Home /News /andhra-pradesh /

EAST GODAVARI INTERNAL DISPUTES IN RAJAMAHENDRAVARAM TDP AS GORANTA BUTCHIAH CHODARY AND ADIREDDY SRINIVAS ARE FIGHTING FOR CITY CONSTITUENCY FULL DETAILS HERE PRN VSP

TDP: టీడీపీలో సీనియర్-జూనియర్ మధ్య పోటీ.. వాళ్లిద్దరికీ ఒకే నియోజకవర్గం కావాలంట.. బాబు డెసిషన్ పై సస్పెన్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ (TDP) ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఐతే టీడీపీకి కంచుకోటగా ఉన్న ఓ స్థానంలో సాధారణంగానే టిక్కెట్ కోసం పోటీ గట్టిగా ఉంటుంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో ఓ సీనియర్, జూనియర్ నాయకుల మధ్య టిక్కెట్ రచ్చ ఇప్పుడా పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తోంది.

ఇంకా చదవండి ...
    P Anand Mohan, News18, Visakhapatnam

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ (TDP) ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఐతే టీడీపీకి కంచుకోటగా ఉన్న ఓ స్థానంలో సాధారణంగానే టిక్కెట్ కోసం పోటీ గట్టిగా ఉంటుంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో ఓ సీనియర్, జూనియర్ నాయకుల మధ్య టిక్కెట్ రచ్చ ఇప్పుడా పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తోంది. ఎన్నికలకు రెండేళ్ల ముందే యువనేత టిక్కెట్ కోసం ఖర్ఛిఫ్ వేయడం ఆసక్తిగా మారింది. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆ యువనేత స్పీడ్ పెంచారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఏపిలో రాజమండ్రి సిటి రూరల్ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నాయి.. రాష్ట్రమంతా ప్రతీకూల పననాలు వీచినా అక్కడ మాత్రం టిడిపి హవా కొనసాగింది. ఇప్పటికి ఆ రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి సరైన అభ్యర్ధులు లభించిన పరిస్థితి లేదు.

    అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆదిరెడ్డి భవాని కుటుంబానికి.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ల మధ్య ఆధిపత్యపోరు గత కొంతకాలం గా పార్టీకి తలనొప్పిగా మారింది. ఇటీవల రాజమండ్రి టిడిపిలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సిటీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటాననీ వెల్లడించారు.. ప్రస్తుతం పార్టీలో రాష్ట్ర్ర కార్యనిర్వాహక కార్యదర్శిగానూ... నియోజకవర్గంలో టీడీపీకి గొంతుకగా వ్యవహరిస్తున్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్.. ఎన్నికలకు రెండేళ్లు ముందుగానే తాను పోటీ చేస్తాననీ ప్రకటించడం పార్టీతో పాటు నియోజకవర్గ క్యాడర్ లోనూ చర్చకు దారితీస్తోంది. శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సైతం వచ్చే ఎన్నికల్లో తన స్థానాన్ని తన భర్త భర్తీ చేస్తారని కుండబద్దలు కొట్టారు. అయితే భార్యభర్తల్లో ఎవరకి టిక్కెట్ ఇస్తారనే విషయంలో అలా ఉంచితే రాజమండ్రి సిటి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పోటీ చేస్తానని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.

    ఇది చదవండి: టీడీపీలో ఆ పదవులకు తీవ్రపోటీ.. తెలుగు తమ్ముళ్లలో జోరుగా చర్చ.. కారణం ఇదేనా..!


    ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అమెరికాలో ఉన్నారు. ఈ సమయంలో అదిరెడ్డి వాసు ముందుగానే సిటీ టిక్కెట్ నాదే అంటూ కర్చీఫ్ వేసెయ్యడం ఆసక్తిగా మారింది. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశం వేదికగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం తమ మనసులో మాటను వెల్లడించారు. వాస్తవానికి తనను పార్టీ అధిష్టానం రాజమండ్రి ఎంపిగా పోటీ చేయమని అడుగుతున్నారనీ.. అయితే తాను ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నాననీ ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టంగా చెప్పారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లోనే రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉన్నా అధిష్టానం ఆదేశాల మేరకు మహిళల కోటాలో తన భార్య పోటీ చేశారనీ.. ఈసారి మాత్రం తాను ఎమ్మెల్యే పోటీ నుంచి తగ్గేదే లేదనీ స్పష్టం చేశారు.

    ఇది చదవండి: టీడీపీ విషయంలో పవన్ మెట్టుదిగనిది అందుకే..! తగ్గితే జరిగే నష్టాన్ని ముందే ఊహించారా..?


    ఇటీవల ఆదిరెడ్డి కుటుంబం పార్టీ అధినేత చంద్రబాబుతో పలు మార్లు భేటీ అయ్యారు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీపై అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తరువాతే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆ ప్రకటన చేసారని ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి సిటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో జరుగుతున్న చర్చ మాటెలా ఉన్నా.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న గోరంట్ల ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారనేది అసక్తిగా మారింది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గోరంట్ల 2024 ఎన్నికల్లో సైతం పోటీకి సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీతో పొత్తుపెట్టుకుంటే ఆ పార్టీకి వెళ్తుందనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. దీంతో ముందుస్తుగా గోరంట్ల బుచ్చయ్యచౌదరి సిటీ నియోజకవర్గంపై కూడా తన పట్టును కొనసాగిస్తున్నారు. సిటీ నియోజకవర్గంలో ఇప్పటికే తన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసి టిక్కెట్ తనదేనన్నసంకేతాలు ఇస్తున్నారు. ఆదిరెడ్డి కుటుంబంతో ఉన్న విభేదాల నేపధ్యంలో కొన్ని నెలల క్రితమే రాజీనామా అస్త్రాన్ని సైతం గోరంట్ల సంధించారు.. అయితే అప్పట్లో ఆ వివాదం టీ కప్పులో తుఫాను చల్లారింది.. అయితే తాజాగా ఆదిరెడ్డి కుటుంబం టిక్కెట్ తమదేనన్న ధీమాతో వ్యక్తం చేయడంపై గోరంట్ల ఎలా స్పందిస్తారనేది రాజమండ్రి టిడిపి శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది.



    గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని గోరంట్ల అంత తేలికగా వదులుకోరనే చర్చ జరుగుతోంది. టిక్కెట్ కోసం ఆయన కూడా గట్టిగానే పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. అయితే పార్టీ అధిష్టానం నుంచి వచ్చి హామీతోనే ఆదిరెడ్డి వాసు ముందుస్తుగా టిక్కెట్ నాదే అని ప్రకటించారా లేక మరేదైనా వ్యూహం ఉందా అనే ఆసక్తికర చర్చ రాజమండ్రి టిడిపి క్యాడర్ లో జరుగుతోందట. నిజంగానే రాజమండ్రి సిటీ టిక్కెట్ ను ఆదిరెడ్డి శ్రీనివాస్ కు ముందస్తుగానే ఖరారు చేస్తే.. గోరంట్లను ఏం చేస్తారనేది సైతం ఇక్కడ తెలుగు తమ్ముళ్లలో అంతర్మథనంగా ఉంది. అయితే ఆదిరెడ్డి కుటుంబం చేసిన ముందస్తు టిక్కెట్ ప్రకటనపై గోరంట్ల అభ్యంతరం వ్యక్తం చేసేందుకే ఛాన్స్ లేకపోలేదంటున్నారు రాజమండ్రి క్యాడర్. ఇదిలా ఉంటే మరో రెండు నెలల్లో రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో తాజా రాజకీయ పరిణామాలు రాజమండ్రి టిడిపిలో ముందస్తు విభేదాలకు దారి తీస్తాయా అన్న చర్చ జోరుగా జరుగుతోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, East Godavari Dist, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు