హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

East Godavari: గోదావ‌రి ఉగ్ర‌రూపం.. ఖాళీ అవుతున్న గ్రామాలు..! భారీ వనలు పడితే కష్టమే

East Godavari: గోదావ‌రి ఉగ్ర‌రూపం.. ఖాళీ అవుతున్న గ్రామాలు..! భారీ వనలు పడితే కష్టమే

X
గ్రామాలకు

గ్రామాలకు గ్రామలు ఖాళీ

East Godavari: ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు మంచెత్తుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాల ప్రభావంతో గోదావ‌రి మ‌రోసారి ఉగ్రరూపం దాల్చింది. రెండో ప్రమాద స్థాయి హెచ్చరిక‌ను జారీ చేసిన అధికారులు లోత‌ట్టు ప్రాంతాల‌ను అప్రమ‌త్తం చేశారు. దీంతో కొన్ని గ్రామాలను ఖాళీ చేయాల్సి వస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • East Godavari, India

P.Ramesh, News18, Kakinada.

ఆంధ్రప్రదేశ్ ను భారీ వానలు ముంచెత్తుతున్నాయి. గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఎగు నుంచి వస్తున్న వరద కారణంగా.. గోదావ‌రి మ‌రోసారి ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే రెండో ప్రమాద స్థాయి హెచ్చరిక‌ను జారీ చేసిన అధికారులు లోత‌ట్టు ప్రాంతాల‌ను అప్రమ‌త్తం చేశారు. మళ్లీ భారీ వానలు వెంటాడితే.. ప్రమాదం తప్పకపోవచ్చు.. ఎందుకంటే ఇప్పటికే ద‌వ‌ళేశ్వరం గోదావ‌రి వంతెన వ‌ద్ద ప‌రిస్థితి మాత్రం భ‌యాన‌కంగా మారింది. ముంపు గ్రామాల పరిస్థితి భయపెడుతోంది.

గోదావ‌రి పొంగిందంటే చాలు వ‌ర‌ద‌లు వ‌చ్చేసిన‌ట్టే. ఇది ఒక్కసారి కాదు. ఏకంగా ఈ ఏడాదిలో మూడోసారి అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఈ ఏడాది అనూహ్యంగా వ‌ర్షాలు కురిసాయి. గత వారం రోజులుగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఈ ప్రభావం బాగా పెరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడ‌నం ప్రభావం కూడా భారీ వ‌ర్షాల‌కు మూల‌కార‌ణం.

ఇదిలా ఉంటే మ‌హారాష్ట్రలో కురిసిన వ‌ర్షాల‌కు గోదావ‌రికి భారీగా నీరు చేరింది. దీంతో ఇన్‌ఫ్లో పెరిగే కొద్ది ఔట్‌ఫ్లో ఉండేలా అధికారులు అప్రమ‌త్తమ‌య్యారు. ఈ నీటిని స‌ముద్రంలోకి వ‌దులుతున్నారు. గోదావ‌రి వ‌ర‌ద నీటి ప్రభావంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండ‌లంలోని బోళ్లప‌ల్లి-య‌డ‌వ‌ల్లి గ్రామాల మ‌ధ్య ఎద్దువాగు వంతెన మునిగిపోవ‌డంతో దాదాపు 20 గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం14.40 ల‌క్షల క్యూసెక్కుల నీటిని కింద‌కి వ‌దిలారు.

ఇదీ చదవండి : త్రీ ఇడియట్స్‌ సినిమాను గుర్తు చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు..! మీరే చూడండి

ఈ ప్రభావంతో ప్రస్తుతం డాక్టర్ బి.ఆర్‌. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింద‌నే చెప్పాలి. ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర‌ద నీరు క్రమంగా పొలాల్లోకి వ‌స్తుంది. గోదావ‌రి దాటికి భూములు కూడా కోత‌కు గుర‌వుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గ‌ట్టు తెగిపోతున్నాయి. ఎప్పుడు ముంపు ముంచుతుందోన‌న్న భ‌యంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళ‌న చెందుతున్నారు. పి.గ‌న్నవ‌రం, అయినవిల్లి, మామిడికుదురు, రాజోలు, అల్లవ‌రం, ఐ.పోల‌వ‌రం త‌దిత‌ర మండ‌లాలు ముంపుబారిన ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి : ఓ లేఖతో ఎమ్మెల్యే-మాజీ ఎమ్మెల్యే మధ్య ఫైట్.. ఆ లేఖలో ఏముంది..

ముంపులో ఏజెన్సీ మండ‌లాలు

కోన‌సీమ వాసుల్ని గోదావ‌రి నిద్రలేకుండా చేస్తుంటే, మరో ప‌క్క ఏజెన్సీ మండ‌లాల్లో శ‌బ‌రి కూడా ఉవ్వెత్తున పొంగుతోంది. అల్లూరి సీతారామ‌రాజు జిల్లాకు చెందిన చింతూరు వ‌ద్ద నీటి మ‌ట్టం 36 అడుగుల‌కు చేరుకుంది. చింతూరు మండ‌లం చ‌ట్టి గ్రామం, విరాపురం జాతీయ ర‌హ‌దారి-30 పై వ‌ర‌ద నీరు చేరి రాక‌పోక‌ల‌కు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి : కృష్ణ జింక దీక్షతో దిగివచ్చిన అధికారులు..! షాక్ అవుతున్నా ఇది నిజం.. మీరే చూడండి..

ఇటు శబ‌రి- అటు భ‌ద్రాది నుండి వ‌స్తున్న గోదావ‌రి నీరు వి.ఆర్ పురం, కూన‌వ‌రం వ‌ద్ద భారీగా చేర‌డంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న జ‌నం ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. కొన్ని గ్రామాల‌కు అధికారులు పున‌రావ‌సం క‌ల్పించ‌క‌పోవడంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మొన్నటి వ‌ర‌ద‌ల‌కు అవ‌స్థలు ప‌డ్డ జనాల‌కి మ‌రోసారి తిప్పలు త‌ప్పడం లేదు.

First published:

Tags: Andhra Pradesh, AP Floods, AP News, East godavari, Godavari river, Local News

ఉత్తమ కథలు