Students lost Consciousness: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ కేంద్రీయ విద్యాలయాన్ని (Kendriya Vidyalayam) భయం వెంటాడుతోంది. కాకినాడ (Kakinada) రూరల్ లోని వలసపాకలలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో అకస్మాత్తుగా విద్యార్థులు అంతా కుప్పు కూలిపోతున్నారు (Stundents lost Consciounsness). అప్పటి వరకు యాక్టివ్ (Active) గా ఉన్నవారంతా ఒక్కసారి అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా 5,6 తరగతి గదుల్లో ఉన్నవారంతా ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సుమారు 30 మంది స్కూల్ పిల్లలు కళ్లు తిరిగి పడిపోయారని తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసుల సాయంతో విద్యార్థులను..
వలసపాకలలోని ఓ ప్రైవేట ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గల కారణాలను టీచర్స్, విద్యార్ధులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అయితే తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల రోదనలతో స్థానికంగా హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి.
కాకినాడ రూరల్ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. స్కూల్కు వచ్చి ప్రార్థన తర్వాత తరగతి గదిలోకి వెళ్లగానే ఊపిరాడక కళ్లు తిరిగి కిందపడిపోయారు. విషయం తెల్సుకున్న తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు వారిని వలసపాకలలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. క్లాసులోకి వెళ్లగానే కళ్లు మంటలు లేచినట్లు అనిపించిందని, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండి పడిపోయినట్లు పిల్లలు చెప్తున్నారు.
సోమవారం రాత్రి కేకు తినడం కారణంగా అస్వస్థతకు గురైనట్లు మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కారణాలు మాత్రం తెలియడం లేదు. ఉపాధ్యాయులు దగ్గరుండి మరీ విద్యార్థులకు చికిత్స అందజేస్తున్నారు. తల్లి దండ్రులు వలసపాకలకు వచ్చి తమ చిన్నారుల కోసం ఆరా తీసి వారు క్షేమంగా ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులు అందరూ5, 6 వ తరగతలకు చెందిన వారే..
ఇదీ చదవండి : భూమా మౌనికతో మంచు మనోజ్ ఏడు అడుగులు..! రాజకీయ అడుగులు అటువైపేనా..? చంద్రబాబుకు మోహన్ బాబు అదే చెప్పారా?
ప్రస్తుతం అస్వస్థతకు గురైన చిన్నారులు అంతా క్షేమంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే పరిస్థితిని దగ్గరుండి సమీక్షించాలని విద్యాశాఖ అధికారులను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో అధికారులు వలసపాకలోని దవాఖానకు వచ్చి వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లను చూస్తున్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని చెక్ చేస్తున్నారు. విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, సాయంత్రానికల్లా వారిని ఇళ్లకు పంపించివేస్తామని తల్లిదండ్రులకు ధైర్యం చెపుతున్నారు అధికారులు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kakinada, Students, Tragedy