P Ramesh, News18, Kakinada
ఈ తరంలో సాంకేతిక రంగం అభివృద్ధి అన్నింటిపైనా చూపిస్తోంది. నాడు కాలినడక నుండి సైకిల్ ఎక్కిన మనిషి నేడు రాకెట్లలో ఏకంగా అంతరిక్షాన్నే ఆస్వాదిస్తున్నాడు. ఎక్కడ చూసిన సాంకేతిక విప్లవం. ప్రపంచ దేశాలలో మనం ముందుకు సాగిపోతున్నాం. ఇలాంటి యుగం నుండి ఒక్కసారి మనం వెనుకకు తిరిగి చూస్తే ఎక్కడ ఉండేవాళ్లం..ఎక్కడున్నాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా..! అందుకే చరిత్ర అనే పాఠాలు భవిష్యత్తుకు పునాదులు. గతంలో మనం ఎలా ఉండేవాళ్లం.. ఏం తినేవాళ్లం అనే దగ్గర నుండి నేడు ఎలా ఉన్నామంటే ఓ యుగమే మారి కలియుగమైంది. మానవుడు జీవిత చరిత్రలోకి వెళితే. ఆదిమానవ కాలం నుండి ఆధునాతన మనిషి వరకూ అన్ని ప్రయోగాలే సాక్ష్యం.
గతంలో ఒకప్పుడు మనిషి నుండి మనిషికి సమాచారం అందాలంటే నెలలు పట్టేవట. అసలు అప్పట్లో కూడా మనం చెప్పుకుంటున్న ఈనెలలు అనేది తెలియదు. కేవలం రాత్రి..పగలు. ఇలా రాత్రింబవళ్లు ఆధారంగానే కాలాన్ని లెక్కించుకునే వారట. వాస్తవానికి మనిషికి సమయం తెలియాలంటే నీడే ఆదారం. సూర్యుడు ఉదయిస్తే పగలు. అస్తమిస్తే రాత్రి. చంద్రుడు కనిపిస్తే పౌర్ణమి. అస్తమించే వైపు వెళ్లి పూర్తిగా చీకటి పడితే అమవాస్య. ఇదే పాతకాలానికి ఆధారం.
అయితే రాను రాను చరిత్ర మారింది. చరిత్ర నుండి వర్తమానంలోకి అడుగు పెట్టిన మనిషికి సమయం తెలిసింది. ఒకప్పుడు ఈ సమయాన్ని కొలవడానికి నీడను ప్రయోగిస్తే నేడు. కాలాన్ని లెక్కించడానికి టైమ్ మిషన్లను సృష్టిస్తున్నాడు మానవుడు.
చరిత్రకు సాక్ష్యంగా ఈ సూర్యసమయం
గతంలో సమయాన్ని తెలుసుకోవడంలో పూర్వికులు రకరకాల పద్దతులు ఉపయోగించేవారు. అలాంటి పద్దతుల్లో ఒకటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉంది. అన్నవరం పుణ్యక్షేత్రం కొండపై ఉంది. సూర్యనారాయణ స్వామి ప్రతిమ ఉండి. అక్కడ ఒక రాతిపై అంకెలు ఉంటాయి. మధ్యలో నీడను చూపించే ఓ రాయిని నిలువుగా అమర్చారు. దాని ఎదురుగా 12 అనే సంఖ్య ఉంటుంది. అక్కడి నుండి నిమిషాలు, సెకన్ల ముల్లును గీతల రూపంలో రాయబడి ఉంచారు. సూర్యుడు కాంతి( సన్ డైల్ ) ఆధారంగా మధ్యలో ఉంచబడిన రాయి నీడ సమయాన్ని బట్టి జరుగుతుంది. ఆనీడ అక్కడ గీయబడిన గీతల ఆధారంగా ముందుకు వెళ్లడంతో సమయాన్ని లెక్కిస్తారు. ఈవిధంగా పూర్వంలో సమయాన్ని తెలుసుకునే వారని చెబుతున్నారు. అన్నవరం దర్శించుకునే భక్తులు ఖచ్చితంగా సూర్య సమయం ప్రాంతాన్ని దర్శిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Kakinada, Local News