సొమ్ముల విషయంలో కూడా తేడాలు వచ్చే అవకాశాలున్నయన్నా ఆందోళన రైతుల్లో పెరిగింది. ధాన్యం సేకరణలో 15 శాతం తేమ ఉంటే, అదే ధాన్యం ఆర్బికేల ద్వారా మిల్లర్లకు వెళ్లినప్పుడు 19 చూపింది. అంటే 4 శాతం వ్యత్యాసం సొమ్ములు రైతులు కోల్పోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 2 నుండి 3 కేజీల తరుగుకు డిమాండ్ చేస్తున్నారు మిల్లర్లు.
ఇదీ చదవండి: మొన్నటి వరకు ఇంజనీర్.. ఇప్పుడు రైతు.. ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
తేమ శాతం తగ్గించుకునేందుకు రైతులు ధాన్యాన్ని ఆరబోసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఆరబోసిన ధాన్యం త్వరగా బస్తాలలోకి సేకరించే లోపు వాతావరణం కలవరం పెడుతుండటంతో రైతులు పడుతున్న పాట్లు వర్ణానాతీతంగా మారాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చొరవ చూపితే తప్ప పరిష్కారం కష్టం అనేది స్పష్టమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Cyclone alert, East Godavari Dist, Local News