P.Ramesh, News18, Kakinada.
త్రీ ఇడియట్స్ మూవీ (Three Idiots Movie) ఈ జనరేషన్ లో చాలమందికి గుర్తు ఉండే ఉంటుంది. అదే సినిమా తెలుగులో స్నేహితుడు (Snehithudu) గా వచ్చింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యువత ఎంతో మెచ్చిన సినిమా. అసలు పిల్లలు ఎలా చదవాలో..వాళ్లకు ఎలా చదువు చెబితే అర్థం అవుతుందో ఆ సినిమాలో చాలా చక్కగా వివరించారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ (Practical Knowledge) తోనే విద్యార్థుల్లో (Students) చదువుకునే విషయాలపై అవగాహన ఉంటుందనేది కాదనలేని సత్యం.. ఇప్పుడు సరిగ్గా అదే ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు (Government Techer) . మరి ఎక్కడో తెలుసా..?
విద్యార్థులకు చాలా సులువుగా పాఠాలు అర్థమయ్యేలా…ప్రతి విషయాన్ని బొమ్మల రూపంలోనో, ప్రయోగం రూపంలోనో బోధిస్తున్నారు. ఎవరైనా బొమ్మలంటే పిల్లలు ఆడుకోవడానికో, ఏదో అలంకరణ కోసమో ఇంటిలోపల ఉంచుతారు. కానీ బొమ్మలతోనే చదువు చెప్పడం ఆయన వంతు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District ) లోని కొత్తగా ఏర్పాటైన కాకినాడ జిల్లా (Kakinada) గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలోని మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీ టీచర్ పిల్లి గోవిందరాజులు. కేవలం బొమ్మలే కాదు. ప్రతీ తరగతిలో సైన్సు ప్రయోగాల ద్వారా విద్యార్థులకు చదువు చెబుతున్నారు.
ఇదీ చదవండి : ఓ లేఖతో ఎమ్మెల్యే-మాజీ ఎమ్మెల్యే మధ్య ఫైట్.. ఆ లేఖలో ఏముంది
ఈ పోటీప్రపంచంలో ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా ఉన్నతంగా చదివించుకోవాలని చూస్తుంటారు. అందుకోసం వారు లక్షల డబ్బులు వెచ్చించేందుకు కూడా వెనుకాడరు. ఈ ప్రభావమే వారికి ప్రభుత్వ పాఠశాలలంటే కాస్త చులకన భావం ఉంటుంది. అక్కడ చదువులు చెప్పించాలంటే ఎన్నో సందేహాలు వస్తుంటాయి.
ఇదీ చదవండి : కృష్ణ జింక దీక్షతో దిగివచ్చిన అధికారులు..! షాక్ అవుతున్నా ఇది నిజం.. మీరే చూడండి..
చదువు సక్రమంగా చెబుతారా..? గవర్నమెంటు టీచర్లు కదా బాగా పనిచేస్తారా అంటూ అన్ని అనుమానాలే. కానీ చినజగ్గంపేటలో ఎస్జీటీగా పనిచేస్తున్న పిల్లి గోవిందరాజులు , నిజంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే అసలు సిసిలైన పాఠం ఉంటుందని చెబుతున్నారు. పిల్లలు చదువుకోడానికి కావల్సిన పరికరాలను ఆయన స్వయంగా తీసుకొచ్చి అవగాహన కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి : రాతి స్తంభంపై అక్షరాలకు అర్థం ఏంటి? ఏ భాష గుర్తు పట్టగలరా..? కిలికి అనుకోకండి..!
1997లో సైన్సు ఉపాధ్యాయుడిగా వృత్తి చేపట్టిన గోవిందరాజులు ఆయన పనిచేసిన పాఠశాలను మొత్తం ప్రయోగశాలగా మార్చేస్తారు. నిత్యం విద్యార్థులచే బొమ్మలు తయారు చేయించడం, ఆకులపై ఆకారాలు(లీఫ్ కార్వింగ్)గీయడంతోపాటు, తాటియాకులతో పువ్వులు, కాగితాలతో శుభలేఖలు చేయిస్తారు. వీటితోపాటు మరెన్నో సృజనాత్మకత కార్యక్రమాలకు మూలమయ్యారు.
ఇదీ చదవండి : టీడీపీలో ఆ సీనియర్ నేత హవా ముగిసినట్లేనా..? చెక్ పెడుతున్న కీలక నేత..?
దక్షిణాది రాష్ట్రాలలో పోటీపడిన సైన్స్ ఫెయిర్ పోటీల్లో బంగారుపతకం సాధించారు. వేసవి వినోదం అనే కార్యక్రమం ద్వారా పప్పెట్స్ వర్క్ షాప్‌లను నిర్వహించి ఉచితంగా గత 17 ఏళ్లుగా సేవలందిస్తున్నారు మాస్టర్ గోవిందరాజులు.
ఇదీ చదవండి ఆమెకు ఆమె శత్రువైందా..? ఆ అధికారిణి లంచం అడిగింది ఎవరినో తెలిస్తే ఖంగుతినాల్సిందే..!
వీటితో పాటు విద్యార్థులకు బయట వాతావరణంపై అవగాహన, అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లడంతోపాటు, సామాజిక బాధ్యత, సంప్రదాయాల అలవాటు, పండగ విశేషాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన నిత్యం విద్యార్థులకోసమే పరితపిస్తుంటారు. ఈయన విద్యార్థులకు చెబుతున్న ప్రయోగ విద్యపై ఉన్నతాధికారులు సైతం శభాష్ అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Schools, Local News, Nellore Dist, Teacher