Home /News /andhra-pradesh /

EAST GODAVARI DR BR AMBEDKAR KONASEEMA DISTIRCT NAME FINALIZED AP GOVERNMENT NGS

Konaseema: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమే ఫైనల్.. అధికారిక గెజిట్ రిలీజ్.. మరి వివాదం సంగతి ఏంటి..?

డాక్టర్ బీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు ఫైనల్

డాక్టర్ బీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు ఫైనల్

Konaseema: తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైనా..? పరిస్థితి హింసాత్మక ఘటనలకు దారి తీసినా.. ప్రభుత్వం మాత్రం అనుకున్న ప్రకారమే ముందడుగు వేసింది. ఇకపై కొనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఫైనల్ చేస్తూ.. గెజిట్ రిలీజ్ చేసింది.. దీంతో పరిస్థితి సద్దుమణుగుతుందో.. లేదా మళ్లీ వివాదం మొదటికి వస్తుందో చూడాలి.

ఇంకా చదవండి ...
    Konaseema: ప్రశాంతతకు మారు పేరైన కోనసీమ (Konaseema) ఆ మధ్య అట్టుడుకింది. జిల్లా పేరు మార్పు విషయంలో మొదలైన వివాదం పెను హింసాత్మకంగా మారింది. దీంతో జిల్లా పేరు మార్పుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా (Dr BR Ambedkar Konaseema District) గానే ప్రభుత్వం ఫైనల్ చేసింది. దీనికి సబంధించి అధికారిక గెజిట్ రిలీజ్ చేసింది. తీవ్ర ఉద్రిక్తతలు, వాగ్వివాదాల మధ్య అట్టుడికిన.. ప్రభుత్వం తగ్గేదే లే అంటూ.. తమ నిర్ణయాన్ని ఫైనల్ చేసింది. వివాదాల సంగతి పక్కన పెడుతూ.. అధికారిక గెజిట్ విడుదల చేసింది. అంతకుముందు జిల్లా పేరును మారుస్తూ మే 18 న రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన సమయంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌, కాటన్‌దొర, డొక్కా సీతమ్మ వంటి గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టాలనే డిమాండ్లు అక్కడక్కడా వినిపించాయి. అయితే అమలాపురం (Amalapuram) పార్లమెంటు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో అంబేద్కర్‌ పేరు పెట్టాలనే వాదన తెరపైకి వచ్చింది. మే 24న ‘చలో అమలాపురం’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అమలాపురం రణరంగంగా మారింది. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టారు. కాల్పులు జరిగాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం కలిగించింది.

    కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం తొలుత కోనసీమ పేరుతోనే ప్రభుత్వం జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే, ఆ తర్వాత స్థానికంగా వచ్చిన డిమాండ్ల కారణంగా..? ఈ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ మే 18న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే తొలుత ప్రకటించిన జిల్లా పేరుకు ముందు అంబేద్కర్ పేరును చేర్చడాన్ని నిరసిస్తూ జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 

    దాదాపు పది రోజుల పాటు అమలాపురంలో ఉద్రిక్త ఘటనలు ఏర్పడ్డాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఇంటర్నెట్ నిలిపివేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 235 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాగా.. అంబేద్కర్‌ పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ 1984లోనే తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి ఈ డిమాండ్ వినిపిస్తున్నా.. జిల్లాలను విభజిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ డిమాండ్‌కు మరోసారి బలం వచ్చింది. అమలాపురం కేంద్రంగా ఏర్పడిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం , రాజోలు, పి.గన్నవరం, రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం నియోజకవర్గాలు ఉన్నాయి. 22 మండలాలు ఉన్నాయి.  

    ప్రభుత్వం గెజిట్ నోట్ విడుదల చేయడంతో.. తీవ్ర ఉద్రిక్తతలు, డిమాండ్లు, ఎదురుచూపులకు తెరపడినట్టేనా..? నిరసన కారులు ఇక సైలెంట్ గా ఉంటారా.. మళ్లీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలకు దిగుతారా అన్నది చూడాలి.. మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా.. ప్రస్తుతం పోలీసులు క్షేత్ర స్థాయి పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, AP new districts, AP News, East Godavari Dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు