P Ramesh, News18, Kakinada
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNEGS) అంటే తెలియని వారుండరు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈపథకం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో పని కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యం. అయితే అన్ని బాగానే ఉన్నా, రాజకీయ పెత్తందార్లు, లోకల్‌గా ఉంటే పెద్దల ప్రభావంతో అక్కడ ఉన్న ఉపాధి సిబ్బంది ప్రభావానికి గురవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గతం నుండి దీనిపై ప్రతీయేటా ఆడిట్ జరుగుతోంది. కానీ రికవరీ మాత్రం రావడం లేదు. కాకినాడ జిల్లా (Kakinada District) లో కరప మండలంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం మండల సోషల్ ఆడిట్ సమావేశాన్ని గుట్టు చప్పుడు నిర్వహించడమే కాక, లెక్కల్లో తేడాలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
జిల్లా డ్వామా పీడీఅడపా వెంకటలక్ష్మి పాల్గొని సామాజిక తనిఖీ ఎస్ఆర్పీలు ఇచ్చిన నివేదికలతో ఆయా శాఖల నుండి రికవరీ సొమ్ము 10 లక్షలు వరకూ తీసుకోవాలని నిర్ణయించారు. 2022 మార్చి వరకు ఏడాది పాటు జరిగిన పనులకు సుమారు పది లక్షల రూపాయలు అక్రమాలను గుర్తించారు. గత పది రోజులుగా ఎస్ఆర్పిలు కరప మండలం 23 గ్రామాల్లో లో ఉపాధి హామీ ఇతర శాఖల పనిలన్నుతనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యు ఎస్ శాఖల ఇంజినీరింగ్ అధికారులు నుండి సుమారు పది లక్షలు రికవరీ చేసేందుకు, పంచాయతీరాజ్ శాఖ నుండి 5లక్షల 44,730 రికవరీ, ఆర్డబ్ల్యుఎస్ శాఖ నుండి 4 లక్షల నలభై ఆరువేల 748 రూపాయలు రికవరీ కావాలని ఉపాధి హామీ సిబ్బంది నుండి కేవలం 4 వేల రూపాయలు రికవరీ చేయాలని ఆదేశాలిచ్చారు. అయితే గత ఏడాది మార్చి వరకూ మాత్రమే ఏడాది కాలానికి ఆడిట్ నిర్వహించగా కొన్ని అవకతవకలు మాత్రమే అధికారులు గుర్తించారు.
అన్ని శాఖల నుండి ఉపాధి హామీ ద్వారా జరుగు పనులకు ఇంకా చాలానే రికవరీ చేయవలసి వస్తుందని స్పష్టం చేశారు. 5077 పని దినాలకు గాను, వేతనాల ఖర్చు 7 కోట్ల 60 లక్షల 89 వేల 115 కాగా, మెటీరియల్ సామాగ్రి ఖర్చు 3 కోట్ల 80 లక్షల 37,846 గా నిర్ధారణ చేశారు. ఈ తనిఖీల్లో గుర్తించిన సొమ్ము ఆయా శాఖల అధికారుల నుండి రికవరీ చేయాలని డ్వామా పీడి నిర్ణయించారు. అయితే కేవలం నిర్ణయం మాత్రమే జరిగింది. రికవరీలో వేగం ఉంటుందా అంటే పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో మస్తరు, పనుల వివరాలు జరుగుతున్నా అక్రమాలు జరగడం అధికారులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kakinada, Local News