P Ramesh, News18, Kakinada
సృష్టిలో జరుగుతున్న వింతలు చూస్తుంటే అంతా అయోమయంగానే ఉంటోంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు చారిత్రాత్మకంగా చాలా ప్రసిద్ధి చెందినవి. అక్కడ ఏరియాలో జరుగుతున్న వింతలు విశేషాలు చూస్తుంటే వామ్మో అనక మానరు. సాధారణంగా ఏజెన్సీ ప్రాంతంలో కొన్నిరకాల ఆచారాలు, సంస్కృతులు ఉంటాయి. వాటి ఆధారంగా అక్కడ దేవతలకు ఉత్సవాలు జరుపుతుంటారు. ఇందులో జంతువులను బలి కూడా ఇస్తుంటారు. నేటికి చాలా ప్రాంతాల్లో జరుగుతున్న ఈతంతులు చూస్తుంటే ఇంత సాంకేతిక యుగంలో కూడా పాత పద్ధతులే ఉండటం కాస్త విస్మయానికి గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెప్పిన నీతులు తగ్గట్టుగానే కాలంలో వింతలు జరుగుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరపు పాడులో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. మామిడి చెట్టు నుండి నీరు రావడంతో గ్రామస్తులంతా షాక్ అయ్యారు. ఈ వింత ఘటన చూసేందుకు పెద్ద ఎత్తున్న పరిసర గ్రామ ప్రజలు అన్నవరపు పాడు వస్తున్నారు. గ్రామానికి చెందిన ఈగల రామారావు అనే వ్యక్తి ఇంటిపెరటిలో ఉన్న మామిడిచెట్టు నుండి నీరు కారడం గమనించిన అతడి కుటింబీకులు ఇరుగుపొరుగు వారికి సమాచారమిచ్చారు. అసలు మామిడి చెట్టు నుండి నీరు రావడమేంటని గుర్తించిన వారు వింతను గ్రామంలో పెద్దలకు చెప్పారు. అక్కడ నుండి ఈ వింత ఊరంతా పాకి గ్రామస్తులంతా ఈ వింత చూసేందుకు ఎగబడుతున్నారు. దీంతో అక్కడ రామారావు నివాసం జనంతో నిండిపోయింది.
సాధారణంగా వేసవి సమీపించిందంటే మామిడి చెట్టు పూత పూసి కాయలు కాస్తుంది. ఈసీజన్‌లోనే మామిడి పండ్లు పండుతాయి. ప్రతీయేటా తమ చెట్టు ఎక్కువగానే ఫలసాయాన్ని ఇస్తుందని, పెద్ద చెట్టు కావడంతో గత కొన్ని సంవత్సారాలుగా దాన్ని సంరక్షిస్తున్నామని చెబుతున్నారు. అయితే తమ మామిడి చెట్టు నుండి ఇంతలా వాటర్ బయటకి రావడం చూస్తుంటే ఎవరికి ఏం చెప్పాలో తెలియడం లేదని యజమాని రామారావు చెబుతున్నారు. అసలు ఇలాంటి వింత ఇక్కడెప్పుడు చూడలేదని చెప్పిన వారు ఈవిధంగా మామిడిచెట్టు నుండి నీరు రావడంపై తమకు క్లారిటీ ఇవ్వాలని ఉద్యానవన శాఖ అధికారులను కోరుతున్నారు.
గత కొద్ది రోజుల కిందట చింతూరు వద్ద ఓ గ్రామంలో మద్ది చెట్టు బెరడు తొలగిస్తే నీరు ఉబికి వచ్చింది. అనూహ్యంగా జరిగిన ఈఘటనతో అక్కడ పశువుల కాపరులు షాక్‌కు గురయ్యారు. ఆ వింత ఏజెన్సీ వాసుల్ని కాస్త భయానికి కూడా గురి చేసింది. ఇప్పుడు పెరవలి మండంలో అదే తరహా ఘటన చోటు చేసుకోవడంతో వింతగా చెప్పుకుంటున్నారు. ఇలా చెట్ల నుండి నీరు రావడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.