హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పెద్దాపురంలో తయారయ్యే ఆ స్వీట్ ఒక్కసారి తిన్నారంటే.. ఆహా ఏమిరుచి అనాల్సిందే..!

పెద్దాపురంలో తయారయ్యే ఆ స్వీట్ ఒక్కసారి తిన్నారంటే.. ఆహా ఏమిరుచి అనాల్సిందే..!

ఫుడ్

ఫుడ్ లవర్స్‌ని ఫిదా చేస్తున్న పెద్దాపురం పాలకోవా

Peddapuram: ‌గోదావ‌రి జిల్లాలు అంటే మర్యాదలకు, రకరకాల పసందైన వంటలకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొర‌క‌మైన రుచితో కూడిన వంట‌కాలు చాలా ఫేమస్‌. ఇందులో అల్పాహారం దగ్గర నుండి, వింధుభోజ‌నం వ‌ర‌కూ అన్ని స్పెష‌ల్ అనే చెప్పవ‌చ్చు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Peddapuram, India

  P. Ramesh, News18, Kakinada

  ఉభ‌య ‌గోదావ‌రి జిల్లాలు అంటే మర్యాదలకు, రకరకాల పసందైన వంటలకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొర‌క‌మైన రుచితో కూడిన వంట‌కాలు చాలా ఫేమస్‌. ఇందులో అల్పాహారం దగ్గర నుండి, వింధుభోజ‌నం వ‌ర‌కూ అన్ని స్పెష‌ల్ అనే చెప్పవ‌చ్చు. అలాంటి ఓ స్పెష‌ల్ ఫుడ్‌లో పాల‌కోవ ఒకటి. కాకినాడ జిల్లా (Kakinada District) ప‌రిధిలోని పెద్దాపురం (Peddapuram) అంటే అంద‌రికీ తెలిసిందే. క‌ళారంగానికి పెట్టింది పేరు పెద్దాపురం. అయితే కళారంగానికి మాత్రమే కాదు పాలకోవాకు కూడా పెద్దాపురం చాలా ఫేమస్‌.. అక్కడ త‌యార‌య్యే పాల‌కోవ చాలా స్పెష‌ల్‌. అందుకే చాలా మంది మాట్లాడిన‌ప్పుడు ఏ పెద్దాపురం పాల‌కోవా (Peddapuram Palakova) కావాలా అంటుంటారు. ఆ పెద్దాపురం పాల‌కోవా ఎలా త‌యార‌వుతుందో తెలుసుకుందాం..!

  చాలా కాలం కింద‌ట ఒక‌రిద్దరు మాత్రమే ఈ ప్రాంతంలో పాల‌కోవ త‌యారు చేసేవారు, కానీ ఇప్పుడు అదే వృత్తిగా చేసుకుని చాలామంది జీవిస్తున్నారు. మార్కెటింగ్‌ చేసుకుని లాభార్జన చేస్తున్నారు. దశాబ్దాల నుంచి చేస్తున్నా కూడా రుచిలో కానీ, నాణ్యతలో కానీ ఎక్కడా రాజీపడరు.

  ఇది చదవండి: బిర్యానీలో వేసే జాజికాయ పంటను ఎప్పుడైనా చూశారా..? మంచు ప్రాంతంలో పండేది మన కాకినాడలో ఎలా..?

  పాల‌తో నేరుగా త‌యారు చేసే పాల‌కోవ కోసం గోదావరి వాసులే కాదు దూర ప్రాంతాల జనాలు కూడా ఎగ‌బ‌డుతుంటారు. పెద్దాపురంలోని ద‌ర్గా సెంట‌ర్ నుండి మ‌ట్టే వారి క‌ళ్యాణ‌మండ‌పానికి వెళ్లే దారిపొడవునా పాల‌కోవా దుకాణాలు మనకు క‌నిపిస్తాయి. ఒక‌ప్పుడు కొంత మందికి మాత్రమే సాధ్యమ‌యిన ఈ పాల‌కోవ త‌యారీ దాదాపుగా అంద‌రూ త‌యారు చేస్తుండ‌టం గ‌మ‌నించాల్సిన అంశం.

  ఇది చదవండి: అక్కడికి ఒక్కసారి వెళ్తే మీ ఇల్లు నందన వనమే..! అందుకే మహిళలు క్యూ కడతారు..!

  పాల నుండి నేరుగా..!

  ఇక్కడ త‌యార‌య్యే పాల‌కోవ నేరుగా పాల‌ను మరిగించి, దానిలో చ‌క్కెర క‌లిపి ఒక ముడిప‌దార్థంలా త‌యారుచేస్తారు. ఆ త‌ర్వాత మ‌ర‌లా బాగా మ‌రిగించి ఒక ముద్దలా వ‌చ్చే వ‌ర‌కూ చేస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు 20 లీట‌ర్ల పాల‌కు సంబంధించి జ‌రిగే ఈ ప్రక్రియ‌కు మొత్తం దాదాపుగా 3 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. చివ‌ర‌గా త‌యారైన పాల‌కోవ ప‌దార్థాన్ని పాల‌కోవ ‌(అచ్చులు)గా రూపం వ‌చ్చేలా త‌యారు చేస్తారు. ఆ త‌ర్వాత వాటిని సైజ్ ప్యాకింగ్ చేసి విక్రయిస్తారు.

  ఇది చదవండి: ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ లో అదరగొడుతున్న స్వీపర్.. పిల్లలు మాట్లాడుతుంటే విని నేర్చుకుంది

  ఈ పాలకోవ కొనుగోలు చేయ‌డానికి ఎక్కడెక్కడి నుండో ఇక్కడ‌కు వ‌స్తుంటారు. పెద్దాపురం ప‌రిస‌ర ప్రాంతాలు ప‌ర్యాట‌కంగా కూడా అభివృద్ది చెందడంతో వ‌చ్చే పర్యాట‌కులు విరివిగా కొనుగోలు చేస్తుంటారు. కాకినాడ బీచ్ (Kakinada Beach) ఇక్కడకు 30 కిలోమీట‌ర్ల దూరం, అలాగే కాకినాడ నుండి రాజ‌మండ్రి వెళ్లే ప్రయాణికులు కోవాను కొనుగోలు చేస్తారు. కృష్ణా, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా వాసులు కూడా పెద్దాపురం పాల‌కోవ‌ను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారని షాపు ఓనర్‌ రాంబాబు తెలిపారు. ఇంకెందుకాలస్యం మీరెప్పుడైనా గోదావరి జిల్లాలవైపు వెళ్తుంటే ఓ సారి ఈ పెద్దాపురం పాలకోవాను రుచి చూడండి.

  అడ్రస్‌: పెద్దాపురం టౌన్, ద‌ర్గా సెంట‌ర్ రోడ్డు, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌- 533437. ఫోన్‌ నెంబర్‌: 9494944741, రాంబాబు, పాల‌కోవ షాప్ ఓన‌ర్‌.

  Peddapuram Map

  ఎలా వెళ్లాలి: కాకినాడ నుండి రాజ‌మండ్రి వెళ్లేమార్గంలో పెద్దాపురం ఉంటుంది. బ‌స్సు వెసులుబాటు ఉంది. విశాఖ‌ప‌ట్నం నుంచి వ‌చ్చేవారైతే సామ‌ర్లకోట వ‌ర‌కూ ట్రైన్ సౌక‌ర్యం ఉంది. అక్కడి నుండి పెద్దాపురం 5 కిలోమీట‌ర్లు ఉంటుంది. బ‌స్సు, ఆటో సౌక‌ర్యం ఉంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East godavari, Local News

  ఉత్తమ కథలు