Home /News /andhra-pradesh /

EAST GODAVARI MINISTER CHELLUBOINA SRINIVASA VENU GOPALA KRISHNA TURNED A RIKSHAWALA IN KONASEEMA DISTRICTS NGS

Minster Turned a Rickshawwala: రిక్షావాలాగా మారిన మంత్రి.. ఎందుకో తెలుసా..?

రిక్షా తొక్కిన మంత్రి

రిక్షా తొక్కిన మంత్రి

Minster Turned a Rickshawwala: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నేతలు తమ గెటప్ లు మారుస్తున్నారు. సామాన్యుల్లా మారుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. నిన్న టీడీపీ ఎమ్మెల్యే పేపర్ బాయ్ అవతారం ఎత్తితో.. ఇప్పుడు స్వయంగా ఓ మంత్రి రిక్షావాలాగా మారారు.. ఎందుకో తెలుసా?

ఇంకా చదవండి ...
  Minster Turned a Rickshawwala: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పుడే ఎన్నికల వాతావరణ కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు ఓట్లు అడిగేందుకు వివిధ రకాల గెటెప్పులు వేస్తుంటారు. ఆటో డ్రైవర్లుగా.. మున్సిపల్ లేబర్ గా.. చాయ్ వాలాగా.. దోసలు వేసే వారిగా ఇలా రకరకాల గెటప్పులో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తారు.. వారి గెటప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే ఓట్లు బాగా రాలుతాయనే నమ్మకంతో కొత్త కొత్త అవతారాలు ఎత్తుతారు. కానీ ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు లేవు. షెడ్యూల్ ప్రకారమైతే దాదాపు రెండేళ్లు ఆగాలి.. ముందస్తు అనుకున్నా.. ఇప్పటి వరకు అధికారపార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు..  ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఎన్నికల రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలతో మాటలు తూటాలు పేలుతున్నాయి. మరోవైపు నేతలంతా ప్రచార మూడ్ లోకి వెళ్లారు.. తాజాగా వైసీపీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాల కృష్ణ (Chelluboyina Venu Gopal Krishna) రిక్షావాలా అవతారమెత్తారు.

  కోనసీమ జిల్లా (Konaseema District) లోని జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా మండలానికి మంజూరైన 41 చెత్త సేకరణ రిక్షాలను పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిక్షాను తొక్కి కార్మికులను ప్రోత్సాహించారు. గంగవరం గ్రామం (Gangavaram Village) లో 41 ట్రై రిక్షాలు, బ్లూ, గ్రీన్ డస్ట్ బిన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయితీలలో చెత్తను తరలించే పారిశుద్ధ్య కార్మికుల తొట్టె రిక్షా ఎక్కి పారిశుద్ధ్య కార్మికులతో మమేకమై వారిలో కొత్త ఉత్సాహన్ని నింపారు మంత్రి వేణు గోపాల కృష్ణ.

  కాసేపు రిక్షా తొక్కిన ఆయన తరువాత.. పారిశుధ్యం పై అవగాహన కల్పించారు. స్వచ్ఛ సంకల్పం అనే నినాదంతో ప్రజలందరూ గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు. స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి గ్రామంలోనూ తడి చెత్త పొడి చెత్తను వేరుచేసి వర్మి కంపోస్టుగా తయారుచేసి ఉపయోగించాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్లను వేరుచేసి నిర్దేశించిన ప్రదేశాలలో డంపు చేయాలన్నారు.

  ఇదీ చదవండి : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపెవరిది..? సంబరాలు చేసుకుంటున్న ఆ పార్టీ నేతలు

  ఇలా మంత్రి రిక్షావాలగా మారితే.. నిన్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేపర్ బాయ్ అవతారమెత్తారు. ఏదో సరదగా పేపర్ బాయ్ గెటప్ వేసుకోవడం కాదు.. తెల్లవారు జామునే లేచి.. ఇతర పేపర్ బాయ్స్ లా.. సైకిల్ తొక్కుకొంటూ ఇంటింటికీ వెళ్లి ఉదయాన్నే పేపర్లు వేసి.. అక్కడ కనిపించిన స్థానికులతో కాసేపు మాట్లాడారు.

  టిడ్కో ఇళ్ల పనులు పూర్తి చేసి, లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని ప్రశ్నిస్తూ ఇలా నిరసన తెలిపారు. అర్హులకు వెంటనే లబ్ధి కలిగించాలని డిమాండ్ చేస్తూ పేపర్ బాయ్ అవతారమెత్తారు. అయితే సాధారణంగా ఎన్నికల సమయంలోనే ప్రజా ప్రతినిధులు ఇలా కొత్త కొత్త గెటప్ లలో కనిపిస్తుంటారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ycp, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు