EAST GODAVARI MAN CREATE GUINNESS RECORD HE MADE SMALL WOOD SPOON NGS
Andhra Pradesh: బియ్యపుగింజ కంటే చిన్న సైజు.. గిన్నిస్ రికార్డులకు ఎక్కిన చెక్క స్పూన్
గిన్నిస్ రికార్డుకు ఎక్కిన స్పూన్
కంటికి కనిపించేంత వాటిని చెక్కపై చెక్కడమే చాలా కష్టమైన పని.. కానీ కంటికి కనిపించనంత సూక్ష్మ సైజులో ఓ చెక్క స్పూన్ ను తయారు చేసి అద్భుత ప్రతిభ చాటుకున్నాడు కళాకారుడు.. దానికి ఆయన ఎంత సమయం తీసుకున్నారో తెలుసా..?
కొందరి సృజనాత్మకత అద్భుతాలు చేస్తూ ఉంటుంది. ఎంతగానో ఆకట్టుకుంటుంది. అద్భుత నైపుణ్యం చేతిలో ఉన్నా చాలామంది ప్రతిభ వెలుగులోకి రాదు. అసలు వారి ప్రతిభను ఎవరూ గుర్తించరు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా, మీడియా యాక్టివ్ గా ఉండడంతో కొందరి కళాకారుల ప్రతిభ తరచూ వెలుగులోకి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కుతోంది. తాజాగా చెక్కతో అతి సూక్ష్మ స్పూన్ తయారు చేసి తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు దొంతంశెట్టి బాలనాగేశ్వరరావు గిన్నిస్ రికార్డులోకెక్కారు. స్వర్ణకారుడిగా పని చేస్తున్న ఆయనుకు చాలా ఏళ్లుగా ఓ ఫ్యాషన్ ఉంది. చిన్న చిన్న పరిమాణంలో కళాకృతులు తయారు చేస్తూ ఉంటారు. గతంలో ఇలా చాలా వస్తువులు తయారు చేసి అందర్నీ ఆక్టుకునే వారు. ఇది ఎలా సాధ్యం అని చుట్టు పక్కల వారంతా వచ్చి చూసేవారు. అలా ఆయన మండపేటలోనే కాదు జిల్లా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక రికార్డులను కూడా తన పేరిట వేసుకున్నారు. తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. ఏకా ఈ సారి ఆయన రూపొందించిన వస్తువు గిన్నిస్ రికార్డులకు ఎక్కింది...
బియ్యంపు గింజ పరిమాణంలో వస్తువు తయాచు చేయాలంటేనే చాలా కష్టం. అంత సూక్ష్మ వస్తువు కంటికే కనిపించదు. దాన్ని చెక్కి అపూరప వస్తువుగా మరల్చాలి అంటే ఎంతో శ్రమ నైపుణ్యం అవసరం. కానీ అతడు పంచదార పలుకు కంటే చిన్న పరిమాణంలో చెక్క స్పూన్ తయారీ చేశాడు. ఇప్పుడు ఆ స్పూన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. విషయం తెలుసుకున్న గిన్నిస్ నిర్వాహకులు అతడి స్పూన్ ను రికార్డులకు ఎక్కించారు.
ఈ ఏడాది జనవరి 10న మండపేట పశుసంవర్ధక శిక్షణ కేంద్రంలో ప్రభుత్వాధికారులు, గిన్నిస్ సంస్థ ప్రతినిధుల సమక్షంలో అతిసూక్ష్మ చెక్క స్పూన్‌ను తయారు చేశారు. దీని కోసం ఆయనకు రెండు గంటల 13 నిమిషాల సమయం పట్టింది. అది కూడా 3.09 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఆ స్పూన్ ను ఆయన తయారు చేశారు. గిన్నీస్ రికార్డు సంస్థ నుంచి వచ్చిన సర్టిఫికెట్, మెడల్‌ను మంగళవారం మండపేటలో వెటర్నరీ రిటైర్డ్ జేడీ డాక్టర్ విజయకుమారశర్మ, ఒంగోలుకు చెందిన సృష్టి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ తిమ్మిరి రవీంద్ర, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చల్లా రవికుమార్, ఎస్ఆర్ అసోసియేషన్ అధినేత రాకుర్తి సత్యనారాయణ తదితరులు ఆవిష్కరించారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.