(Ramesh, News18, East Godavari)
ప్రస్తుతం లోకంలో జరుగుతున్న దొంగతనాలు చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటు . ఉదయం లేచేసరికి ఎక్కడ నుండి ఎటువంటి వార్త వినాల్సి వస్తుందోనని భయం జనాల్ని వెంటాడుతోంది. పట్టపగలు దోపిడీలు రాత్రి అయితే చాలు...కాకినాడ జిల్లాలో ఈ తరహా దొంగతనాలు ప్రజల్ని తీవ్రంగా భయపెడుతున్నాయి. ఇటీవల కాలంలో పిఠాపురంలో పట్టపగలు వృద్ధురాలిని బంధించి నిలువునా బంగారం దోపిడీ చేసిన ఘటన మరువక ముందే జగ్గంపేటలోఓ ముఠా ఓ ఇంటిని దోపిడీ చేసి ఏకంగా 25 కాసుల బంగారాన్ని ఓ మోటార్ సైకిల్ ను దొంగలించుకు.పోయింది.
ఈ మేరకు బాధితుడైన బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి వీరన్న తన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు తలుపులు బద్దలు కొట్టి, ఇంటిలోని బంగారు వస్తువులు అపహరించుకు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు జగ్గంపేట సీఐ బి.సూర్య అప్పారావు, జగ్గంపేట ఎస్సై సిహెచ్ విద్యాసాగర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తుచేపట్టారు. కాకినాడ క్రైమ్ డిఎస్పీ రాంబాబు, పెద్దాపురం ఇన్చార్జి డి.ఎస్.పి ఎం. వెంకటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా డాగ్ స్క్వాడ్, క్లూ స్టీమ్స్ వాళ్ళు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు.పోలీస్ అధికారులు మాట్లాడుతూ కాకినాడకు చెందిన బిఎస్ ఎన్ ఎల్ విశ్రాంతి ఉద్యోగి పుర్రెవీరన్న జగ్గంపేటలోని గుర్రప్పాలెం, రోడ్ లో బాలాజీ నగర్ కాలనీలో గత కొంతకాలంగా అద్దెకు ఉంటున్నాడని తెలిపారు.వీరన్నతన భార్యతో కలిసి పనుల నిమిత్తం వారి స్వగ్రామం కాకినాడ వెళ్లారు. వారు పనులు ముగించుకుని రాత్రి కాకినాడలో బస చేయడం జరిగిందన్నారు.తెల్లారేసరికి వీరన్న ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించిన ఫై పోర్షన్ లోని ఇంటి యజమాని బుర్రి వెంకటరమణ వీరన్నకు, ఫోన్ చేసి తెలియపరచడంతో వాళ్లు హుటాహుటిన జగ్గంపేట వచ్చి చూసేసరికి ఇంట్లో వస్తువులన్నీ చల్లా చెదిరి ఉన్నాయన్నారు.
ఎవరో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో తలుపులు బద్దలు కొట్టి లోనికి చోరపడి దొంగతనానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించి పోలీసులకుఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.గుర్తు తెలియని దుండగులు ఇంటిలోనికి ప్రవేశించి బీరువా పగలగొట్టి వస్తువులన్నీ చల్లాచెదురుగా పడవేసి,ఇంట్లో వివిధ రకాల ఆకృతలలో ఉండే 25 కాసుల బంగారు వస్తువులను, క్రింది పార్కు చేసి ఉంచిన హీరో హోండా గ్లామర్ మోటార్ సైకిల్ ను దోచుకోవడం జరిగిందని బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లుజగ్గంపేట సీఐ సూర్య అప్పారావు, ఎస్సై విద్యాసాగర్ లు తెలిపారు.నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, East godavari, Local News