Home /News /andhra-pradesh /

EAST GODAVARI KONASEEMA PEOPLE FACING INTERNET PROBLEMS AFTER AMALAPURAM RIOTS FULL DETAILS HERE PRN

Konaseema: ఇంటర్నెట్ ఎంతపని చేసింది..! గోదారి గట్ల వెంట సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పరుగులు

కోనసీమలో ఇంటర్నెట్ లేక జనం అవస్థలు

కోనసీమలో ఇంటర్నెట్ లేక జనం అవస్థలు

Konaseema News: సోషల్ మీడియా ద్వారానే అల్లర్లకు వ్యూహరచన జరిగిందన్న వార్తల నేపథ్యంలో కోనసీమలో ఇంటర్నెట్ ను బంద్ చేశారు. దీంతో దాదాపు వారం రోజులుగా జిల్లా వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.

  ఆ ప్రాంతం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఎటుచూసినా పచ్చదనం, కొబ్బరితోటలతో అందంగా కనిపిస్తుంటుంది. అక్కడి ప్రజలు కూడా ఆప్యాయంగా పలకరించుకుంటూ హాయిగా జీవిస్తుంటారు. అదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari) లోని కోనసీమ ప్రాంతం. జిల్లాల పునర్విభజనలో భాగంగా కోనసీమ జిల్లా (Konaseema) గా ఏర్పడింది. ఐతే జిల్లా పేరు మార్పు అంశం కోనసీమను రణసీమగా మార్చింది. అమలాపురం (Amalapuram) లో ఈనెల 24 న జరిగిన విద్వంసకర సంఘటనల కారణంగా ఒక మంత్రి, ఎమ్మెల్యే ల నివాసాలకు, పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అల్లర్లను దృష్టిలో పెట్టుకొని పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. సోషల్ మీడియా (Social Media) ద్వారానే అల్లర్లకు వ్యూహరచన జరిగిందన్న వార్తల నేపథ్యంలో కోనసీమలో ఇంటర్నెట్ ను బంద్ చేశారు. దీంతో దాదాపు వారం రోజులుగా జిల్లా వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.

  దీని కారణంగా గత వారం రోజులుగా ఇంటర్నెట్ (Internet) నిలిపివేయడంతో రాజోలు, అమలాపురం నియోజకవర్గాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఇక్కడి పరిస్థితులను ఉద్యోగులు తమ కంపెనీల యజమాన్యాలకు చెప్పినా సడలింపులివవ్డం లేదు. దీంతో ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో ఇంటర్నెట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.

  ఇది చదవండి: ఈ ఫ్లైట్ ఎక్కాలంటే టికెట్ అవసరం లేదు.. ఫుడ్ ఆర్డర్ ఇస్తే చాలు..


  దీంతో ఇంటర్నెట్ సౌకర్యమున్న కాకినాడ, యానాం, రాజమండ్రి, పాలకొల్లు, భీమవరం, నర్సాపురం వంటి ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.కొందరు ఉద్యోగులైతే నలుగురైదుగురు కలిసి రూమ్ లు అద్దెకు తీసుకొని అక్కడే ఉండిపోతున్నారు. మరికొందరు గోదావరి గట్లు, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లి చెట్లకిందే ల్యాప్ టాప్లో పనులు చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

  ఇది చదవండి: పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేష్.? త్వరలోనే రంగంలోకి.. బాబు స్కెచ్ ఇదేనా..?


  సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటే.. స్థానికంగా ఉండే ఇంటర్నెట్ సెంటర్లు, బ్యాంకుల వంటివాటికి ఇబ్బందులు తప్పడం లేదు. డిజిటల్ లావాదేవీలు, మినీ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇక సచివాలయ సిబ్బంది కూడా నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలకు ఈకేవైసీ చేయాలన్నా, లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలన్నా, అమ్మఒడి, రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాల్లో మార్పులు చేయాలన్నా నెట్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

  ఇది చదవండి: బాబోయ్ బెజవాడ..! అటువైపు వెళ్లాలంటేనే హడల్.. కారణం ఇదే..!


  ఇంటర్నెట్ రాకపోవడంతో ఉద్యోగులు ఇలా ఇబ్బందులు పడుతుంటే.. మొబైల్ గేమ్స్ ఆడే అవకాశం లేకపోవడంతో పిల్లల వేదన అంతా ఇంతా కాదు. మొబైల్ గేమ్స్ కు అడిక్ట్ అయిన వారు నెట్ కోసం కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. ఐదారు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి సిగ్నల్ వచ్చిన చోట కూర్చొని ప్రీ ఫైర్, పబ్ జీ వంటి గేమ్స్ ఆడుతున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East Godavari Dist, Internet

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు