(Ramesh, News18, East Godavari)
లోకం తీరు మారిపోయింది. కలికాలం అన్నందుకో లేక, పాశ్చాత్య ప్రభావమో తెలియదు కానీ, రోజు రోజుకు జరుగుతున్న క్రైమ్ తీరు చూస్తుంటే భయమేస్తోన్నంతగా ఉంది పరిస్థితి. శత్రువులు మన చుట్టూనే ఉంటారంటే ఏంటో అనుకుంటారు. కానీ ఇంట్లోనే శత్రువులుంటే ఎవరేం చేయలేరు. ఇక ఆ దేవుడిపైనే భారం. ఇలాంటి ఘటనలు వింటున్న మనకే ఇంతలా ఉంటే, కేసు లోతుల్లోకి వెళ్లిన పోలీసులకు నిజంగా షాక్ తగులుతుంది. ఇప్పుడు మనం చదువుతున్న ఈకథనం లోతుకు వెళితే వామ్మో అనక మానరు.
ఏకంగా ఓ తల్లి తన కొడుకిని లేపయాడానికి సుపారీ ఇచ్చింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలబద్రపురం దగ్గర జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ అమానవీయ ఘటన వివరాలిలా ఉన్నాయి. కరప మండలం కూరాడ చిన మామిడాడకు చెందిన శివప్రసాద్ తన భార్యతో గొడవల కారణంగా తల్లి కనకదుర్గ వద్ద ఉంటున్నాడు. అయితే మద్యానికి బానిసైన శివప్రసాద్ తరచూ డబ్బులు ఇవ్వాలని తల్లిని వేధిస్తున్నాడు.
అప్పటికే భర్తకు దూరంగా ఉంటున్న తల్లి కనకదుర్గ మనుమరాలివద్ద ఆశ్రయం పొంది అక్కడే ఉంటుంది. ఈనేపథ్యంలో కొడుకు టార్చర్‌ను తట్టుకో లేకపోయింది కనకదుర్గ. దీంతో ఆమెకు పరిచయం ఉన్న ఏడుకొండలు అనే వ్యక్తి సాయంతో పాట్నిడి సత్యనారాయణ, వంశీకృష్ణ అనే వ్యక్తులను సంప్రదించింది. తన కుమారుడ్ని చంపేయాలని రూ. 1.30 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో స్కెచ్ గీసిన వారు శివప్రసాద్‌తో పని ఉందని పిలిపించారు.
మోటారు సైకిల్ ఎక్కించుకుని బిక్కవోలు మండలం బలభద్రపురం శివారు కానేడు గేటు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ శివప్రసాద్‌కు పూటుగా మద్యం తాగించారు. అనంతరం అతడిపై ఇనుపరాడ్లుతో నెత్తిపై బాధడంతో అతడు స్పృహా కోల్పోయాడు. చనిపోయాడనుకున్న నిందితులు అతడ్ని రైలు పట్టాల వద్ద వదిలేశారు. అక్కడ డ్యూటీలో ఉన్న రైల్వే ఉద్యోగి స్పృహ కోల్పోయి ఉన్న శివప్రసాద్ పరిస్థితి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడకు చేరుకున్న పోలీసులు గాయపడి కోన ఊపిరితో ఉన్న శివప్రసాద్‌ను కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అనంతరం అతడికి మెరుగైన చికిత్స అందించడంతో ప్రాణాలు నిలిచాయి. విషయం తెలుసుకున్న శివప్రసాద్ భార్య జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
సపర్యలు చేసి..తెలివిగా వ్యవహరించి..
అసలు పథకం వేసిన తల్లి కనకదుర్గ కొడుక్కి ఆసుపత్రిలో సపర్యలు చేయడంతో పోలీసులకు అనుమానం రాకుండా చేసింది. శివప్రసాద్ నుండి వివరాలు సేకరించిన పోలీసులు నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్ నెంబర్ల ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. నిందితుల్లో ఒకరి నెంబరు పనిచేయకపోవడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు.
దీంతో అసలు పథకం రచించింది తల్లేనని తెలిసి షాక్ తిన్నారు పోలీసులు. నిందితులతోపాటు, తల్లిని కేసులో చేర్చి అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. కేసు అతి త్వరగా చేధించిన అనపర్తి సిఐ శ్రీనివాస్, బిక్కవోలు ఎస్సై బుజ్జిబాబు, పోలీసు కానిస్టేబుళ్లను రాజమహేంద్రవరం ఈస్ట్‌జోన్ డీఎస్పీ భక్తవత్సలం వారిని అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, East godavari, Local News