హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Viral News: చిరంజీవి సినిమా ఎఫెక్ట్.. యముడికి భక్తుడిగా మారిన వ్యక్తి.. ఏం చేశాడో చూడండి..!

Viral News: చిరంజీవి సినిమా ఎఫెక్ట్.. యముడికి భక్తుడిగా మారిన వ్యక్తి.. ఏం చేశాడో చూడండి..!

కోనసీమలో యమధర్మరాజుకి భక్తుడు

కోనసీమలో యమధర్మరాజుకి భక్తుడు

Konaseema: ఇదంతా ఒక ఎత్తయితే మనిషి తలుచుకోవడానికే భయపడే ఓ దేవుడ్ని పూజిస్తున్నాడో వ్యక్తి. పూజించడం అంటే అలాఇలా కాదు.. ఏకంగా శరీరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అంతేనా బైక్ మొత్తం ఆయన పేర్లతో నింపేశాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Amalapuram, India

ఈ భూమి మీద ఉన్న దాదాపు 99శాతం మందికి భక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి పూజిస్తారు. ఇక భారతదేశంలో భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముక్కోటి దేవతలను వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. అంతేకాదు చెట్టు, పుట్ట, రాళ్లురప్పల్లోనూ.. ప్రకృతిలోనూ.. కనిపించే ప్రతి దాంట్లోనూ దైవాన్ని చూస్తుంటారు. కొన్ని జంతువులను కూడా దైవాలుగా చూస్తారు. ఇక దేవుళ్ల విషయానికి వస్తే.. శ్రీ కృష్ణుడు (Sri Krishna), శ్రీ రాముడు (Sri Ramudu), వెంకటేశ్వరుడు (Sri Venkateswara Swamy), జీసస్ క్రైస్ట్ (Jesus Christ), అల్లా (Allah) తమ మతాలకు అనుగుణంగా దేవుణ్ణి పూజించి ఆయా సాంప్రదాయాల్లో భక్తిని చాటుతుంటారు. ఇక దేవుళ్లయినా ఆలయాలు లేని వారు కూడా ఉన్నారు.


ఇదంతా ఒక ఎత్తయితే మనిషి తలుచుకోవడానికే భయపడే ఓ దేవుడ్ని పూజిస్తున్నాడో వ్యక్తి. పూజించడం అంటే అలాఇలా కాదు.. ఏకంగా శరీరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అంతేనా బైక్ మొత్తం ఆయన పేర్లతో నింపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కోనసీమ జిల్లా (Konaseema District) అంబాజీపేట మండలం మాచవరంకు చెందిన ఓ వ్యక్తి యమ ధర్మరాజుకి పరమ భక్తడిగా మారిపోయాడు.



ఇది చదవండి: వినాయక చవితిపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన.. పర్మిషన్ ఫీజుపై క్లారిటీ..!


ఇంతకీ యమధర్మరాజుకి భక్తుడిగా మారడానికి కారణం ఏంటో తెలుసా..? మెగాస్టార్ చిరంజీవి నటించిన శ్రీ మంజునాథ సినిమా చూసినప్పటి నుంచి యమధర్మరాజుకి భక్తుడయ్యాడట. అందులో ఎన్ని పూజలు చేసినా భక్తుడు యమపాశం రాగానే ప్రాణాలు వదలక తప్పలేదు. అప్పటి నుంచి యమధర్మరాజు ముందు ఎవరైనా ఒక్కటేనని.. అందర్నీ సమానంగా తీసుకెళ్తూ సమవర్తిగా ఉన్నాడని.. అందుకే ఆయనకు పరమ భక్తుడిగా మారినట్లు చెప్పాడు.


ఇది చదవండి: వైజాగ్ సాయి ప్రియాంక గుర్తుందా..? ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. ఏం జరిగిందంటే..!


ప్రస్తుతం మాచవరం గ్రామంలో యమ భక్తుడి గురించే అందరూ చెప్పుకుంటున్నారు. కలలో కూడా తలచుకోవడానికి భయటపడే యముడ్ని.. నిత్యం స్మరించుకోవడం ఏంట్రా బాబు అని చెప్పుకుంటున్నారు. ఐతే ఎవరెన్ని అనుకున్నా తాను మాత్రం యమధర్మరాజుని పూజిస్తూనే ఉంటానని చెబుతున్నాడు. అంతేనా యమధర్మరాజుని నిత్యం తలుచుకోవడం వల్ల చావంటే భయం పోతుందని.. మనసు ప్రశాంతంగా ఉంటుందన్నాడు.



సాధారణంగా హిందూ ఆలయాల్లో యముడికి పూజలు జరగవు. తెలుగు రాష్ట్రాల్లో అయితే యముడికి ఆలయాలు లేవు. మరి కోనసీమ వ్యక్తికి యముడ్ని పూజించాలన్న ఆలోచన ఎలా వచ్చిందోగానీ ప్రస్తుతం ఆయన మాత్రం నెట్టింట్లో వైరల్ గా మారాడు. అతడి గురించి.. యమభక్తుడనే ట్యాగ్ లైన్స్ కూడా తగిలిస్తున్నారు. ఇందులో మరో కొసమెరుపు కూడా ఉంది. సదరు వ్యక్తి పవన్ కల్యాణ్ అభిమాని.. ఆయన ఫోటోని కూడా బైక్ పై ప్రింట్ చేయించుకున్నాడు.

First published:

Tags: Andhra Pradesh, East Godavari Dist, Viral Videos

ఉత్తమ కథలు