హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Yanam: యానాంలో మితిమీరిపోతున్న గంజాయి అమ్మకాలు..! కారణం ఇదే..?

Yanam: యానాంలో మితిమీరిపోతున్న గంజాయి అమ్మకాలు..! కారణం ఇదే..?

యానాంలో పెరిగిపోతున్న గంజాయి సరఫారా

యానాంలో పెరిగిపోతున్న గంజాయి సరఫారా

Yanam: కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో యథేచ్ఛగా గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి. అక్కడ గంజాయి అక్రమ రవాణా ఎక్కడ నుంచి జరుగుతోంది. పెరగడానికి కారణం ఏంటి..?

 • News18 Telugu
 • Last Updated :
 • Yanam, India

  Yanam: జాతీయ స్థాయి క్రైమ్ (Crime) నివేదిక ప్రకారం గంజాయి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) నెంబర్ వన్ స్థానంలో ఉందని తేలింది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ  నుంచి వివిధ  ప్రాంతాలకు భారీగా గంజాయి తరలిపోతోంది. అయితే దేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి పట్టుబడ్డా.. మూలలకు విశాఖతో లింకులు బయడపడుతున్నాయి. తాజా  కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం (Yanam) లో యథేచ్ఛగా గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి. గంజాయి అమ్మకాలపై అడ్డుకట్ట వేసేందుకు యానాం పోలీసులు నడుంబిగించారు. ఆంధ్రా నుండి అడ్డు అదుపు లేకుండా గంజాయి తరలిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోన్న గంజాయి ముఠాకు చెక్‌ పెట్టాలనుకున్నారు.

  యానాం పోలీసులు ఒక అడుగు ముందుకు వేసి..... ఇటీవల పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తుల నుంచి తమ స్టయిల్‌లో విచారించి గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం కక్కించారు.వాళ్లిచ్చిన సమాచారంతో మాఫియా గ్యాంగ్‌కు చుక్కలు చూపించారు.

  యానాం SP బాలచంద్రన్ ఆదేశాల ప్రకారం, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడువేల ఐదువందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియాముందు ప్రవేశ పెట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సోదాల్లో సీఐ శివగణేష్, క్రైం టీం పాల్గొన్నారు.

  ఇదీ చదవండి : ఆడపిల్లలకు గుడ్ న్యూస్.. వారికి 1.50 లక్షలు.. ఆ 2 పథకాలు రేపటి నుంచే అమలు.. అర్హత ఏంటంటే?

  గంజాయి రవాణా చేస్తూ దొరికితే భవిష్యత్‌ పాడవుతుందని ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని యువతకు ఎస్పీ బాలచంద్రన్‌ సూచించారు. ఎవరైనా సరఫరా చేసినట్టు తెలిసినా.. సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Ganja case

  ఉత్తమ కథలు