P Ramesh, News18, Kakinada
రైతు అంటే ఆరుగాలాలు కష్టపడి పంట పండిస్తాడు. అందుకే దేశానికి రైతు వెన్నెముఖ అంటారు పెద్దలు.రైతు కష్టపడటంలో అతనికి అతడే సాటి. ఉదయం లేస్తే పొలంలోనే తన రోజున ప్రారంభిస్తాడు. ముఖ్యంగా పంట కాలంలో పొలం వద్దే ఉంటూ కాపాడుకుని, ఎంతో కొంత లాభంతో గట్టెక్కుదామని చూస్తుంటాడు. అయితే ప్రకృతి ప్రకోపాలకు రైతు బలవుతున్నాడు. ఇది సర్వసాధారణం. ప్రకృతిని అడ్డుకునే శక్తి మానవునికి లేదు. అయితే మనకు మనమే వాతావరణాన్ని నాశనం చేసుకుంటుంటే ఎవరికి చెప్పాలి. ఏం చేయాలి. ఇక్కడ పరిస్థితి కూడా అదే. ముఖ్యంగా కోనసీమ జిల్లా (Konaseema Distric) లో రైతులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితి చూస్తే ఎవ్వరైనా జాలి పడాల్సిందే.
ఇటీవల కాలంలో కోనసీమ జిల్లాలో ఆయిల్ ఇండియా వేస్తున్న రిగ్ ల వల్ల వాతావరణం కలుషితమవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా రిగ్ ల మాటున జరుగుతున్న పనుల వల్ల వాతావరణం దెబ్బతింటుందంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా వరి పంటతోపాటు, కొబ్బరి తోటలు బాగా దెబ్బ తింటున్నాయంటున్నారు. ఇటీవల కాలంలో గేదెల్లంక గ్రామంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై వారు ఆందోళన కూడా చేశారు.
మరీ ముఖ్యంగా కౌలు రైతులు ఈ విషయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. పలుమార్లు అధికారులకు చెప్పినా, జాతీయ సంస్థలు, కార్పోరేట్ సెక్టార్ పరిధిలో ఉన్నందున పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈప్రభావం పరోక్షంగా రైతులపై పడుతోంది. భూగర్భ నిక్షపాల కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంటున్నారు. దీంతో రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం దీనిపై పెత్తనం వహించడం సాధ్యం కాదు. వాస్తవానికి పర్యావరణ నిబంధనలను ఈ రిగ్గ్ సంస్థలు నిర్వర్తించాలి. కానీ క్షేత్రస్థాయిలో అనుకున్న విధంగా వారికి పనులు జరగకపోవడంతో వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో ఆప్రభావం పంటలపై పండటంతో రైతులు గగ్గొలు పెడుతున్నారు. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నప్పటికీ ఎవరూ రిగ్గ్‌లను అడ్డుకునే సాహాసం చేయడం లేదు. అయితే ఇప్పటికే పండించిన ధాన్యం అమ్మడానికి ఆపసోపాలు పడుతున్న రైతులు ఇక్కడ ప్రాంతంలో పంట పండించడానికి భయపడిపోతున్నారు. నేల పొడిగా తయారైవుతోంది. కొబ్బరి మొక్కులు మాడిపోతున్నాయి. కొబ్బరి చెట్లు ఫల సాయం తగ్గిపోయింది. ఆకులు మాడిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఇవన్ని కేవలం రిగ్ ల కోసం జరుగుతున్న పనుల ప్రభావంగానే చెప్పుకొస్తున్నారు. తమ సమస్య పరిష్కరించాలని అక్కడి రైతులు ఆందోళన బాట పట్టారు. అయినప్పటికీ రిగ్ లల విషయంలో తమ జోక్యం ఉండదని చెబుతున్నారు అధికారులు. నిబంధనలు పాటించేలా మాత్రం చర్యలు తీసుకుంటామంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు కోనసీమలో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.