హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఉద్యోగాల కోసం నకిలీ సర్టిఫికేట్‌లు పెట్టారు..! అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు..!

ఉద్యోగాల కోసం నకిలీ సర్టిఫికేట్‌లు పెట్టారు..! అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు..!

తూర్పు గోదావరి జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం

తూర్పు గోదావరి జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం

East Godavari: చ‌దువుకున్న తెలివితేట‌ల‌ను కొంత‌మంది వ‌క్రమార్గంలో చూపిస్తున్నారు. లేని మార్కులు చూపించి జాబులు కొట్టేద్దామ‌న్న ఆశ‌తో ఉన్నారు. కానీ వెన‌క‌కి ఓ సామెత చెప్పిన‌ట్టు ఆశ ఎక్కువైతే అస‌లుకే మోసం జ‌రిగిపోయింది అన్నట్లుగా మార్కులు ఎక్కువ‌గా చూపించి అడ్డంగా దొరికేశారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • East Godavari, India

  P Ramesh, News18, Kakinada

  చ‌దువుకున్న తెలివితేట‌ల‌ను కొంత‌మంది వ‌క్రమార్గంలో చూపిస్తున్నారు. లేని మార్కులు చూపించి జాబులు కొట్టేద్దామ‌న్న ఆశ‌తో ఉన్నారు. కానీ వెన‌క‌కి ఓ సామెత చెప్పిన‌ట్టు ఆశ ఎక్కువైతే అస‌లుకే మోసం జ‌రిగిపోయింది అన్నట్లుగా మార్కులు ఎక్కువ‌గా చూపించి అడ్డంగా దొరికేశారు. ఉమ్మడి తూర్పుగోదావ‌రి జిల్లాలో పారామెడిక‌ల్ పోస్టుల‌కు సంబంధించి 16 క్యాడ‌ర్ల ప‌రిధిలో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా డైర‌క్టర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్‌, వైద్య విధాన ప‌రిష‌త్‌, డీఎంఈ ప‌రిధిలో ఉన్నటువంటి పోస్టుల్లో చేరేందుకు ఆఫ్‌లైన్‌లో ధ‌ర‌ఖాస్తులు ఆహ్వానించారు. 100 పోస్టుల‌కుగాను దాదాపుగా 2 వేల‌కుపైగా అభ్యర్థులు ధ‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇటీవ‌ల కాలంలో ప్రతిభా జాబితాను కూడా విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ఓ అభ్యర్థినికి 2100 మందికి గాను 1932 మార్కులొచ్చాయి.

  దీంతో అనుమానం వచ్చిన అధికారులు వెంట‌నే ఆమె అప్లై చేసిన ధ‌ర‌ఖాస్తును పునఃప‌రిశీలించారు. ఇదే మ‌హిళ గ‌తంలో కూడా ధ‌ర‌ఖాస్తు చేయ‌డంతో పాత ధ‌ర‌ఖాస్తును, తాజాగా ఆప్లై చేసిన అప్లికేష‌న్‌ను ప‌రిశీలించ‌డంతో వాస్తవాలు బ‌య‌ట‌కొచ్చాయి. అంత‌క‌ముందు అప్లై చేసిన అప్లికేష‌న్‌లో 1300 మార్కులు రావడంతో అధికారులు ఆమె పెట్టిన స‌ర్టిఫికేట్ ఫేక్‌గా తేల్చారు. ఇలా ఒకే కేడ‌ర్ పోస్టుకు సంబంధించి ముగ్గురు అభ్యర్థులు ప‌ట్టుబ‌డ‌టంతో విచార‌ణ ప్రారంభించారు పోలీసులు.

  ఇది చదవండి: అనాథలకు ఆపద్భాందవుడు..! ఈ యువకుడు చేస్తున్న పనికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!

  వికాస నుండే వెలుగులోకి..!

  కాకినాడ క‌లెక్టరేట్‌లో ఉన్న వికాస అనే ఉద్యోగ నియామ‌క సంస్థ నుండి స‌ర్వీస్ స‌ర్టిఫికెట్ ఇప్పిస్తాన‌ని మ‌ధ్యవ‌ర్తి ఒక‌రు ఒక్కొక్కరి ద‌గ్గర నుండి రూ.9 వేలు తీసుకుని న‌కిలీ ధృవ‌ప‌త్రాలు అందించిన‌ట్లు తెలుసుకున్న ఓ వ్యక్తి స్పంద‌న‌లో అధికారులకు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో స‌ర్టిఫికేట్లను త‌నిఖీ చేసిన అధికారులు వాస్తవాల‌ను గుర్తించారు. ఈ విష‌యంపై కాకినాడ మూడ‌వ ప‌ట్టణ పోలీసుల‌కు డీఎమ్అండ్ హెచ్‌వో ఫిర్యాదు చేశారు. గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో జిఎన్ ఎమ్ పోస్టుల‌ భ‌ర్తీకి సంబంధించి న‌కిలీ ప‌త్రాలు పెట్టడంతో కేసు న‌మోద‌య్యాయి. తాజాగా పారా మెడిక‌ల్ పోస్టుల‌కు అదే విధానంలో న‌కిలీ బాట ప‌ట్టడంతో అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

  ఇది చదవండి: ఆ జిల్లాలో ఆర్టీసీ బస్సెక్కాలంటేనే హడలిపోతున్న జనం.. అంతగా భయపెట్టిన విషయం ఏంటంటే..!

  న‌కిలీ సృష్టి ఎలా..!

  వాస్తవానికి న‌కిలీ ధృవ‌ప‌త్రం త‌యారు చేడ‌యం వెనుక కొంత మంది ప్రబుద్ధులు సిద్ధహ‌స్తుల‌య్యారు. ఆయా కోర్సుకు సంబంధించి బోర్డు లోగోను నేరుగా స‌ర్టిఫికెట్‌ల‌పై ముద్రిస్తున్నారు. అయితే మార్కులు వేయ‌డంలో అత్యధికంగా చూపించ‌డంతో దొరికిపోతున్నారు. గ‌తంలో అభ్యర్థుల ధ‌ర‌ఖాస్తుల‌ను కూడా అధికారులు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డంతో గ‌తంలో పోస్టులు రాని వారికి ఈసారి అవ‌కాశం రావ‌డంతో , ఆపోస్టు వ‌స్తుందేమోన‌ని ఆశ‌లు పెట్టుకున్న అర్హులు వాస్తవాల‌ను వెలుగులోకి తెస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్‌లైన్ కావ‌డంతో ప‌లు బోర్డుల ద్వారా వ‌స్తున్న జిరాక్స్ కాపీల‌ను అధికారులు, ఎవ‌రైనా ఫిర్యాదు చేస్తే త‌ప్ప గుర్తించ‌లేక‌పోతున్నారు.

  ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇప్పటి వ‌ర‌కూ రిక్రూట్‌మెంట్ జ‌రిగిన పోస్టుల‌పైనా అనుమానాలు క‌లుగుతున్నాయి. నాన్‌లోక్‌ల్‌, లోకల్ విభాగాల్లో పోటీ ప‌డ్డ అభ్యర్థుల్లో కొంత మంది ఫేక్ స‌ర్టిఫికెట్‌లు పెట్టి ఉద్యోగాలు సంపాదించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ వ్యవ‌హారంలో డిఎమ్అండ్ హెచ్‌వో కార్యాల‌యంలో కొంత మంది స‌హ‌కారం ఉంద‌నే విమ‌ర్శలు లేక‌పోలేదు. ఇప్పుడు అధికారులు గుర్తించిన పారామెడిక‌ల్‌లో ఫేక్ స‌ర్టిఫికెట్ల వ్యవ‌హారం బ‌య‌ట‌ప‌డ‌టంతో గ‌తంలో ఫేక్ స‌ర్టిఫికెట్లు పెట్టి పోస్టులు సాధించిన వారి గుండెల్లో ద‌డ మొద‌లైంది. న‌కిలీ వ్యవ‌హారంపై అధికారులు ఏ కోణంలో ముందుకెళ్తార‌నేది మాత్రం వేచి చూడాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East godavari, Local News

  ఉత్తమ కథలు