Home /News /andhra-pradesh /

EAST GODAVARI MANGO TREE WITH FULL OF MANGO FRUITS UNSEASONED IN KONASEEMA DISTRICT NGS

Wonder Mango: ఈ చిత్రం చూశారా? అన్ సీజన్ లో చెట్టు నిండా గుత్తులు.. గుత్తులుగా మామిడి కాయలు.. ప్రత్యేకత ఏంటంటే?

అన్ సీజన్ లో గుత్తులు గుత్తులుగా మామిడి

అన్ సీజన్ లో గుత్తులు గుత్తులుగా మామిడి

Wonder Mango: సాధారణంగా వేసవి కాలంలో మాత్రమే మామిడి కాయలు పంట ఉంటుంది.. ఆ తరువాత మచ్చుకు కూడా ఎక్కడా కనిపించదు.. ఇక్కడ మాత్రం చిత్రంగా ఓ మామిడి చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ చెట్టును చూసేందుకు జనం ఎగబడుతున్నారు..?

ఇంకా చదవండి ...
    Wonder Mango: పండ్లకు రారాజు మామిడి పండు (Mango Fruit) .. అందుకే మామిడికి అంత డిమాండ్.. ధర ఎంతైనా..? కొనుక్కొని తింటారు. ఎందుకంటే మామిడి పండ్లు సాధారణంగా సమ్మర్‌ (Summer) లో మాత్రమే లభిస్తాయి. సమ్మరం వస్తోంది అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఎదురు చూసేది మామిడి కాయలు, పండ్ల గురించే.. ఇక మామిడితో చేసే ఊరగాయలకు అంతే క్రేజ్ ఉంటుంది.. సమ్మర్ లో ఎక్కడ చూసినా మామిడికాయలతో నిండిన చెట్లు మ్యాంగో ప్రియులను ఊరిస్తూ ఉంటాయి. కానీ వర్షాకాలం మొదలవ్వగానే.. మామిడి చెట్లన్నీ బోసి పోతాయి.. కేవలం ఆకులతో మాత్రమే దర్శనమిస్తాయి. అయితే సీజన్ ముగిసిన తరువాత కూడా.. కొన్ని చెట్లు అక్కడక్కడా కాయలు కాస్తాయి. వాటిలో పునాస మామిడి ఒకటి. అలాంటి పునాస మామిడి చెట్లు (Punasa Konaseema District) కోనసీమ జిల్లా అమలాపురం (Amalapuram)లో చర్చనీయాంశంగా మారింది. అది కడా రైతులు పండించిన పొలంలో కాదు.. ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న మామిడి చెట్టు నిండా కాయలే దర్శనమిస్తున్నారు. సమ్మర్ సీజన్ లో ఎలా కాస్తాయో అలాగే గుత్తులు గుత్తులు మామిడి కాయాలు చెట్టునిండా కనిపిస్తన్నాయి.

    కోనసీమ జిల్లా (Konaseema) కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో పునాస మామిడి చెట్టు విరగ కాసింది. గుత్తులు గుత్తులుగా వందలాది కాయలు కాసిన మామిడి చెట్టును జనాలను చూపు తిప్పుకోనివ్వడంలేదు. కలెక్టర్ కార్యాలయం అంటే నిత్యం వివిధ పనుల కోసం అక్కడికి జనం వస్తుంటారు.. వారంతా ఆ చెట్టును చాలా ఆశ్చర్యంగా చూస్తూ.. ఈ సీజన్ లో మామిడి కాయలు ఎలా కాసాయని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.



    కలెక్టర్ కార్యాలయం ఎంట్రన్స్ లో ఉన్న ఈ చిన్న పునాస మామిడి చెట్టు కొమ్మ కొమ్మకూ కాసిన కాయలతో అబ్బురపరుస్తోంది. అయితే ఆగస్టు 1న స్పందన కార్యక్రమం కావడంతో కలెక్టర్ కార్యాలయానికి వందలాదిమంది అర్జీదారులు వచ్చారు. వారంతా మామిడి చెట్టును చూసి నిర్ఘాంతపోయారు. పునాస ఈ సీజన్‌లో కాస్తుందని తెలుసు కానీ.. ఈ స్థాయిలో కాపు ఉండటం మాత్రం అరుదని వారు చెబుతున్నారు.

    ఇదీ చదవండి : తిరుమల శ్రీవారిని కూడా వదలరా? మా వాటా మాకివ్వాల్సిందే? కేంద్రంపై విజయసాయి ఫైర్

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మామిడి సుమారుగా 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతుంది. వీటిని ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్‌, విశాఖపట్నం, చిత్తూరు, కడప జిల్లాలో విస్తారంగా సాగుచేస్తారు. అయితే ఇవీన్నీ సీజన్ లోనే పండుతాయి.. కానీ కొనసీమలో ఈ చెట్లు మాత్రం అన్ సీజన్ లో గుత్తులు గుత్తులుగా కాయడం హాట్ టాపిక్ అవుతోంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Mangos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు