హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..ఈ ఆఫ‌ర్ మీకోస‌మే..!

మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..ఈ ఆఫ‌ర్ మీకోస‌మే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: కాకినాడ జిల్లాకు మ‌రో గుడ్ న్యూస్ ఇటీవ‌ల కాలంలో భారీగా చేప‌ట్టిన ఉద్యోగ‌మేళాల‌తో పోలిస్తే ఈ నెల 27న జ‌రిగే భారీ జాబ్‌మేళాకు రంగం సిద్ధమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

(Ramesh, News18, East Godavari)

కాకినాడ జిల్లాకు మ‌రో గుడ్ న్యూస్ ఇటీవ‌ల కాలంలో భారీగా చేప‌ట్టిన ఉద్యోగ‌మేళాల‌తో పోలిస్తే ఈ నెల 27న జ‌రిగే భారీ జాబ్‌మేళాకు రంగం సిద్ధమైంది. కాకినాడ క‌లెక్ట‌రేట్ లో వికాస కేంద్రం ఇందుకు వేదిక కాబోతుంది.

కాకినాడ లోని వికాస కేంద్రం ఆధారంగా జ‌రిగే ఈ జాబ్‌మేళాను విజ‌య‌వంతం చేయ‌డానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి భారీగా నిరుద్యోగుల‌కు ఉద్యోగ‌వ‌కాశాలు క‌ల్పించే యోచ‌న‌లో అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు. ఇక్క‌డ‌కు వచ్చిన నిరుద్యోగులు సంతృప్తి చెందేలా, జాబితాలో పేర్కొన్న అన్ని కంపెనీల ప్ర‌తినిధులు వ‌చ్చేలా చూస్తున్నారు.

సాఫ్ట్ వేర్‌, పారిశ్రామిక రంగం, ఆటో మొబైల్‌, ఫైనాన్స్ రంగాల్లో వివిధ ప‌లు పోస్టుల‌కు సంబంధించి ఇంట‌ర్వ్యూలు జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకు ఆయా విభాగాల అవసరతను బట్టి నిర్ణయించారు. 10వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, డిగ్రీ, పీజీ స్థాయితోపాటు, ఇంజ‌నీరింగ్ డిప్ల‌మో, బిటెక్‌, ఎమ్‌టెక్ చ‌దివిన విద్యార్థులు, సైన్సు విభాగాల్లో డిగ్రీ, పీజీలు చేసిన వారికి పోస్టులు ఉన్నాయి.

ఉద్యోగాలివే..!

వికాస కార్యాలయంలో ఈ నెల 27న‌ ష‌జాబ్ మేళాకు నైనా బకేర్ జి.ఎస్.ఎం. బి. ఎస్ సి సర్నింగ్, బిఎస్సి ఆఫ్రోమెట్రీ, డిప్లొమో ఇన్ ఆఫ్తామాలిక్ అసిస్టెంట్, అమరావతి టి.వి.ఎస్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, సర్వీస్ అడ్వజర్, సేల్స్ మేనేజర్, ఎజియన్ ఫెడరల్ ఏజన్సీ మేనేజర్, ఏజన్సీ లీడర్, డి-మార్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్యాషియర్, నిట్ (ఐసిఐసిఐ బ్యాంక్ రిలేషన్ షిప్ మేనేజర్, డెక్కన్ కెమికల్స్ ట్రైనీ, ఇండిగో ఎయిర్లైన్స్లో లోడర్స్, డ్రైవర్స్, వీల్స్ మార్ట్ ఆటో ఫైనాన్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెలికాలర్, మెకానిక్ హెల్పర్, హోండాయ్ మోబీస్, కె.ఐ. ఎం. ఎల్లో టెక్నిషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమో. జి.ఎన్.ఎం. బి. ఎస్ సి నర్సింగ్, బి.ఎస్సీ ఏదైనా డిగ్రీ లేదా బి.టెక్ ఉత్తీర్ణులైన 40 సంవ‌త్స‌రాలలోపు అభ్యర్థులు అర్హులు. వీరికి నెలకు రూ.10,000/ నుండి రూ.25,000/- వరకు జీతం + ఇన్సింటివ్స్, భోజనం, వసతి & రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుంది.ఆసక్తి గల అభ్యర్థులందరూ ఈనెల 27వ తేదీ సోమవారం \"వికాస కార్యాలయం, కలెక్టరేట్, కాకినాడ వద్ద ఉదయం 9 గం||లకు సర్టిఫికెట్స్ జెరాక్స్ లతో హాజరుకావలెను. ఈ ఉద్యోగాల‌కు సంబంధించి పూర్తి వివరాలకు సెల్ 8297400666, www.vikasajobs.com సంప్రదించాల‌ని తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, East godavari, Local News

ఉత్తమ కథలు