P Ramesh, News18, Kakinada
కాకినాడ జిల్లా (Kakinada District) లో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. ఇటీవల కాలంలో భారీగా చేపట్టిన ఉద్యోగ మేళాలతో పాటు ఈనెల 6న మరో భారీ జాబ్ మేళాకు రంగం సిద్ధమైంది. కనీసం పదవతరగతి పాసై ఆపైన చదువుకుని ఖాళీగా ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. కలెక్టరేట్ వేదికగా ఈ జాబ్ మేళాకు రంగం సిద్ధం చేశారు అధికారులు. కాకినాడలోని వికాస కేంద్రం ఆధారంగా జరిగే ఈ జాబ్ మేళాకు సంబంధించి జిల్లా కలెక్టర్ కృత్రికా శుక్లా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తోపాటు, ఎంపీ వంగా గీత, ఇతర అధికారులు కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యి విజయవంతంచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడకు వచ్చిన నిరుద్యోగులు సంతృప్తి చెందేలా, జాబితాలో పేర్కొన్న అన్ని కంపెనీల ప్రతినిధులు వచ్చేలా చూస్తున్నారు.
ఇంటర్యూలు ఇలా..
సాఫ్ట్ వేర్, పారిశ్రామిక రంగం, ఆటో మొబైల్, ఫైనాన్స్ రంగాల్లో వివిధ పలు పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇందుకు ఆయా విభాగాల అవసరతను బట్టి విద్యర్హతను నిర్ణయించారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయితోపాటు, ఇంజనీరింగ్ డిప్లమో, బిటెక్, ఎమ్‌టెక్ చదివిన విద్యార్థులు, సైన్స్ విభాగాల్లో డిగ్రీ, పీజీలు చేసిన వారికి పోస్టులు ఉన్నాయి. బీకాం, కామర్స్, బీఏ చదివిన విద్యార్థులను వారి సామర్థ్యం ఆధారంగా పలు విభాగాల్లో ఉన్న పోస్టులకు ఎంపికచేసే అవకాశం ఉంది.
ముఖ్యంగా విప్రో కంపెనీలో ఉద్యోగాలతోపాటు, నాన్‌వాయిస్ ప్రొసెస్ విధానంలో ఎంపికలు, ప్రైవేటు కంపెనీల్లో అకౌంటెంట్స్, సూపర్ వైజర్లు, టెలికాలర్స్, డెక్కన్ కెమికల్స్‌లో ఉద్యోగాలు ఎంపికకుఏర్పాట్లు చేశారు. వీటితోపాటు హూండాయ్ మొబీస్‌లో టెక్నిషియన్, స్కిల్‌డవలప్‌మెంట్ ప్రొగ్రామ్‌లో శిక్షణనిచ్చి ఉద్యోగం ఇస్తారు. వీరిలో అర్హతను బట్టిఎంపికైన వారికి రూ.10000 నుండి రూ.25000 వరకూ జీతాలు ఉండవచ్చు.
కాకినాడ కలెక్టరేట్ లో వికాస కార్యాలయంలో ముందుగా హాజరు కావాలి. ఎంపికలు చేసే విధానంపై తెలుసుకోవచ్చు. సర్టిఫికెట్స్ జిరాక్స్‌లను వెంట తీసుకువెళ్లాలి. నిరుద్యోగ అభ్యర్థులు వారి ఫొటోలను కూడా తీసుకెళ్తే మంచిది. ముఖ్యంగా దరఖాస్తు ఫారంలో పూర్తి అడ్రస్, వారి వివరాలు, ఆధార్, ఫోన్ నెంబర్ ను తప్పనిసరిగా పొందుపరచాలి. ముందస్తుగా వివరాల కోసం 8297400666 నెంబరును సంప్రదించవచ్చు. సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి ప్రయత్నించే అభ్యర్థులకు సంబంధిత కంపెనీల్లో అనుకున్న ప్యాకేజీ లభించకపోతే వారి వివరాలను వికాస కేంద్రంలో అందజేయవచ్చు. సంబంధిత పోస్టులకు సంబంధించిన జాబ్ మేళాలు జరిగినప్పుడు వారికి సమాచారం అందిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Job Mela, Kakinada, Local News