హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Golingeshwara Swamy: శివలింగాన్ని కూడా వైసీపీ నేతలు వదలరా..? గోలింగేశ్వరస్వామి ఆలయంలో అపచారం..

Golingeshwara Swamy: శివలింగాన్ని కూడా వైసీపీ నేతలు వదలరా..? గోలింగేశ్వరస్వామి ఆలయంలో అపచారం..

శివ లింగానికి తాడ్లు కట్టిన వైసీపీ నేతలు

శివ లింగానికి తాడ్లు కట్టిన వైసీపీ నేతలు

Golingeshwara Swamy: ఆంధ్రప్రదేశ్ లో దేవుడికి కూడా రక్షణ లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరో అపచారం వెలుగులోకి వచ్చింది. ఆఖరి వైసీపీ నేతలు.. శివలింగాన్ని కూడా వదలరా అంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే..?

 • News18 Telugu
 • Last Updated :
 • East Godavari, India

  Golingeshwara Swamy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో హిందూ సంప్రదాయం (Hindu Culture) పై దాడి జరుగుతోందనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఎందుకుంటే ఎక్కడో ఒక దగ్గర విగ్రహాలు కూల్చి వేయడం.. లేదా ఆలయాలను ధ్వంసం (Temple Demolishes) చేసిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని.. కఠిన శిక్షలు వేస్తామని పోలీసులు, ప్రభుత్వం (AP Government) చెబుతున్నా.. విధ్వంసం ఆగడం లేదు. రోజు రోజుకూ రెట్టింపు అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక బీజేపీ నేతలు (BJP Leaders) అయితే.. కొన్ని వర్గాలు కావాలనే హిందు దేవుళ్లపై దాడులు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వాటిని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని కూడా ఆరోపిస్తున్నారు.

  ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన వైసీపీ నేతలు చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది. దేవుడ్ని కూడా వదలరా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. వారి సభ నిర్వహించుకోవడానికి శివలింగాన్ని వాడడంపై హిందువులు, భక్తులు, విపక్షాలు అంతా తప్పు పడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే..?

  ఎక్కడైనా సాధారణంగా శివలింగానికి ఏ తాళ్లు కట్టరు. ఎందుకంటే శివలింగం అంటే ఎంతో పవిత్రంగా చూడడం మన సంప్రదాయం. అసలు తాకాలి అంటేనే భయపడతారు.. ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసినప్పుడు మాత్రమే శివలింగాన్ని తాకుతారు.. కానీ తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ గోలింగేశ్వరస్వామి ఆలయంలో శివలింగానికి ఊహించని అపచారం జరిగింది.

  ఇదీ చదవండి : రేషన్ కార్డ్ హోల్డర్ కు బిగ్ షాక్.. ఇకపై నుంచి అవి కూడా కట్..! ఎందుకంటే..?

  ఆలయంలో ఉన్న పార్కింగ్ ప్రదేశంలో శనివారం వై.ఎస్.ఆర్ చేయూత పంపిణీ సభ నిర్వహించారు అధికారులు, వైసీపీ నేతలు. సభ కోసం షామియానాలు వేశారు. అంతవరకు బాగానే ఉంది. షామియానాలు వేయడానికి కర్రలు పతుతారు.. లేదా అక్కడ ఏదైనా ఉంటే సపోర్ట్ తీసుకుంటారు. కానీ వైసీపీ నేతలు మాత్రం.. షామియానకు చెందిన రెండు తాళ్లను ఆలయం లోపల ఉన్న శివలింగానికి కట్టేశారు. ఇది తెలిసి చేశారో.. లేక తెలియక చేశారో.. కనీసం అలా కట్టారని తెలిసిన తరువాత అయినా వెంటనే తాళ్లను తొలగించే ప్రయత్నం చేయాలి.. కానీ అలా శివలింగానికి తాళ్లు కట్టిన షామియానాలోనే సమావేశం నిర్వహించి ముచ్చట్లు పెట్టుకున్నారు.

  ఇదీ చదవండి : ప్రయాణికులకు పండుగ ఆఫర్.. ఏపీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం.. ఏంటో తెలుసా?

  దీంతో వారి తీరుపై భక్తులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన సభ బ్రహ్మాండంగా నిర్వహించారు కానీ… సభ పేరుతో చేసిన హడావిడి ఇలానా అంటూ ఫైర్ అవుతున్నారు. శివలింగానికి షామియానా తాళ్లు కట్టిన వీడియోసొషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సభ పేరుతో శివలింగానికి అపచారం చేసిన వారిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షామియానా తాళ్లు కట్టడానికి సమీపంలోని కర్రలు ఏవైనా ఉపయోగించాలి గానీ ఇలా శివలింగానికి తాళ్లు కట్టడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు.

  ఈ గోలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర వుంది. బిక్కవోలు ఆలయంలో జరిగిన అపచారంపై అధికారులు ఏం అంటారో చూడాలి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, East godavari, Lord Shiva

  ఉత్తమ కథలు