హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dussehra 2022: ఆ పుణ్యక్షేత్రంలో దసరా, కార్తీకమాసం ఏర్పాట్లకు ఇంత ఖర్చా..! ఏం చేస్తారంటే?

Dussehra 2022: ఆ పుణ్యక్షేత్రంలో దసరా, కార్తీకమాసం ఏర్పాట్లకు ఇంత ఖర్చా..! ఏం చేస్తారంటే?

దసరా, కార్తీకమాస ఉత్సవాలకు సిద్ధమైన అన్నవరం

దసరా, కార్తీకమాస ఉత్సవాలకు సిద్ధమైన అన్నవరం

Dussehra: ఆధ్యాత్మిక న‌గ‌రి అన్నవ‌రంలో ఏది చేసినా ప్రత్యేక‌మే..అన్నవ‌రం శ్రీ వీర‌వెంక‌ట స‌త్యనారాయ‌ణ‌స్వామిని ద‌ర్శిస్తే చాలు స‌క‌ల పాపాలు పోతాయ‌న్నది భ‌క్తుల న‌మ్మకం. తాజాగా దసరా ఉత్సవాలు, కార్తీక మాసం ఏర్పాట్ల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు తెలుసా.?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • East Godavari, India

  P.Ramesh, News18, Kakinada.

  ఆధ్యాత్మిక న‌గ‌రి అన్నవ‌రం (Annavaam) లో ఏది చేసినా ప్రత్యేక‌మే.. అన్నవ‌రం శ్రీ వీర‌వెంక‌ట స‌త్యనారాయ‌ణ‌స్వామి (Sree Veeravenkata Satyanarayana Swamy) ని  ద‌ర్శిస్తే చాలు స‌క‌ల పాపాలు పోతాయ‌న్నది భ‌క్తుల న‌మ్మకం. ఇక్కడ జ‌రిగే పూజాధి కార్యక్రమాల‌కు చేసే ఖ‌ర్చులో ఎక్కడా త‌గ్గరు. రాబోయే కాలానికి త‌గ్గట్టుగా ఎప్పటిక‌ప్పుడు అంచ‌నాల‌తో ముంద‌డుగు వేస్తున్నారు ఇక్కడ నిర్వాహ‌కులు. తాజాగా అన్నవ‌రం దేవ‌స్థానంలో ద‌స‌రా ఉత్సవాల్లోనూ, అనంత‌రం ప్రారంభ‌మ‌య్యే కార్తీక మాసంలో జ‌రిగే పూజాధి కార్యక్రమాల‌కు ముంద‌స్తుగానే ప్రణాళిక వేశారు.

  ఆల‌య ఛైర్మన్ ఐ.వి.రోహిత్ అధ్యక్షత‌న స‌మావేశం ఏర్పాటు చేసి ప‌లు అభివృద్ది ప‌నుల‌కు ఆమోద ముద్ర వేశారు. దేవ‌స్థానానికి సంబంధించి అన్నివిభాగాల అధిప‌తుల‌తో స‌మీక్ష నిర్వహించి దాదాపుగా కోట్లు ఖ‌ర్చుపెట్టి, ప‌నులు నిర్వహించేందుకు అంచ‌నాల‌ను సిద్ధం చేశారు.

  జ‌రిగే అభివృద్ధి ప‌నులివే..!

  దేవ‌స్థానంలో ముఖ్యంగా రూ.8.35 ల‌క్షల‌తో సీతారామ స‌త్రం, రూ.14.35 ల‌క్షల‌తో స‌త్యదేవ అతిథి గృహం నిర్మించేందుకు నిర్ణయించారు. రూ.9.50 ల‌క్షల‌తో ప్రధాన ఆల‌యం, ట్రస్ట్‌బోర్డు హాలు, వ్రతానికి ఉప‌యోగించే మండ‌పాల అభివృద్ధికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త, పాత సెంటిన‌రీ కాటేజీల స్లాబు మ‌ర‌మ్మత్తుల అంచ‌నాల‌కు ఆమోద ముద్ర వేశారు.

  ఇదీ చదవండి : ప్రేమించాడు.. పెళ్లంటే మాయమయ్యాడు..! ప్రేయసి ఇచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదు

  రూ.11.50 ల‌క్షల‌తో స‌త్యదేవ అతిథి గృహం, సీతారామ స‌త్రం అభివృద్ధికి రూ.15 ల‌క్షలు, రూ.15.50 ల‌క్షల‌తో కొత్త, పాత సెంటిన‌రీ కాటేజీల్లో స్నాన‌పు గ‌దుల మర‌మ్మత్తుల‌కు నిధులు కేటాయించారు. రూ.13.80 ల‌క్షల‌తో స‌త్యదేవ అతిథి గృహం ఎదురుగా షెడ్డు నిర్మాణం నిర్మించేందుకు నిర్ణయించారు.

  ఇదీ చదవండి: నగదు తీసుకోవడానికి వేలి ముద్రలు వేస్తున్నారా..? అయితే బీకేర్ ఫుల్.. దీని గురించి తెలుసుకోవాల్సిందే

  వీట‌న్నింటిలో అవ‌స‌రాన్ని బ‌ట్టి మార్పు చేసుకునే అవ‌కాశం దేవ‌స్థానానికి ఉంది. వీటితోపాటు అన్నవ‌రం దిగువున ఉండే పంపా స‌త్రం నిర్వాహ‌ణ‌కు వేలం నిర్వహించ‌నున్నారు. స‌త్యగిరిపై వివాహ గుమ్మటాల హ‌క్కునకు సంబంధించిన టెండ‌ర్లను ఆమోదించారు.

  ఇదీ చదవండి: కొడాలి నాని మౌనానికి అర్థం ఏంటి..? విమర్శలపై ఎందుకు స్పందించడం లేదు?

  ముందు ద‌స‌రా … త‌ర్వాత కార్తీక మాస ఏర్పాట్లు..!

  అన్నవ‌రం దేవ‌స్థానంలో ప్రత్యేకంగా వ్రతాలు జ‌రుగుతుంటాయి. వీటితోపాటు కార్తీక మాసంలో ఇక్కడ పూజ‌లు ప్రత్యేకం. దీపారాధ‌న‌కు పెద్ద ఎత్తున మ‌హిళ‌లు ఇక్కడకు వ‌స్తుంటారు. గిరి ప్రద‌క్షిణ, స‌త్యదీక్షలు, తెప్పోత్సవం ఘ‌నంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. పంపాన‌ది స‌రోవ‌రం వ‌ద్ద రూ.4.85 ల‌క్షల‌తో, రూ.1.90 ల‌క్షల‌తో గిరి ప్రదిక్షణ రోడ్డు మ‌రమ్మత్తుల‌కు అంచ‌నాల‌ను రూపొందించారు.

  ఇదీ చదవండి: ఏపీలో 62 లక్షల మందికి గుడ్ న్యూస్.. ఇకపై ఎక్కడ కవాలంటే అక్కడే లబ్ధి.. పూర్తి వివరాలు ఇవే

  గోదావ‌రి హార‌తికి నిధులు కేటాయింపు..!

  అన్నవ‌రం దేవ‌స్థానం ఆధ్వర్యంలో రాజ‌మ‌హేంద్రవ‌రం పుష్కర‌ఘాట్ వ‌ద్ద చేప‌ట్టే నిత్య హార‌తికి నెల‌కు రూ.2.50 లక్షల‌ను కేటాయిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా గోదావ‌రి హార‌తి చేప‌ట్టేందుకు నిధులను అన్నవ‌రం దేవ‌స్థానం నుండే కేటాయించ‌డం ప‌రిపాటిగా వ‌స్తుంది. ప్రత్యేకంగా పూజ‌రులు, హార‌తి బృందంతో నిత్య హార‌తి చేప‌డ‌తారు. ఈ హార‌తి వీక్షించేందుకు న‌వ‌రాత్రులందు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Dussehra 2022, Local News

  ఉత్తమ కథలు