హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MLA Rapaka: దొంగ ఓట్ల వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే.. అసలు జరిగింది ఏంటంటే..?

MLA Rapaka: దొంగ ఓట్ల వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే.. అసలు జరిగింది ఏంటంటే..?

ఎమ్మెల్యే రాపాక (file)

ఎమ్మెల్యే రాపాక (file)

MLA Rapaka: ఎమ్మెల్యే మిస్ అయ్యారు అంటూ వార్తల నేపథ్యంలో.. రాపాక వరప్రసాద్ వివిరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను అంతా వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై తాను వ్యాఖ్యలు చేయలేదని చెప్పలేదు. కానీ ఏమన్నారంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • East Godavari, India

MLA Rapaka: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై (MLA Quota MLC Elections Result)  దుమారం కంటిన్యూ అవుతూనే ఉంది. అందులో భాగంగా జనసేన రెబల్ ఎమ్మమెలయే రాపక వర ప్రసాద్ సైతం హైలైట్ అయ్యారు. టీడీపీ అనుకూలంగా ఓటు వేస్తే.. తనకు పది కోట్లు ఆఫర్ వచ్చిందని సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. అదే సమయంలో ఆయన చేసిన మరికొన్ని వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో అవి వైరల్ అయ్యాయి. త‌న‌ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మాట్లాడిన ఆయన.. రెండు సార్లు గెలవడం వెనుకాల సీక్రెట్ ను రివీల్ చేశారు. తనకు భారీగా దొంగ ఓట్లు వేయడంతో మెజార్టీ వ‌చ్చింటూ అందులో చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగింది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. అప్పటి నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రావడం.. ఎవరికీ కనిపించకపోవడంతో మిస్ అయ్యారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజగా తనపై వవ్చిన ఆరోపణలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

రాపాక వర ప్రసాద్ ఏమన్నారంటే..? తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని.. ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌ల ఘ‌ట‌న‌ను న‌వ్వుకోవాడానికి మాత్ర‌మే తాను చెప్పాను అంటూ వివరణ ఇచ్చారు. అన్ని కులాలు వారు తనకు ఓట్లు వేయాడంతోనే ఎమ్మెల్యే అయ్యాన‌ని.. నవ్వుకోవడానికి అల మాట్లాడాన‌ని.. సీరియస్ గా చెప్పింది కాదని లైట్ తీసుకున్నాను అన్నారు. వైర‌ల్ అయిన మొత్తం వీడియోను కూడా విడుద‌ల చేసి వివ‌ర‌ణ ఇచ్చారు ఆయన.

ఆ సమయంలో ఏం మాట్లాడారు అంటే..? ఇటీవ‌ల ఓ స‌మావేశంలో ‘‘చింతలమోరిలో తన ఇంటి దగ్గర బూత్‌లో కాపుల ఓట్లు ఉండవని.. అన్నీ ఎస్సీల ఓట్లే ఉంటాయి. ఎవరో ఎవరికీ తెలిదు. సుభాష్‌తో పాటు వీళ్లంతా జట్టుగా వచ్చి ఒక్కక్కరు దొంగ ఓట్లు వేసి వెళ్లిపోయేవాళ్లు. పదిహేను, ఇరవై మంది వచ్చేవాళ్లు, ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేవాళ్లు. ఏకంగా ఈ ఓట్ల వల్ల 800 ఓట్ల వందల మెజార్టీ వచ్చింది’’ ఆ విడియో వినిపించడం వైరల్ గా మారింది.

ఇదీ చదవండి : ఏపీ స్పీకర్ ఫేక్ లా సర్టిఫికేట్ వివాదం.. అల్లుడి ఫిర్యాదుతో చర్యలు తప్పవా..? తమ్మినేనిపై వేటు పడుతుందా?

ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే రాపాక చేతిలో ఓడిన టీడీపీ అభ్యర్థి దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని ఇప్ప‌టికే ప్రకటించారు. ఫిర్యాదు అందితే ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసి. దీతో రాపాక వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఆయన వివరణ చూసిన తరువాత.. బాగానే కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని.. అయినా రాపాకపై చర్యలు తీసుకోవాడినికి ఆ వీడియో సరిపోతుంది అంటున్నారు. అది ఒరిజనల్ వీడియో అన్నది తాజాగా రాపాక వివరణతో అర్థమైంది.. అది ఒరిజనల్ వీడియో కాదు అనే చెప్పే అవకాశం ఉండదు. మరి ఇక ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి..

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Rapaka varaprasad