P Ramesh, News18, Kakinada
తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) అంటే రుచులకు పెట్టింది పేరు. అక్కడ దొరకని రుచి అంటూ ఉండదు. ఇక కోనసీమలో అయితే అక్కడ వండే వంటలు ప్రపంచ ప్రఖ్యాతగాంచినవే ఉంటాయి. పండగకు అల్లుడొస్తే అక్కడ జరిగే గౌరవ మర్యాదలకు కొదవ ఉండదు.అందుకే ఆలస్యమైనా కోనసీమ అల్లుడు కావాలంటారు. పండగల్లో అల్లుడికి వడ్డించే వంటలు ఆమోఘం. అందులో ముఖ్యంగా మాంసప్రియులకు నాటుకోడి కూర, చేపల పులుసు, మేక మాంసం వంటివి ప్రత్యేకంగా వండి పెడతారు. ఇందులో ముఖ్యంగా పండగ సీజన్‌లో మొత్తం వంటకాల కథ అంతా నాటుకోడి చుట్టూనే తిరుగుతుంది.
మాంసం ప్రియులకు సంక్రాంతి (Sankranthi) నెల సీజన్ ఓవరం. ఎందుకంటే నాటుకోడి వారికి సాధారణం. కానీ అసాధరణమైన కోస మాంసం కోసం వేచి చూసే కాలమది. లక్షల రూపాయలు విలువ చేసే కోళ్లను కోసుకు తింటే ఆరుచి అమోఘం. వేల రూపాయాలు పోసి ఈ మాంసాన్ని కొనుగోలు చేస్తారు. పందెంలో పోటిపడ్డ కోడికి మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఈ కోడి రక్తం బాగా మరుగుతుంది. ఇలా మరిగిన రక్తంతో ఉన్న కోడిని కోసుకుని తింటే ఆరుచే వేరంటున్నారు మాంసం ప్రియులు.
అందుకే వేలు ఖర్చు చేసైనా సరే కోస మాంసానికే ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా కోడి పందాలు కూడా ఈ సంక్రాంతి సీజన్‌లో మాత్రమే జరుగుతాయి. అందుకే కోశ మాంసం కూడా ఇదే సీజన్‌లో దొరుకుతుంది. ఈమాంసాన్ని మసాలా దట్టించి , బాగా ఉడికించి తింటారు. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా కోస మాంసానికి మంచి గిరాకీ ఉంది.
కర్ణాటకలో ఇదే తరహాలో కడక్ నాథ్ కోడిని తింటారు. అక్కడ కూడా నాటు కోళ్ల పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రంతోపాటు, పక్క రాష్ట్రాలకు ఆజాతి కోళ్లను సప్లై చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే డేగ, కాకి, నెమలి, సవలా వంటి రకాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ రకం కోళ్లు కేవలం పందాలకు మాత్రమే ఉపయోగిస్తారు. వీటిని ఎంతో మంచి వాతావరణంలో పెంచుతారు. ఆరోగ్యకరమైన బాదం, పిస్తా , జీడిపప్పుతోపాటు కేవలం మినరల్ వాటర్‌ను తాగించి పెంచుతారు. కొన్ని రకం కోళ్లకు ఆల్కాహాల్, కారంతో తయారు చేసిన పదార్థాలను ఆహారంగా పెడతారు.
ఇలా పెంచిన కోళ్లను లక్షల రూపాయాలకు అమ్ముతారు. బరిలో దిగిన తర్వాత ఓ రేంజ్‌లో ఆ కోడి పోరాటం ఉంటుంది. ఇక్కడే దాని శరీరంలో మొత్తం మార్పులు జరుగుతాయి. ఈప్రభావంతోనే దానిని పందెం తర్వాత మాంసంగా సిద్ధం చేస్తే దాని రుచి మాములుగా ఉండదు. ఈ మాంసాన్ని పెద్ద ముక్కలుగా కొట్టి దానికి మసాల దట్టించి వండితే ఇక ఏడాదంతా ఆ రుచి మరచిపోరంటే ఆ మాంసం ఎంత రుచిగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. మొత్తం మీద ఈ ఏడాది సంక్రాంతికి కోనసీమ కోశ రుచి చూసినవారు మరలా వారి ఉద్యోగాలలో నిమగ్న మయ్యేందుకు పయనమయ్యారు. మరలా ఏడాది తర్వాతే ఈరుచి దొరుకుతుంది. తినాలన్నాఅప్పటి వరకూ వెయిట్ చేయక తప్పదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chicken, East Godavari Dist, Local News