హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Unique Sentiment: ఇక్కడ నిద్ర చేసి కలలోకి ఊయల వస్తే సంతాన ప్రాప్తి క‌లిగిన‌ట్టే!

Unique Sentiment: ఇక్కడ నిద్ర చేసి కలలోకి ఊయల వస్తే సంతాన ప్రాప్తి క‌లిగిన‌ట్టే!

X
కోనసీమ

కోనసీమ జిల్లాలో వింత ఆచారం

ఇక్కడ ఒక రాత్రి నిద్ర‌.. క‌ల‌లోకి ఊయ‌ల‌.. ఇక సంతాన ప్రాప్తి క‌లిగిన‌ట్టే.. ఈ వింత ఎక్క‌డో తెలుసా? పెళ్ల‌యినా పిల్ల‌లు లేని వారికి ఆదేవుడు క‌లిగించే ఓ వ‌రం ఊయ‌ల క‌ల‌. ఆ క‌ల వ‌చ్చిందంటే ఇక సంతాన ప్రాప్తి క‌లిగిన‌ట్టే. కోన‌సీమ జిల్లా (Konaseema District) లోని ప‌ల్లం గ్రామంలో త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న ఈ ఆచారం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Amalapuram | Kakinada | East Godavari

P Ramesh, News18, Kakinada

ఇక్కడ ఒక రాత్రి నిద్ర‌.. క‌ల‌లోకి ఊయ‌ల‌.. ఇక సంతాన ప్రాప్తి క‌లిగిన‌ట్టే.. ఈ వింత ఎక్క‌డో తెలుసా? పెళ్ల‌యినా పిల్ల‌లు లేని వారికి ఆదేవుడు క‌లిగించే ఓ వ‌రం ఊయ‌ల క‌ల‌. ఆ క‌ల వ‌చ్చిందంటే ఇక సంతాన ప్రాప్తి క‌లిగిన‌ట్టే. కోన‌సీమ జిల్లా (Konaseema District) లోని ప‌ల్లం గ్రామంలో త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న ఈ ఆచారం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. చొల్లంగి అమావాస్య రోజున స‌ముద్ర‌స్నాన‌మాచ‌రించి, ఆల‌య ప్రాంగ‌ణంలోనే నిద్రిస్తారు మ‌హిళా భ‌క్తులు.ఉద‌యాన్నే కాల‌భైర‌వుని, పార్వ‌తీ బ్ర‌హ్మేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకుంటే చాలు సంతానం లేని వారికి మ‌హాభాగ్యం క‌లుగుతుంది. అక్క‌డ నిద్రించిన‌ప్పుడు ఊయ‌ల, అర‌టిపళ్లు, కొబ్బ‌రికాయ వంటివి కల‌లోకి రావాలి. అలా వ‌స్తే సంతానం క‌లుగుతుంద‌నేది నమ్మ‌కంగా చెబుతున్నారు.స‌ముద్ర స్నానామాచ‌రించి అక్క‌డ కాల‌భైర‌వుని ద‌ర్శించుకునేందుకు ఇత‌ర జిల్లాల నుండి కూడా కాకినాడ , కోన‌సీమ‌లోని చొల్లంగి స‌ముద్ర తీరానికి త‌ర‌లివ‌స్తున్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం పంచాయతీ పరిధి సముద్రతీరాన బ్రహ్మసమేధ్యంలో కొలువైన ఉన్న కాలభైరవ స్వామి, పార్వతీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో చొల్లంగి అమావాస్య పర్వదినం రోజున జరిగే తీర్థ మహోత్సవాలు ఎంతో ప్ర‌సిద్ధిగాంచాయి. ప్ర‌తీయేటా సంక్రాంతి దాటిన త‌ర్వాత అమ‌వాస్య నాడు జ‌రిగే వేడుక‌గా దీనికి పేరుంది.

ఇది చదవండి: ఈ గుడిలో ముడుపు కడితే భూ సమస్యలు పరిష్కారం అవుతాయట..!

కాకినాడ స‌ముద్ర‌తీరం నుండి కోన‌సీమ స‌ముద్ర‌తీరం వ‌ర‌కూ ఎక్క‌డైనా పుణ్య‌స్నానం ఆచ‌రించ‌వ‌చ్చు. కాకినాడ ద‌గ్గ‌ర క‌ర‌ప మండ‌లంలోని చొల్లంగి గ్రామం వ‌ద్ద కూడా ఇదే రోజు ఉత్స‌వాలు జ‌రుగుతాయి. ఇక కోన‌సీమ‌లో అయితే గ్రామ, గ్రామాన కూడా సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ముఖ్యంగా సముద్రస్నానానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు తరలివస్తారు. ఇక్క‌డే పుణ్య‌స్నానామాచ‌రించి ఆల‌యం ప్రాంగ‌ణంలో నిద్రిస్తారు. రాత్రంతా జాత‌ర జ‌రుగుతుంది. మేళ‌తాళాల న‌డుమ క‌ళాఖండాల‌తో ఎంతో ఈ జాత‌ర ఆక‌ట్టుకుంది.

ఇది చదవండి: వందేళ్లనాటి తాళం.. రెండు నిముషాలు తిప్పితేగానీ ఓపెన్ కాదు..! ఎలా పనిచేస్తుందంటే..!

అమావాస్య రోజున సంతానం లేని మహిళలు స్వామిని ఆరాధిస్తూఆలయంలో నిద్రిస్తే కలిగే స్వప్నంలో ఊయల, అరటిపండ్లు, కొబ్బరికాయ, ఆలయం ఇలా శుభప్రదమైనవి కనిపిస్తే సంతానం త‌ప్ప‌క క‌లుగుతుంద‌నేది భ‌క్తుల న‌మ్మ‌కంగా వ‌స్తోంది. ముఖ్యంగా పెళ్లైయి ఎన్నో ఏళ్లు గ‌డుస్తున్నా పిల్ల‌లు క‌ల‌గ‌ని వారికి ఇదొక దైవ మార్గంగా చెబుతారు. ఇక్క‌డ దేవుడి ఆశీసులు ఉంటే క‌ష్టాలు తొల‌గి జీవిత‌భాగ‌స్వామితో ఆనంద‌క‌ర జీవితం ఉంటుంద‌ని కూడా చెబుతుంటారు. అనేకమంది రాత్రి సముద్ర స్నానమాచరించి కాలభైరవ స్వామిని తలుచుకుని నిద్రిస్తారు. తమ స్వప్నంలో తమకుకనిపించిన వస్తువు గురించి ఆలయ పూజారికి చెప్పి ఆశ్శీసులు తీసుకుని సూర్యోదయం సమయంలో మ‌ర‌లా సముద్రస్నాన మాచరించి స్వామి వారిని దర్శించుకోవడం పూర్వం నుండి వస్తోంది.

ఈ ఆలయంలో నిద్రచేయడం ద్వారా సంతానప్రాప్తి పొందిన భక్తులు తమ పిల్లలకు స్వామి పేరు కలిసేలా నామకరణం చేసుకోవడం కూడా జరుగుతుంది. దూరం నుండి వ‌చ్చిన భ‌క్తుల‌కు ఆల‌యంలో నిద్రించేందుకు పెద్ద స్థ‌లాన్ని కేటాయిస్తారు. అక్క‌డ నందీశ్వ‌రుని ముందు మొక్కి నిద్ర‌పోతారు భ‌క్తులు. మొత్తం మీద చొల్లంగి తీర్థం అంటే పిల్ల‌లు లేని వారికి మ‌హాప్రసాద తీర్థంగా చెబుతుంటారు.

First published:

Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News

ఉత్తమ కథలు