హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అధిక దిగుబడి అంటూ విత్తనాలు తెచ్చి నాటారు.. పంటకూడా ఏపుగా పండింది..కానీ చివరకు..!

అధిక దిగుబడి అంటూ విత్తనాలు తెచ్చి నాటారు.. పంటకూడా ఏపుగా పండింది..కానీ చివరకు..!

నకిలీ

నకిలీ విత్తనాలతో నష్టపోతున్న మిర్చి రైతులు

Kakinada: రైతులంటే దేశానికి వెన్నుముఖ అంటారు. నేడు ఆ రైతులు అడుగ‌డుగునా మోసాల‌కు గుర‌వుతున్నారు. ప్రతి ఏటా పంట వేయడం ఏదో ఒక రూపంలో నష్టం రావడంతో రైతన్నల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Kakinada, India

  P.Ramesh, News18, Kakinada

  రైతులంటే దేశానికి వెన్నుముఖ అంటారు. నేడు ఆ రైతులు అడుగ‌డుగునా మోసాల‌కు గుర‌వుతున్నారు. ప్రతి ఏటా పంట వేయడం ఏదో ఒక రూపంలో నష్టం రావడంతో రైతన్నల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో పంట వేసే కాలంలో మంచి దిగుబడి వస్తుందని చెబితే నమ్మి గింజలు కొనుగోలు చేస్తున్నారు..కానీ, గింజవేశాకే అసలు విషయం బయటపడుతోంది.., ఇంకే ముంది నిండా మునిగాక మోస‌పోయామ‌ని కుంగిపోతున్నారు. ఇది ప్రస్తుతం లోకంలో జ‌రుగుతున్న తీరు. తూర్పు గోదావ‌రి (East Godavari) లో ప్రస్తుతం కాకినాడ జిల్లా (Kakinada District) కు ద‌గ్గర‌గా ఉన్న గొల్లప్రోలులో రైతులు చేసిన ప‌నిచూస్తే అంద‌రూ షాక్ తినాల్సిందే. గొల్లప్రోలు మండ‌లంలో చేబ్రోలు, తాటిప‌ర్తి, వ‌న్నెపూడి ఇలా ప‌లు గ్రామాల్లో కొంత మంది రైతులు మిర్చి పంట వేశారు.

  విత్తనాలలో మంచి ర‌కం, నాసిర‌కం అని ప‌లుమార్లు చూసుకునే ఆ రైతులు ఓ డీలర్ మాట‌ను గుడ్డిగా న‌మ్మారు. అందుకు ఆ డీల‌ర్ ఇచ్చిన మిర్చి విత్తనాల పంట ఆయ‌న చెప్పిన‌ట్టుగానే వేశారు. పంట కూడా బాగా పండింద‌ని సంబ‌ర‌ప‌డిపోయారు. కానీ, నెలలు గడుస్తున్నా కాయ‌లు మాత్రం రాక‌పోవ‌డంతో ఖంగుతిన్నారు ఆ రైతులు.

  ఇది చదవండి: వాటిని కట్టింది ఎందుకు.. అక్కడ జరుగుతున్నదేంటీ..? అధికారులు నిద్రపోతున్నారా..?

  సాధార‌ణంగా 20 రోజుల కొక‌సారి పచ్చిమిర్చి కాయ‌లు కోయాల్సి ఉంటుంది. కానీ 50 నుండి 70 రోజులు గ‌డుస్తున్నా పంట ఏపుగా కనిపిస్తోంది కానీ అందులో కాయ‌లు మాత్రం కాయ‌లేదు. దీంతో రైతులు తాము నిండా మోస‌పోయామ‌ని గుర్తించి లబోదిబోమంటున్నారు.. వెంట‌నే వాళ్లు విత్తనాలు కొనుగోలు చేసిన స‌ద‌రు గొల్లప్రోలులోని స‌వ్రంతి పేరుతో న‌డుస్తున్న సీడ్స్ అమ్మే దుకాణం వ‌ద్దకు వెళ్లారు.

  ఇది చదవండి: ప్రభుత్వ ఉద్యోగమున్నా డోంట్ కేర్.. సొంత సెలూన్ ఉంటేనే పిల్లనిస్తారట..!

  వారు కొనుగోలు చేసిన జెకే సీడ్స్ ర‌కం వ‌ల్ల తాము న‌ష్టపోయామ‌ని అస‌లు కాయ‌లు కాయ‌లేద‌ని, కాసిన కొన్ని కాయ‌లు కూడా మ‌రీ చిన్నవిగా ఉండ‌టంతో తాము పూర్తిగా దెబ్బతిన్నామ‌ని రైతులు కడుపుమంటతో నిలదీశారు. తాము ఇప్పటికే ఎకరాకు లక్ష రూపాయల చొప్పున పెట్టుబ‌డి పెట్టి న‌ష్టపోయామంటున్నారు. అయితే డీలర్‌ మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశాడు. కేవ‌లం అమ్మడం వ‌ర‌కే త‌న ప‌ని అని, విత్తనం తాను త‌యారు చేయడం లేద‌ని ఎదురుతిరిగాడు. దీంతో ప‌ర్చిమిర్చి రైతుల వ్యవ‌హారం అధికారుల దృష్టికి చేరింది. విచార‌ణ చేసిన అధికారులు స‌ద‌రు డీల‌రుతోపాటు, విత్తన కంపెనీకి నోటీసులు ఇస్తామ‌న్నారు.

  ఇది చదవండి: ఆ కొండపైన రాయి కాదు కదా పూచికపుల్ల పట్టుకోవాలన్నా వణికిపోతారు..! కారణం ఇదే..!

  వెంటాడుతున్న న‌కిలీల బెడ‌ద..!

  ప్రస్తుతం తూర్పుగోదావ‌రి, కాకినాడ‌, కోనసీమ జిల్లాల్లో రైతుల‌ను న‌కిలీల బెడ‌ద వెంటాడుతుంది. పురుగు మందుల విష‌యంలో కూడా న‌కిలీ పురుగు మందులు అమ్మడం, న‌కిలీ విత్తనాలు ఇలా చూస్తే ఫెస్టిసైడ్స్‌ కొనుగోళ్లలో చాలా మంది రైతులు నిండా మునిగిపోతున్నారు. అధికారులు ఒక‌పక్క దాడులు చేస్తున్నప్పటికీ న‌కిలీ మందులు పుట్టుకొస్తున్నాయి. దీంతో రైతుల‌కు ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు.

  న‌ష్టం ఎంతంటే..!

  ప్రస్తుతం గొల్లప్రోలు, చేబ్రోలు గ్రామాల‌తోపాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో క‌లిపి దాదాపుగా 200 ఎక‌రాల‌కు పైగా మిర్చి పంట దెబ్బతింది. దీనికి కార‌ణం జేకే సీడ్స్ అనే న‌కిలీ ప్యాకెట్ల‌ను కొనుగోలు చేయ‌డం. ఎక‌రానికి ల‌క్ష రూపాయల పెట్టుబ‌డి పెట్టిన రైతుల‌కు క‌నీసం రూ.10 వేలు రావ‌డం లేదు. సాధార‌ణంగా ల‌క్ష పెట్టుబ‌డి పెడితే ఏడాదిలో రూ.ల‌క్ష లాభం రావాల్సి ఉండ‌గా క‌నీసం కూలీల‌కు డ‌బ్బులు ఉండ‌టం లేద‌ని వాపోతున్నారు స్థానిక రైతులు. అధికారులు మాత్రం విచార‌ణ జ‌రుగుతుంద‌ని త్వర‌లో రైతుల‌కు న్యాయం చేసేలా చ‌ర్యలు తీసుకుంటామ‌ని చెబుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East Godavari Dist, Local News

  ఉత్తమ కథలు