EAST GODAVARI FISHERMEN FOLLOWING UNIQUE STYLE TO CATCH FISH IN KAKILADA COAST OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP
Unique Fishing: అక్కడ లైట్లు వేస్తే చేపలు పడతాయ్.. మత్స్యకారులు వినూత్న ఆలోచన..!
కాకినాడ తీరంలో లైట్ల వెలుతురులో చేపలవేట
Kakinada: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు రాత్రి సమయంలో అనుకోని ఇబ్బంది వచ్చిపడింది. దీంతో చేపలు పడక వేట సాగడం లేదు. ఇందుకు కారణం చేపలు తెలిమీరిపోవడమే.
కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. పూర్వకాలం నుంచి ఉపాధి పొందాలంటే కులవృత్తులు, ఆయా ప్రాంతాల వారీగా ప్రాముఖ్యతను సందరించుకున్న పనుల్లో నైపుణ్యత సాధించి నాలుగురాళ్లు వెనకేసుకునేవారు. కాలక్రమేణా కులవృత్తులతో పాటు వివిధ రకాల పనుల్లో టెక్నాలజీ వచ్చి చేరింది. ఎక్కడ ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఓ వృత్తి మాత్రం ఇప్పటికీ కొన్ని సాంప్రదాయ పద్దతులపైనే ఆధారపడింది. అదే మత్స్యకార వృత్తి. చేపలు పట్టేందుకు అధునాత బోట్లు, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా సముద్రంలో చేపలు చిక్కాలంటే వల వేయాల్సిందే. సముద్రాలు, నదుల్లో రాత్రుళ్లు కూడా వేటసాగిస్తుంటారు గంగపుత్రులు. ఐతే నదిలో చేపలు పట్టేందుకు మత్స్యకారులు దీపాల వెలుగును ఎరగా వేస్తారు. ఇప్పుడు సముద్రంలో కూడా మత్స్యకారులు ఇదే రకమైన విధానాన్ని ఫాలో అవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) తీరంలోని కాకినాడ (Kakinada), ఉప్పాడ తదితర ప్రాంతాల్లో వేలాది మంది మత్స్యకారులు గంగతల్లిని నమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. సముద్రంలో వేటకి వెళ్లి వలకు చిక్కిన చేపలను విక్రయిస్తూ ఉపాధి పొందుతుంటారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు రాత్రి సమయంలో అనుకోని ఇబ్బంది వచ్చిపడింది. దీంతో చేపలు పడక వేట సాగడం లేదు. ఇందుకు కారణం చేపలు తెలివిమీరిపోవడమే.
సాధారణంగా మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లినప్పుడు తమ బోటులో ఇంజన్ ఆపివేసి, చప్పుడు లేకుండా వలలు వేసి వేటాడతారు. ప్రస్తుతం కాకినాడ సమీపంలో దానికి భిన్నంగా జరుగుతోంది. మత్స్యకారులు సరికొత్త దారిలో వేటసాగిస్తున్నారు. సముద్రంలో చమురు వెలికితీసే రిగ్గుల వద్ద పెద్ద పెద్ద మంటలు వస్తుంటాయి. ఆ ప్రదేశంలో ఆ వెలుతురు ఆకర్షణకు లోనైన చేపలు అక్కడకు గుంపులు గుంపులుగా చేరుకుంటున్నాయి. దీంతో చీకట్లో ఇంజన్లు ఆపేసిన మత్స్యకారులకు చేపలు చిక్కడం లేదు.
దీంతో రూటు మార్చిన మత్స్యకారులు ఆ రిగ్గులకు సమీపలో వెళ్లి తమ బోట్లకు లైట్లు ఆన్ చేస్తున్నారు. ఆ వెలుతురులో గేలాలు వేసి చేపలను పడుతున్నారు. అలా లైటు వేయడం వల్ల రిగ్గు మంటలనుంచి పచ్చే వెలుతురుతో పాటు.. తాము వేసే లైటు వెలుతురుకు కూడా చేపలు ఆ సమీప ప్రాంతానికి చేరుకుంటున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇందులో మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఈ వేటలో మత్స్యకారులు వలలు వినియోగించడం లేదు.. కేవలం గేలాలతోనే పెద్దపెద్ద చేపలను పడుతున్నారు. రిగ్గుల పరిసర ప్రాంతాల్లోకి వెళ్తే మత్స్యకారులు ఇప్పుడు ఈ లైటింగ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.