హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆ కలెక్టర్ ‌కు పుస్తకాలే ఫస్ట్.. ఆ తర్వాతే ఏమైనా

ఆ కలెక్టర్ ‌కు పుస్తకాలే ఫస్ట్.. ఆ తర్వాతే ఏమైనా

కాకినాడ జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్

కాకినాడ జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్

జిల్లా కలెక్ట‌ర్ అంటే వామ్మో.. నిత్యం ప్ర‌జా స‌మ‌స్య‌లతో స‌త‌మ‌తం అవుతుంటారు. అయితే ఆ జిల్లా క‌లెక్టర్‌ మాత్రం పుస్త‌కాల‌పై ఉన్న ఇష్టాన్ని ఏలా చూపించారో తెలుసా..! ఆమె జిల్లా గ్రంథాల‌యాన్ని సంద‌ర్శించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kakinada | Andhra Pradesh

P Ramesh, News18, Kakinada

సాధార‌ణంగా పుస్త‌కాల‌పై ఇష్టం అంటే అది కొంత మందికే సాధ్యం. బాగా క‌ష్ట‌ప‌డి చ‌దివిన వారు ఏదో స‌మ‌యంలో పుస్త‌కాల‌ను చూస్తూనే ఉంటారు. అయితే ఉద్యోగం వ‌చ్చిన త‌ర్వాత తీరక ఉండ‌దు. పైగా జిల్లా కలెక్ట‌ర్ అంటే వామ్మో.. నిత్యం ప్ర‌జా స‌మ‌స్య‌లతో స‌త‌మ‌తం అవుతుంటారు. అయితే ఆ జిల్లా క‌లెక్టర్‌ మాత్రం పుస్త‌కాల‌పై ఉన్న ఇష్టాన్ని ఏలా చూపించారో తెలుసా..! ఆమె జిల్లా గ్రంథాల‌యాన్ని సంద‌ర్శించారు. పుస్త‌కాల‌పై ఉన్న మ‌క్కువ‌ను చూపించారు. కాకినాడ జిల్లా (Kakinada DIstrict) క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా పట్టణంలో మెయిన్ రోడ్డులో ఉన్న జిల్లా గ్రంథాలయాన్ని సంద‌ర్శించారు. గ్రంథాలయానికి నిత్యం వచ్చే పాఠకులకు, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, దినపత్రికలు, పుస్తకాల వివరాలు, పుస్తకాల కొనుగోలు ప్రక్రియ విధి విధానాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దినపత్రికలు, పుస్తకం విభాగం, పోటీ పరీక్షలు తదితర విభాగాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పోటీ పరీక్షల విభాగంలో పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో కలెక్టరు మాట్లాడి పోటీ పరీక్షల వివరాలు, గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పోటీ పరీక్షల పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కృతికా శుక్లా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవ‌స‌ర‌మైన సౌకర్యాలను కల్పించాలన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని డిజిట‌లైజేషన్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సిబ్బందిని కలెక్టరు ఆదేశించారు. గ్రంథాలయ భవనం పైఅంతస్తుపై అదనపు నిర్మాణాల‌కు అంచనాలు సిద్ధం చేయడంతో పాటు మరమ్మత్తు పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు జిల్లా కలెక్టరు కృతికా శుక్లా స్పష్టం చేశారు.

ఇది చదవండి: బెజవాడలో బెస్ట్ స్వీట్ ఇదే..! ఈ టేస్ట్ మరెక్కడా దొరకదు..!

గ‌తంలో ఎన్న‌డూ ఏ క‌లెక్ట‌ర్ కూడా గ్రంథాల‌యాన్ని సంద‌ర్శించి ప్ర‌త్యేక దృష్టి సారించిన దాఖ‌లాలు లేవు. క‌రోనా కాలంలో చాలా మంది పుస్త‌క ప్రేమికులు గ్రంథాల‌యానికి దూర‌మ‌య్యారు. అక్క‌డ నుండి దిన ప‌త్రిక‌లు స‌రిగా రావ‌డం లేదు. క‌థ‌ల పుస్త‌కాలు కూడా కొన్నింటిని మాత్రమే గ్రంథాల‌యాల‌కు పంపిస్తున్నారు. ఈనేప‌థ్యంలో గ్రంథాల‌యాల‌కు పుస్త‌కాల కొర‌త‌తో పాటు, పేప‌రు బిల్లుల చెల్లింపులు వంటి వాటిపై దృష్టి పెట్ట‌డం నిజంగా గ్రంథాల‌య అభిమానుల‌కు వ‌రంగా చెబుతున్నారు. ఇలా క‌లెక్ట‌ర్ జిల్లా గ్రంథాల‌యాన్ని ప‌రిశీలంచ‌డం చూస్తుంటే ఆమెకు పుస్త‌కాల‌పై ఉన్న ప్రేమ అర్థమతుంద‌ని అంటున్నారు పుస్త‌క ప్రేమికులు.

First published:

Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News

ఉత్తమ కథలు