గోదావరి జిల్లాలు పేరు చెబితే ప్రతీ దానికి ఓ ప్రత్యేక విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా కోనసీమ, రాజమండ్రి ప్రాంతాలతోపాటు, కాకినాడ పరిధిలో ఉన్న వారు చేపట్టే కార్యక్రమాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో సంస్కృత సాంప్రదాయాలు ఈనాటివి కావు.
పెద్దల ఆజ్క్షన లేకుండా ఇంటిలో ఏ పని చేయరు. కాలం మారుతున్నా, సాంకేతిక యుగం వచ్చినప్పటికీ పాత పద్దతులనే ఇక్కడ కొనసాగించడం ఎక్కువగా చూస్తుంటాం. పండగలకు, పబ్బాలకు ఇచ్చే మర్యాదలు మాములుగా ఉండవు. ఏడాదిలో ప్రతీయేటా ఎక్కడొ ఒక చోట ఏదోక సామాజిక కార్యక్రమం చేపట్టడం కూడా ఇక్కడ పరిపాటిగా వస్తోంది. తాజాగా రాజమండ్రి దగ్గర్లోని రాజానగరం వద్ద జరిగిన షష్టి పూర్తి వేడుకను కళ్లు చెదిరేలా నిర్వహించారు.
రాజానగరం మండల ఆర్యవైశ్య సంఘ నూతన అధ్యక్షుడు మండవిల్లి వెంకన్నబాబు సహకారంతో ఉభయ ఉమ్మడి గోదావరి, కృష్ణా, విశాఖ, ప్రకాశం , నెల్లూరు జిల్లాలకు చెందిన 180 మంది వైశ్య దంపతుల షష్టిపూర్తి మహోత్సవ వేడుకల్ని రాజానగరంలో ఘనంగా నిర్వహించారు. మాధవీ కళ్యాణమండపంలో అత్యద్భుత ఏర్పాట్ల నడుమ వేదమంత్రాలు, మంగళవాయిద్యాల్లో ఈ కార్యక్రమాన్ని వారి జీవితాల్లో చిరస్మరణీయంగా నిల్చిపోయేలా నిర్వర్తించారు. షష్టిపూర్తి చేసుకుంటున్న మాత జంటల కొడుకులు కోడళ్ళు, కూతళ్ళు, అల్లుళ్ళూ, ఉండాలని మనుమలు, మనుమరాళ్ళను కూడా నిర్వాహకులు అభిలషించారు.
వీరితో పాటు వారి బంధువుల్ని కూడా రప్పించారు. ఉగాది పంచాంగ శ్రవణానంతరం వినాయక శ్లోకంతో ఈ కార్యక్రమం మొదలైంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కుప్పా విశ్వనాధశర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో భాగంగా అనంతరం సత్యన్నారాయణస్వామివారి సామూహిక వ్రతాలు ఏర్పాటు చేశారు. తదుపరి వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దర్శనం జరిపించారు. షష్ఠిపూర్తి దంపతులతోపాటు వారితో వచ్చిన బంధువులందరికీ భారీగా భోజనాలు ఏర్పాటు చేశారు.
ఒకే ఆకులో భోజనం
షష్టి పూర్తి చేసుకున్న దంపతులకు ఒకే అరిటాకులో భోజనం పెట్టి అందర్ని శంభ్రమాశ్చర్యాల్లో ముంచేసారు నిర్వాహకులు. అన్ని రకాల వంటకాలను సాంప్రదాయ బద్ధంగా వడ్డించారు. ఎంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి షష్టి పూర్తి చేసుకోవడానికి దంపతలు వచ్చారు. వచ్చిన వారికి పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆదంపతుల వెంట వచ్చిన బంధువులకు మర్యాదలు చేశారు నిర్వాహకులు. ఏకతాటిపై ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సఫలీకృతమయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News