Ramesh, News18, East Godavari
హ్యాండ్ బాల్‌తో ఒక ఊపు ఊపేశారు..చదువులతో పాటు ఆటలు చాలా ముఖ్యమని తేల్చారు. ఇప్పుడు.ఒకప్పుడు ఆడపిల్ల బయటకు రావాలంటే సవాలక్ష షరతులు. కానీ నేటి కాలంలో ఆడదే అన్నింటికి ఆధారం. అబల లేనిదే ఏ ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. అన్ని రంగాల్లో మహిళలు సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఆటపాటల్లో ముందంజ వేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా మహిళల ప్రతిభే కనిపిస్తోంది. అందుకే అన్ని క్రీడల్లోనూ వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇటీవల కాలంలో కాకినాడ జిల్లాలో 37వ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏపీలో పాత జిల్లాల పద్ధతిలో ఉన్న 13 జిల్లాలతోపాటు, కొత్తగా ఏర్పడ్డ నంధ్యాల నుండి క్రీడాకారిణిలు ఆటల పోటీల్లో పాల్గొన్నారు.
పెద్దాపురం నియోజకవర్గంలోని ప్రధాన మున్సిపాల్టీ అయిన సామర్లకోట మున్సిపాల్టీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ పోటీలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పెద్దాపురం వైసీపీ ఇన్‌ఛార్జి రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత తదితరులు హాజరై క్రీడలను ప్రారంభించారు. మొత్తం 300 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు.
విజేత గుంటూరు
ఇక్కడ జరిగిన క్వార్టర్, సెమీఫైనల్, ఫైనల్ పోటీల్లో వరుసగా విజయ దుంభిబి మోగించిన గుంటూరు చివరకు విజేతగా నిలిచింది. ద్వీతయ స్థానంలో నంధ్యాల దక్కించుకోగా, తృతీయ స్థానంలో నెల్లూరు జిల్లా గెలిచింది. నాల్గవ స్థానంలో పశ్చిమగోదావరి నిలిచింది. ఈనెల 14 నుండి 18వ తేది వరకూ బీహార్ స్టేట్‌లో జరిగే జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు వీరు వెళ్లనున్నారు.
విజేతలకు సామర్లకోట మున్సిపల్ ఛైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ,రామాంజనేయులు, కేటీఎస్ విద్యాసంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తి, ఉబా జాన్ మోజేస్, కె.పద్మనాభం, పల్లా లక్ష్మణరావు తదితరుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఇక్కడ హ్యాండ్ బాల్ పోటీలకు వచ్చిన క్రీడాకారులకు వసతి, బోజన సదుపాయాన్ని కల్పించారు క్రీడా నిర్వాహకులు.
అమ్మాయిలకే అవకాశాలు
కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మొత్తం అమ్మాయిలకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సందేశాన్నిచ్చారు. ముఖ్యంగా ఈ పతకాలు సాధించడం ద్వారా ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో స్పోర్ట్స్ కోటా కింద అవకాశాలు వస్తాయన్నారు. అమ్మాయిల చదువు, వారి భవిష్యత్తు తదితర అంశాలపై సభలో మాట్లాడారు. సామర్లకోట జూనియర్ కళాశాల ప్రాంగణం పెద్దదిగా ఉండటం, ఇక్కడకు వచ్చిన క్రీడాకారులకు వసతి సౌకర్యం ఏర్పాటులో కృషి చేసిన రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి ఊబా జాన్ మోజెస్‌ను, సహకరించిన కేటీఎస్ విద్యాసంస్థల ప్రతినిధి ప్రవీణ్ చక్రవర్తిని ఘనంగా సత్కరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News