P Ramesh, News18, Kakinada
విదేశీ వాణిజ్య హబ్‌గా కాకినాడ (Kakinada).. ఆ మాటలన్నది ఎవరో తెలుసా..అక్కడే ఎందుకంతా క్రేజ్.. ఎగుమతులు దిగుమతులు వెనుక ఆ కథేంటో తెలుసుకుందాం. ఎగుమతులు దిగుమతుల్లో ఎంతో ప్రాముఖ్యమున్న కాకినాడ నేడు విదేశీ హబ్ కేటగిరీలోకి చేరిపోయింది. ఈ మాట అన్నదెవరో కాదు సాక్షాత్తు మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Central Minister Nirmala Sitharaman). ఆమె నోట కాకినాడ వెలుగుతోంది అంటూ బాహాటంగా చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు ఐఐఎఫ్టి. భారతీయ విదేవీ వాణిజ్య సంస్థ(ఐఐఎఫ్టి)ని కాకినాడ జెఎన్‌టియూలో ప్రారంభించారు. ఇందులో నూతన భవనాన్ని ఆవిష్కరించడానికి కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్, పియూష్గోయల్ హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిలతోపాటు, కాకినాడ ఎంపీ వంగా గీత రాష్ట్ర అధికారులు, మంత్రులు పాల్గొని అట్టహాసంగా ప్రారంభించారు.
కేవలం డిగ్రీలతోనే సరిపెట్టుకోకుండా దేశ-విదేశాలతో అధ్యయన విధానంలో అందించే విదేశీ వాణిజ్య పరమైన విద్యను ఇక్కడ అందిస్తారు. తద్వారా విదేశాలతో వాణిజ్యపరంగా సంబంధాలు మెరుగుపరచుకోవచ్చు. ఇక్కడ కేంద్రం ఏర్పాటు కోసం కాకినాడ ఎస్ఈజెడ్లో 25 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాణిజ్య హబ్ రావడంలో కాకినాడ ఎంపీ గీత కృషిని వక్తలు కొనియాడారు.
కాకినాడ పోర్టే కీలకం
ఇక్కడ వాణిజ్య హబ్ ఏర్పాటుకు ముఖ్య కారణం కాకినాడ పోర్ట్. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. త్వరలో అత్యాధునిక క్యాంపస్‌ను కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్ఈట్లు స్పష్టం చేశారు. బియ్యం, ఆక్వా ఇతర ఎగుమతులకు కాకినాడ నుండే ప్రధానంగా వాణిజ్యం జరుగుతోందన్నారు. కాకినాడతోపాటు కృష్ణపట్నం, గంగవరం పోర్టు ఎగుమతులు పెరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. భారతీయ విదేశీ వాణిజ్య సంస్థ ఏర్పాటుతో ఇక్కడకు విదేశీ విద్యార్థులు వస్తారు. తద్వారా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి తెలుస్తాయి.
నూతన భవనం కాన్సెప్ట్ ఇదే
జెఎన్ టియూ కేంద్రంగా ఐఐఎఫ్టి భవనం ఏర్పాటు వెనుక పెద్ద కాన్సెప్ట్ ఉందనే చెప్పాలి. ఇక్కడ విదేశీ వాణిజ్యకు సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తారు. అక్కడ నుండి విద్యార్థులకు అవసరమైన, మెరుగైన బోధన పద్ధతులను వివరిస్తారు. భవిష్యత్తులో సెజ్‌లో ఏర్పాటయ్యే హబ్ నిర్మాణానికి సంబంధించి పూర్తి కసరత్తుకు ఐఐఎఫ్టి పునాదనే చెప్పాలి. మొత్తం మీద అంకురార్పణలో కాకినాడ జెఎన్‌టియూ కీలక పాత్ర పోషించడం వెనుక ప్రభుత్వ నుండి పూర్తి సహకారం ఉండటం కలిసొచ్చిన అంశం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kakinada, Local News, Nirmala sitharaman