హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే రాపాక.. ఫోన్ స్విచ్ ఆఫ్.. ఈసీ వేటు వేస్తుందా..?

Breaking News: అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే రాపాక.. ఫోన్ స్విచ్ ఆఫ్.. ఈసీ వేటు వేస్తుందా..?

ఎమ్మెల్యే రాపాక మిస్సింగ్

ఎమ్మెల్యే రాపాక మిస్సింగ్

Breaking News: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తనకు పది కోట్ల ఆఫర్ ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి.. వార్తలో హెడ్ లైన్ గా నిలిచిన రాపాక వర ప్రసాద్.. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది. అయితే రాపక ఎమ్మెల్యే వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏమైంది అంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • East Godavari, India

Breaking News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ (Rajole MLA Rapaka Varaprasad) సంచలనంగా మారారు.  గత ఎన్నికల్లో జనసేన (Janasena) తరపున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యేగా అందరి ఫోకస్ తనపై పడేలా చేసుకున్నారు. తరువాత  సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కు జై కొట్టి.. సొంత పార్టీకి రెబల్ గా మారారు. అప్పటి నుంచి ఆయన వార్తల్లో నిలుస్తూనే వచ్చారు. అయితే తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Quota MLC Elections) సమయంలో మరోసారి హెడలైన్స్ లోకి వచ్చారు రాపాక. ఎందుకంటే టీడీపీకి ఓటు వేస్తే తనకు పది కోట్లు ఇస్తానంటూ ఆఫర్ చేశారని వ్యాఖ్యలు చేస్తూ.. అందరి ఫోకస్ తనపై పడేలా చేసుకున్నారు. ఆ వ్యాఖ్యల్లో నిజం ఎంత ఉందో తెలీదు కానీ..  ఇప్పుడు సడెన్ గా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఎమ్మెల్యే రాపాకా మిస్ అవ్వానికి ప్రధాన కారణం.. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే.. కార్యకర్తల మీటింగ్ లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే 10 కోట్లు ఇచ్చే వారని చేసిన టైంలోనూ.. రెండు సార్లు తాను నెగ్గడానికి కారణం ఏంటో సీక్రెట్ రివీల్ చేశార. తాను దొంగ నోట్లు వేయించుకుని గెలిచానని ఆ వీడియోలో చెప్పారు.

 ఇదీ చదవండి : సీఎం జగన్ మారారా..? ఈ మార్పుకు కారణం ఏంటి..? కేడర్ ఏమనుకుంటున్నారు..?

ప్రస్తుతం రాపాక చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన ఎరక్కిపోయి ఇరుక్కున్నారా.. సొంత పార్టీ నేతలే ఇరికించారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే.. టీడీపీ తనకు పది కోట్లు ఆఫర్ చేసిందనే వ్యాఖ్యలను వైరల్ చేయాలని వైసీపీ సోషల్ మీడియా భావించింది. అయితే అదే సమయంలో దొంగ ఓట్లతో తాను గెలిచాను అని చెప్పడంతో.. ఎరక్కపోయి ఇరుకున్నారు రాపాక.. ఇవాళ మధ్యాహ్నం సఖినేటిపల్లి గ్రామంలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయినప్పటికీ ఎమెల్యే అందుబాటులో లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అధికారులు ఆ కార్యక్రమాన్ని తాత్కలికంగా వాయిదా వేశారు.

తెలుగు దేశం పార్టీని ఇరికించాలని.. ఆయన వీడియో వైరల్ చేస్తే.. అది రివర్స్ లో ఆయనకే తగిలింది. ఒక్కొక్కరు తనకు పదికి పైగా దొంగ  ఓట్లు వేయడంతోనే రెండు సార్లు గెలిచానని అందులో అయన అనడం ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇదే అంశాన్ని ఈసీకి ఫిర్యాదు చేయాలని జనసేన , వైసీపీ నేతలు సిద్ధమయ్యారు.. రాపాక చేతిలో ఓడిన టీడీపీ అభ్యర్థి దీనిపై  ఈసీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. దీంతోనే రాపాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి.. మిస్ అయ్యారని తెలుస్తోంది. మరి ఆయన ఎక్కడ కు వెళ్లారు అన్నదానిపై ఇప్పటి వరకు ఆయన అనుచరులకు తెలియడం లేదు అంటున్నారు. మరి ఈసీకి ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి..

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Janasena, Rapaka varaprasad

ఉత్తమ కథలు