హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Godavari floods: ఉధృతంగా గోదావరి.. నీటి ముంపులో గిరిజన, లంక గ్రామాలు.. తాజా అప్ డేట్ ఇదే..!

Godavari floods: ఉధృతంగా గోదావరి.. నీటి ముంపులో గిరిజన, లంక గ్రామాలు.. తాజా అప్ డేట్ ఇదే..!

పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం

పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం

గోదావరి నది (Godavari River) వరద ప్రవాహం మరింత ఉధృతంగా మారుతుంది. గత నాలుగురోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. గంటగంటకు వరద ఉధృతి పెరుగుతూ.. గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.

ఇంకా చదవండి ...

భారీ వర్షాలు కురిస్తే చాలు తెలుగురాష్ట్రాల్లో ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటాయి. ఇంక నదుల మాట చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా గోదావరి నది (Godavari River) వరద ప్రవాహం మరింత ఉధృతంగా మారుతుంది. గత నాలుగురోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. గంటగంటకు వరద ఉధృతి పెరుగుతూ.. గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని ధవళేశ్వరం వద్ద నీటిమట్టం ప్రస్తుతం 13.5 అడుగుల వద్దకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ ఇప్పటికే రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోనసీమలో గోదావరి ఉధృతంగా ప్రవాహిస్తుండటంతో అటు అధికార యంత్రాంగం కూడా హైఅలర్ట్ అయింది. నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(NDRF)ను, రెస్క్యూ టీంలను అప్రమత్తం చేసింది.

అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశాలు:

అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలు జారీ చేశారు. కోనసీమ జిల్లాలో వరదలను ఎదుర్కొనేందుకు దాదాపు 200 బోట్లను అధికారులు ఏర్పాటుచేశారు. పి.గన్నవరం మండలంలోని లంక గ్రామాల్లో అధికారులు పర్యటించి స్థానికుల్లో ధైర్యం నింపారు. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 11.75 అడుగులకి చేరుకున్నప్పుడు … 10.02 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ వద్ద ఉన్న 175 గేట్లను ఎత్తివేశారు. నీటిమట్టం 13.2 అడుగులకు చేరుకున్నప్పుడు… బ్యారేజ్ నుంచి 12 లక్షల 10 వేల క్యూసెక్కుల నీటికి సముద్రంలోకి విడుదల చేశారు. నీటి మట్టం ఇప్పుడు మరో అడుగు పెరగటంతో బ్యారేజ్ నుంచి 12 లక్షల 30 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

ఇది చదవండి: ఏపీని వదలని వాన.. 15 జిల్లాలకు అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక


లంక గ్రామాల్లో టెన్షన్‌.. టెన్షన్‌:

గంటగంటకు గోదావరి ఉగ్రరూపం దాల్చుతుండటంతో కోనసీమలోని లంక గ్రామాల్లోని ప్రజల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఏ క్షణం ఉప్పొంగుతుందో అని భయం భయంగా గడుపుతున్నారు. పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే కొన్ని లంక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం నాటుపడవలపైనే రాకపోకలు కొనసాగుతున్నాయి. అటు విలీన మండలాల్లోనూ భారీ వర్షాలకు గోదావరి, శబరి నది పొంగి ప్రవహిస్తోంది.


ఇది చదవండి: ఏపీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందడం ఎలా..? ఎలా అప్లై చేయాలి..? పూర్తి వివరాలివే..!

అటు సోకిలేరు వంతెనపై కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో చింతూరు - విఆర్ పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాదు వీఆర్‌పురం మండలం ములకపాడు గ్రామంలోకి కూడా గోదావరి పోటెత్తింది. దీంతో గ్రామస్తులు కొండలపైకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడే తాత్కాలిక గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP Floods, Godavari river

ఉత్తమ కథలు