హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

బిర్యానీలో వేసే జాజికాయ పంటను ఎప్పుడైనా చూశారా..? మంచు ప్రాంతంలో పండేది మన కాకినాడలో ఎలా..?

బిర్యానీలో వేసే జాజికాయ పంటను ఎప్పుడైనా చూశారా..? మంచు ప్రాంతంలో పండేది మన కాకినాడలో ఎలా..?

కాకినాడలో

కాకినాడలో జాజికాయ పండిస్తున్న రైతు

బిర్యానీ (Biryani) అంటే ఎవరికి ఇష్టం ఉండదు...ఆ మాట వింటేనే నోట్లో నీళ్లూరిపోతాయి.. ఎవ్వరైనా సరే బిర్యానీని ఓ పట్టు పట్టాల్సిందే. అంత డిమాండ్‌ ఉన్న బిర్యానికి ఆ రుచి రావాడానికి కారణం అందులో వేసే మసాలా దినుసులే. ముఖ్యంగా జాజికాయ.

  • News18 Telugu
  • Last Updated :
  • Kakinada, India

    P. Ramesh, News18, Kakinada

    బిర్యానీ (Biryani) అంటే ఎవరికి ఇష్టం ఉండదు...ఆ మాట వింటేనే నోట్లో నీళ్లూరిపోతాయి.. ఎవ్వరైనా సరే బిర్యానీని ఓ పట్టు పట్టాల్సిందే. అంత డిమాండ్‌ ఉన్న బిర్యానికి ఆ రుచి రావాడానికి కారణం అందులో వేసే మసాలా దినుసులే. ముఖ్యంగా జాజికాయ. అది లేకుంగా ఏ బిర్యానీ రెడీ అవ్వదు.. అలాంటి జాజికాయ పంటను మీరెప్పుడైనా చూశారా..! అసలు ఆ జాజికాయ ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా..! మనకెలా తెలుస్తుంది అదెక్కడో మంచుకొండల్లో పండేదైతే అనుకుంటున్నారా..! అయితే మీకో గుడ్‌ న్యూస్‌...ఆ పంట చూడాలంటే ఎక్కడో మంచుకొండల్లోకి వెళ్లక్కర్లేదు.. మన పక్కనే ఉన్న కాకినాడకు వెళ్తే చాలు. కాకినాడ జిల్లా (Kakinada District) లోని ఉప్పాడ‌-కొత్తప‌ల్లి మండలంలో ఓ రైతు ఏకంగా కేర‌ళ (Kerala), హిమాచ‌ల్‌ ప్రదేశ్ (Himachal Pradesh) వంటి రాష్ట్రాల్లో పండే పంట‌ల‌ను పండిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా మసాల దినుసులు..అందులోనూ అత్యంత ఖ‌రీదైన జాజికాయ పంట‌ను వేశాడు రైతు గుండ్రా అంబ‌య్య.

    జాజికాయ పండే వాతావరణాన్ని సృష్టించిన రైతు..!

    ఎండ‌ప‌ల్లిలో త‌న‌కున్న కొద్ది పాటి పొలంలో ఓ జాజికాయ మొక్కను వేసిన రైతు, అది ఏపుగా పెర‌గ‌డంతో ఆ త‌ర్వాత మ‌రిన్ని జాజికాయ మొక్కలు తెప్పించి వేశాడు. అయితే ఎంతో చ‌ల్లద‌నం ఉండాల్సిన ప్రాంతంలో మాత్రమే ఈ పంట పండుతుంది. దీంతో ఆ రైతు అక్కడ చ‌ల్లని ప్రదేశాన్ని త‌యారు చేశాడు. బోరు ద్వారా వ‌చ్చే నీటిని ఎప్పటిక‌ప్పుడు మొక్కల వ‌ద్దకు వెళ్లేలా చేసి పంట‌ను ఏపుగా పెరిగేలా చేశాడు. ఇత‌ని ప్రతిభ గ‌మ‌నించిన ఉద్యాన‌వ‌న‌శాఖ అదికారులు కూడా ఈపంట ఇక్కడ పండించడం ఎలా సాధ్యపడిందని దానిపై లోతుగా అధ్యయ‌నం చేశారు.

    ఇది చదవండి: అక్కడికి ఒక్కసారి వెళ్తే మీ ఇల్లు నందన వనమే..! అందుకే మహిళలు క్యూ కడతారు..!

    ఈ జాజికాయలో దేశీవాళీ, హైబ్రీడ్‌ అని రెండు రకాలు ఉన్నాయి. దేశీవాళి అయితే బాగా ఎత్తుగా పండటం, కాపు కూడా ఏడేళ్లకు వస్తుందని తెలిసి..హైబ్రీడ్‌ మొక్కను తీసుకొచ్చి నాటాడు. ఈ హైబ్రీడ్ మొక్క అయితే తక్కువ ఎత్తులో పెరుగుతుంది త్వరగా కాపు వస్తుంది. ఈ పంటకు పిట్టల బెడద ఉండదని అంబయ్య చెబుతున్నారు. అంతేకాదు కూలీల పని కూడా తక్కువగా ఉంటుందని..మందులు కొట్టాల్సిన పని కూడా ఉండదంటున్నారు అంబయ్య. ఇది రైతుకు లాభదాయకమైన పంటే కానీ నష్టం వచ్చేదేమీ లేదంటున్నారు అంబయ్య.

    ఇది చదవండి: ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ లో అదరగొడుతున్న స్వీపర్.. పిల్లలు మాట్లాడుతుంటే విని నేర్చుకుంది

    ఒక కేజీ కాయ‌లు కాస్తే వాటిని మార్కెట్‌లో దాదాపు 2500 వ‌ర‌కూ అమ్మాడు. అంత గీరాకీ ఉన్న ఈ పంట పండించ‌డ‌మంటే మాములు విష‌యం కాదు. కానీ అంబ‌య్య చేసిన ఈ సాహసానికి స్థానికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మాములు వ్యవ‌సాయం ఇప్పుడు లాభ‌సాటిగా లేదు. అందుకే నాకు ఈ ఆలోచ‌న వ‌చ్చిందని అంబయ్య తెలిపాడు. మ‌సాల దినెసుల‌ను పండిస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచనతో నిపుణుల అభిప్రాయం తీసుకుని ముంద‌డ‌గు వేశానన్నాడు. ప్రస్తుతం పంట కాపు ఫ‌ర్వాలేదని.. భ‌విష్యత్తులో ఇంకా మరిన్ని మసాలా దినుసులు పెంచ‌డానికి ప్రయ‌త్నిస్తాన‌ని రైతు అంబ‌య్య చెబుతున్నాడు.

    ఇది చదవండి: ప్రభుత్వ ఉద్యోగమున్నా డోంట్ కేర్.. సొంత సెలూన్ ఉంటేనే పిల్లనిస్తారట..!

    అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో మ‌షాల దినెసులు పండించ‌డ‌మంటే మాములు విష‌యం కాదు. ఒక ప‌క్క స‌ముద్రతీరం…ఆర్థ్రత ఎక్కువ‌గా ఉండే ప్రాంతం. ఒక‌ ర‌కంగా చెప్పాలంటే వేడి ప్రాంత‌మ‌నే చెప్పాలి. కేర‌ళ‌, ఈశాన్య రాష్ట్రాల‌తో పోలీస్తే ఇక్కడ మ‌సాల దినెసుల పంట అనేది అసాధ్యం. కానీ అంబ‌య్య దాన్ని సుసాధ్యం చేశాడు..భవిష్యత్‌లో ఇక్కడ ఇంకా ఎక్కువ మ‌షాల పంట‌లు వేస్తాన‌ని ధైర్యంగా చెబుతున్నాడు.

    ఇది చదవండి: ఆ కొండపైన రాయి కాదు కదా పూచికపుల్ల పట్టుకోవాలన్నా వణికిపోతారు..! కారణం ఇదే..!

    కాలక్రమేణా రైతులు పరిస్థితులకు అనుగుణంగా వాణిజ్య పంటలు వేస్తే ఆదరణతో పాటు ఆదాయం కూడా ఉంటుంది అని చెప్పటానికి ఈ అంబయ్య ప్రయత్నమే ఓ చిన్న ఉదాహరణ. ఫోన్‌ నెంబర్‌: +91 94417 47144, అంబయ్య, రైతు.

    మీకు ఈ పంట వేయాలని ఉన్నా, ఏమైనా సందేహాలున్నా రైతు అంబయ్యను సంప్రదించవచ్చు. లేదా మీ దగ్గరలోని ఉద్యానవన శాఖ అధికారులను అడిగి సలహాలు సూచనలు తీసుకోవచ్చు.

    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Kakinada, Local News

    ఉత్తమ కథలు