(Ramesh, News18, East Godavari)
ప్రస్తుతం రోడ్డు యాక్సిడెంట్ అంటే చాలు నిమిషానికి సగటున ఒక జిల్లా పరిధిలో 5 నుంచి 10 జరుగుతున్నాయి. అందులో కొన్ని గాయాలకు మాత్రమే పరిమితమయితే, మరికొన్ని ప్రాణాల మీదకొస్తున్నాయి. ఇలా చూస్తే యాక్సిడెంట్ మనిషి జీవితంలో భాగమైపోయిందనే చెప్పాలి.
ఒకప్పుడు మనిషి నడక మార్గం తప్పితే మరొకటి ఉండేది కాదు. కాని ఇప్పుడు మోటారుసైకిల్ దగ్గర నుండి పెద్ద పెద్ద కార్ల వరకూ వేగంగా దూసుకుపోతున్నాయి. కంగారు ప్రయాణాలు, స్థాయికి మించిన వేగం, కండిషన్‌లో లేని వాహనాలు. ఇలా చూస్తే వేగంగా పోదామని ముందుకు దూసుకుపోతున్నారు. తీరా చూస్తే వెనక్కి రావడం లేదు. దీంతో ఎన్నో కుటుంబాలు ప్రమాద బాధితుల పాలిట బలైపోతున్నాయి.
కొంత మంది జీవిత కాలం మూలన కూర్చునేలా కాళ్లు పోయి, చేతులు విరిగిపోయి ఉంటున్నాయి. మరికొంత మంది వెన్నెపూస విరిగి మంచానికే పరిమితమవుతున్నారు. ఇలాంటి ఘటనలు చూసినా కుర్రాకారు వేగాన్ని తగ్గించడం లేదు. తీరా చూస్తే వారి కుటుంబాలను రోధనలోకి నెట్టేలా చేస్తున్నారు.
అందుకే రోడ్డు సేఫ్టీపై ఎక్కడికక్కడ ప్రభుత్వాలు వారి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా వారి రాష్ట్ర స్థాయిలో అవగాహన ర్యాలీ చేపడుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రించేందుకు ఏకంగా ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇలా చేయడం ద్వారా ప్రతీ రోజు వాహనం నడిపే వీలుండదు. ఒక రకంగా చెప్పాలంటే కాలుష్యం కూడా తగ్గుతుందనేది అక్కడి ప్రభుత్వం యోచన.
ఇక హైదరబాద్, బెంగుళూరు, చెన్నై వంటి మహానగరాల్లో ట్రాఫిక్ చిక్కులకు అంతులేకుండాపోతుంది. అక్కడ జరిగే ప్రమాదాల్లో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకే ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ప్రతీ ఒక్కరి బాధ్యతగా ఉండాలి. ఇటీవల ఏపీలోని రవాణాశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా వారు ముఖ్యంగా పోలీసుల సహకారంతో అవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. గోడపత్రికను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ వంగా గీత, ఇతర పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
కాకినాడ జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు అధికారులు. రవాణశాఖ, పోలీసుశాఖ సంయుక్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుతున్నారు. హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించడం వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఈసందర్భంగా రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ మోహన్ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రభుత్వం ద్వారా తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాబోవు కాలంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధానాలను తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా 10 శాతం వరకూ ప్రాణాలు కాపాడగలిగామన్నారు రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News