Home /News /andhra-pradesh /

EAST GODAVARI FLOOD EFFECTS ON VEGETABLES IN GODAVARI DISTRICTS IN ANDHRA PRADESH THIS IS THE REAOSN NGS VSP

Vegetable Price: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అక్కడ కూరగాయల రేట్లు డబుల్..?

Vegetable Price Hike

Vegetable Price Hike

Vegetable price Hike: ఇప్పటికే కూరగాయల ధరలు భారీగా పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇప్పుడు వరదల ప్రభావం కూడా పడింది. దీంతో ఆ జిల్లాలో కూరగాయాల రేట్లు రెట్టింపు అయ్యాయి.. ఎందుకో తెలుసా..?

    P Anand Mohan, Visakhapatnam, News18

    Vegetable Price:  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అన్నట్టు పరిస్థితి మారింది. ముఖ్యంగా కూరగాయల ధరలు (Vegetable Price) చాలా కాలంగా  ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటా ధరలు అప్పుడప్పుడు రికార్డు క్రియేట్ చేస్తున్నా.. ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు టమాటా రేటు ధారుణంగా పడిపోయింది. కిలో 5 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. ఆ ఒక్కటి తప్ప మిగిలిన కూరగాయల ధరలు భారీగానే ఉన్నాయి. అయితే  గోదావరి జిల్లా (Godavari District) ల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గోదావరి లంక గ్రామాల్లో పండే ఆకు, కాయగూరల పంటలు జలదిగ్బంధంలో ఉండడంతో వాటి ధరలు చుక్కలంటుతున్నాయి. కోనసీమ  జిల్లా (Konaseema District) లోని గోదావరి నదీపరీవాహక గ్రామాల్లో ఉన్న పంటలన్నీ పూర్తిగా నీటమునిగాయి. ఆకు, కాయగూరల పంటన్నీ పూర్తిగా కుళ్లిపోవడంతో ఉత్పత్తులు తగ్గి తీవ్రమైన కొరత ఏర్పడింది. దాంతో కోనసీమలోని కాయగూరల వ్యాపారులు విజయవాడ, గుంటూరు సహా వివిధ ప్రాంతాల మార్కెట్ల నుంచి కాయగూరలు దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత చుక్కలనంటే అవ కాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

    ప్రస్తుతం కూడా ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. గత పదిహేను రోజులకు పైగా తూర్పుగోదావరి, అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని రంపచోడవరం, కోనసీమ జిల్లాలోని పలు డివిజన్లలో వరద ఉధృతి తీవ్రంగా కొనసాగింది. దీని కారణంగా ఆయా లంక గ్రామాల్లో ఉన్న వివిధ రకాల కూరగాయల పంటలన్నీ పూర్తిగా జలదిగ్బంధానికి గురై కుళ్లి పోయే స్థితికి చేరుకున్నాయి. జిల్లాలో 5776 హెక్టార్లలో ఆకు, కాయగూరలతో సహా ఉద్యాన పంటలన్నీ దెబ్బతిన్నట్టు అధికారుల అంచనా.



    ప్రస్తుతం కూరగాయలు, ఆకుకూరల మార్కెట్లలో ప్రముఖ స్థానాలు పొందిన మడికి, మూలస్థానం అగ్రహారం, కొత్తపేట, ముక్తేశ్వరం, అమలాపురం, రాజోలు, అంబాజీపేట, గన్నవరం, ముమ్మిడివరం వంటి మార్కెట్లలో ఆకు, కాయగూరలు అందుబాటులో లేక మార్కెట్లు వెలవెలబోతున్నాయి. సమీపంలోని లంక గ్రామాలన్నీ వరద తాకిడికి గురై పంటలన్నీ పూర్తిగా నీటమునిగి కుళ్లిపోయాయి. లంకల నుంచి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు వంటి రాకపోవడంతో హోల్‌సేల్‌ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఇక తప్పని సరి పరిస్థితుల్లో వ్యాపారు లు విజయవాడ, గుంటూరు మార్కెట్లనుంచి కూరగాయలను హోల్‌సేల్‌గా కొనుగోలుచేసి లారీల ద్వారా కోనసీమలోని వివిధ మార్కెట్లకు తరలించి విక్రయాలు చేస్తున్నారు.

    ఇదీ చదవండి : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపెవరిది..? సంబరాలు చేసుకుంటున్న ఆ పార్టీ నేతలు

    ప్రస్తుత మార్కెట్‌లో కిలో బీరకాయలు  60 నుంచి  70 రూపాయలు పలుకుతోంది. చిక్కుడుకాయలు కిలో  60 రూపాయల ధర పలుకుతోంది. కేరెట్‌ కేజీ  50 నుంచి  60 రూపాయలు, బెండ కాయలు  40 నుంచి  60 రూపాయల వరకు పలుకుతున్నారు. దొండకాయలు కిలో 50 నుంచి 60 రూపాయలు పలుకుతోంది.  ఇక తోటకూర, గోంగూరు, బచ్చలకూర, పాలకూర వంటి ఆకు కూరలు రకాలను బట్టి ధరలు పలుకుతున్నాయి.

    ఇదీ చదవండి : : నవంబర్ నుంచి నారా లోకేష్ పాదయాత్ర..? 175 నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు రూట్ మ్యాప్

    మార్కెట్లలో కూడా కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు దళారులు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో వివాహాది శుభ కార్యక్రమాలు జోరుగా ఉన్నాయి. దాంతో ధరలు మరింత పెరగనున్నాయి. కార్తీకమాసం నాటికి పరి స్థితి మరింత దారుణంగా ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Price Hike, Vegetables

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు