హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Lunar Eclipse: చంద్రగ్రహణం వీడడంతో తెరుచుకున్న ఆలయాలు.. ఇత్తడి పళ్లెంలో రోకలి నిలబెట్టి ప్రత్యేక పూజలు..

Lunar Eclipse: చంద్రగ్రహణం వీడడంతో తెరుచుకున్న ఆలయాలు.. ఇత్తడి పళ్లెంలో రోకలి నిలబెట్టి ప్రత్యేక పూజలు..

రోకలి నిలబెట్టి ప్రత్యేక పూజలు

రోకలి నిలబెట్టి ప్రత్యేక పూజలు

Lunar Eclipse: ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు కాస్త నమ్మకాలు ఎక్కువే ఉంటాయి. ముఖ్యంగా గ్రహణాల సమయాల్లో చాలా సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. ఇప్పుడు చంద్రగ్రహణం వీడడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నాయి. మరోవైపు గ్రామాల్లో ఇత్తడి పల్లెంలో రోకలి నిలబెట్టి ప్రత్యేక పూజలు చేశారు.. ఎందుకిలా చేస్తారో తెలుసా?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kakinada, India

Lunar Eclipse:ఈ ఏడాది చిట్ట చివరి చంద్ర గ్రహణం (Lunar Eclipse) వీడింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాలు మళ్లీ అన్నీ తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం వీడడంతో సంప్రోక్షణ తరువాత ఆలయాల ను తెరిచారు. అయితే సాధారణంగా మన రాష్ట్రంలో ఈ గ్రహణాలలో కొన్ని పద్ధతులు, నమ్మకాలను పాటిస్తూ ఉంటారు. గ్రహణం సమయంలో తమకు ఇష్టమైన దేవుడిని ఆరాధిస్తూ.. ప్రత్యేక మంత్రులు పఠిస్తారు. అలాగే చంద్ర గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కూడా. అంతేకాదు గ్రహణం సమయంలో చాలా వరకు రోడ్లు అన్నీ నిర్మాణుష్యంగా కనిపించాయి. ఎందుకంటే గ్రహణం సమయంలో రోడ్డుపైకి రాకూడదు అన్నది చాలామంది నమ్మకం.. ఇంకా ఇలాంటి సెంటిమెంట్ లు ఎన్నో ఉన్నాయి.

ముఖ్యంగా గ్రహణం సందర్భంగా అనేక ప్రాంతాల్లోని మహిళలు పోటీపోటీగా ఇత్తడి పళ్లెంలో రోకలిని నిలబెట్టారు. ఎందుకంటే గ్రామాల్లో ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఇలా రోకళ్లను నిలబెడుతూ వస్తున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి రమణయ్యపేటలో చంద్రగ్రహణం సందర్భంగా ఇత్తడి పళ్ళెంలో మహిళలు నీరు పోసి రోకలిబెట్టారు.

ఇలా మహిళలు అంతా కలిసి ఇంటి ముందు ముగ్గువేసి.. అందంగా ఆ ముగ్గుని అలంకరించి పూజాది కార్యక్రమాలను నిర్వహించి.. ఆ ముగ్గులో ఇత్తడి పళ్లెం ఏర్పాటు చేశారు. అనంతరం ఆ పళ్లెంలో నీరు పోసి.. రోకలిని పెట్టారు. గ్రహణ సమయంలో రోకలి నిటారుగా నిలబడింది. ఈ రోకలి సాయంత్రం చంద్రగ్రహణం పట్టు విడిచే వరకు నిలబడే ఉంటుందని మహిళల నమ్మకం.

మరోవైపు చంద్రగ్రహణం వీడడంతో తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరచుకుంది.. మంగళవారం ఉదయం సరిగ్గా 8:41 గంటలకు ఆలయ మహా ద్వారాలను చంద్రగ్రహణంకు పదకొండు గంటల ముందే మూసి వేసారు అర్చకులు.. దీంతో స్వామి వారి దర్శనంకు విచ్చేసే భక్తులను తాత్కాలికంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అనుమతిని రద్దు చేసింది టిటిడి.. అంతే‌ కాకుండా తిరుమలలో లడ్డూ వితరణ, అన్నప్రసాదం వితరణను సైతం టిటిడి నిలిపి వేసింది.

ఇదీ చదవండి : చేతులతో అద్భుతాలు చేస్తున్న చిన్నారి.. రికార్డులు మోత మోగిస్తున్న చిచ్చరపిడుగు

చంద్రగ్రహణం వీడిన అనంతరం శాస్త్రబద్దంగా ఆలయ అర్చకులు రాత్రి 7:27 గంటలకు టిటిడి అధికారుల సమక్షంలో ఆలయ ద్వారాలను తెరిచారు.. తరువాత ఆలయ శుద్ది కార్యక్రమంను చేపడుతూ ఒక్కొక్క ద్వారంను తెరిచారు ఆలయ అర్చకులు పుణ్యవచనంను నిర్వహించడంతో గ్రహదోషం తోలగి పోయింది.. తరువాత మూలవిరాట్టు‌పై కప్పిన వస్త్రంను తొలగించి స్వామి వారికి రాత్రి కైంకర్యాలైన తోమాల, అర్చన సేవలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Kakinada, Lunar Eclipse

ఉత్తమ కథలు