Home /News /andhra-pradesh /

EAST GODAVARI JANASENA CHIEF PAWAN KALYAN FANS TAKE 49 DAYS MALA WHAT IS THIS MALA DID YOU KNOW NGS

Pawan Kalyan: పవన్ మాల గురించి ఎప్పుడైనా విన్నారా..? ఎర్ర కండువాతో 49 రోజుల దీక్ష.. ఏం చేస్తారంటే..?

పవన్ కళ్యాణ్ (Twitter)

పవన్ కళ్యాణ్ (Twitter)

Pawan Kalyan: సాధారణంగా చాలామంది దీక్ష తీసుకుంటారు.. ముఖ్యంగా దేవుళ్ల పేరుతో కొన్ని రోజుల పాటు ప్రత్యేక మాల ధరించి.. ఆ మాల ఉన్ని అన్ని రోజులూ చాలా నిష్టంగా ఉంటారు. అలాగే ఇప్పుడు కొందరు పవన్ కళ్యాణ్ మాల ధరించారు.. పవన్ మాల ఏంటి..? అసలు ఏం చేస్తారు అనుకుంటున్నారా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    Pawan Kalyan: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు.. రాజకీయాల్లో గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. ఆయన అంటే పడిచచ్చే అభిమానులు కొన్ని కోట్లలో ఉన్నారు. పవన్ పేరు చెబితేనే లక్షల మందికి పూనకాలు వస్తాయి. అందుకే ఆయన కోసం ఏం చేయడానికైన సిద్ధం అంటారు. సామాన్య అభిమానులే (Pawan kalyan Fans) కాదు.. సెలబ్రిటీలు.. సినిమా కు సంబంధించిన వారు కూడా పవన్ తమ దేవుడు అని చెబుతుంటారు.. ఇవన్నీ పవన్ ను అభిమానులు ఎంతలా ప్రేమిస్తారో చెప్పడానికి నిదర్శనలు మాత్రమే. ఇటు పవన్ కళ్యాణ్ సైతం అదే అభిమానం వారిపై చూపిస్తుంటారు. అంతేకాదు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కు దైవ చింతన కూడా ఎక్కువే.. అందుకే ఇటీవల ఆయన చాతుర్మాస్య దీక్ష (Chathurmasya Deeksha) కూడా చేపట్టారు. నాలుగు నెలలపాటు ఈ దీక్ష చేస్తున్నారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజ మాసాల్లో దీక్ష కొనసాగనుంది. ఈ దీక్ష ప్రకారం నెలలపాటు ఒక్కపూట మాత్రమే భోజనం చేయనున్నారు. ఈ చాతుర్మాస్య దీక్ష గురించి అందరికీ తెలిసిందే.. కానీ ఇప్పుడు కొందరు పవన్ మాల వేసుకుని దీక్ష తీసుకున్నారు.

    ఇదేంట భవానీ మాలా.. అయ్యప్ప మాల లాంటివి విన్నాం కానీ.. ఈ పవన్ మాల ఏంటి అనుకుంటున్నారు. అయితే ఇలా పవన్ మాల వేసుకోవడం ఇదే తొలిసారే కాదు.. గతంలోనూ ఆయన అభిమానులు పవన్ మాల ధరించారు. పవన్ అమితంగా ప్రేమించే కొందరు ఇలా.. మెడలో ఎర్రకండువా వేసుకుని.. 49 రోజుల పాటు.. పవన్ దీక్ష ప్రారంభించారు.. ఇంతకీ ఈ దీక్ష ఎందుకు చేస్తున్నారు.. మాల ధరించిన అన్ని రోజులు ఏం చేస్తారు అంటే..?



    పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సెప్టెంబర్‌ 2న వస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్‌ కళ్యాణ్‌పై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నారు. ఈ సెప్టెంబర్‌ 2తో పవన్‌ కళ్యాణ్‌ 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో పాలకొల్లుకు చెందిన పలువురు యువకులు పవన్‌ కళ్యాణ్‌ మాల ధరించారు. 49 రోజుల పాటు ఎర్ర కండువాలు ధరించి ప్రజలకు సేవ చేయనున్నట్లు ప్రకటించారు ఆ యువకులు.

    ఇదీ చదవండి : అల్లుడు లోకేష్ తో మామ బాలయ్య పోటీ.. హ్యాట్రిక్ కొట్టాలని ఒకరు.. పరువు కోసం మరొకరు

    ఈ 49 రోజుల పాటు వారు చాలా నిష్టంగా ఉంటామని చెబుతున్నారు. అంతేకాదు అన్నయ్య ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ మాల లక్ష్యం అంటున్నారు. నీతిగా నిజాయితీగా.. ఎలా ఉండాలో నేర్చుకుంటూ.. పవన్‌ కళ్యాణ్ అడుగుజాడల్లో నడిచి ఆయనకు మరింత పేరు తీసుకువస్తామంటున్నారు. ఆ యువకుల నిర్ణయాన్ని పలువురు జనసైనికుల ప్రశంసించారు. అంతేకాకుండా మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే.. మరో పక్క.. పవన్‌ కళ్యాణ్‌ మాల దీక్ష వేసుకోవడం ఏంటని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Janasena, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు