Home /News /andhra-pradesh /

EAST GODAVARI CORONA CASES GRADUALLY INCREASING IN EAST GODAVARI DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP

Corona Cases in AP: ఏపీలో ఫోర్త్ వేవ్ వచ్చేసిందా..? ఆ జిల్లాలో పదులకొద్దీ కేసులు..! కారణం ఇదేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చేసిందా..? జనం మాస్కులు ధరించడం మర్చిపోవడం అసలుకే మోసం తెస్తోందా..? ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (East Godavari District)లో కొవిడ్‌ మళ్లీ కోరలు చాస్తోంది.

  P Anand Mohan, News18, Visakhapatnam

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చేసిందా..? జనం మాస్కులు ధరించడం మర్చిపోవడం అసలుకే మోసం తెస్తోందా..? ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (East Godavari District)లో కొవిడ్‌ మళ్లీ కోరలు చాస్తోంది. కొన్నినెలలపాటు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు చాపకింద నీరులా విస్త రిస్తూ బాధితుల సంఖ్యను అంతకంతకూ పెంచేస్తోంది. దీంతో మహ మ్మారి భయం సర్వత్రా అలముకుంటోంది. వైద్యఆరోగ్యశాఖకు ముచ్చె మటలు పట్టిస్తోంది. గతేడాది పాజిటివ్‌లు సృష్టించిన విలయంనుంచి తేరుకోకముందే మళ్లీ కేసులు పంజా విసురుతుండడంతో ఈసారి పరిస్థితులు ఎంతవరకు వెళ్తాయనే ఆందో ళన వెన్నాడుతోంది. ముఖ్యంగా జిల్లాలో గడచిన వారం నుంచి పాజిటివ్‌లు పెరిగిపోతున్నాయి. బుధవారం 41మందికి కొవిడ్‌ సోకగా, గురువారం 45కి పెరిగాయి. ఇందులో 35కేసులు ఒక్క కాకినాడ నగరంలోనే గుర్తించారు.

  ఈ నేపథ్యంలో త్వరలో జిల్లావ్యాప్తంగా టెస్ట్‌ల సంఖ్య పెం చడానికి అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. విరగడైందనుకున్న కొవిడ్‌ పీడ జిల్లాలో మళ్లీ మొదలవడంతో కలకలం రేగుతోంది. మళ్లీ కేసులు ఏస్థాయికి వెళ్తాయో అనే భయం ప్ర తిఒక్కరిని బెంబేలెత్తిస్తోంది. 2020, మార్చి 23న ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో తొలి కేసు నమోదవగా ఆస్ప త్రిలో వేలాదిమంది చేరి తిరిగి నయమై ఇంటికి చేరారు. కానీ గతేడాది ఏప్రిల్‌లో వచ్చిన సెకండ్‌వేవ్‌ మాత్రం జిల్లాను కకావికలం చేసేసింది. వేలాది కేసులతో జిల్లాను వణికించేసింది. బాధితుల ఆర్తనాదాలు, ఆక్సి జన్‌ అందక చనిపోవడాలు, పడక దొరక్క కన్నుమూయడం, శ్మశానాల్లో నిరంతర చితులు కాలడం.. ఇలా ఒకటేంటి దాదాపు మూడునెలలపా టు వైరస్‌ విలయం సృష్టించింది. వేలాదిమందిని పొట్టన పెట్టుకుంది.

  ఇది చదవండి: అమ్మో పసుపు కప్పలు.. గోదావరి జిల్లాలలో భయం‌. భయం..! ప్రకృతి వైపరీత్యాలకి ఇది సంకేతమా..!?


  ఆ తర్వాత ఎక్కడికక్కడ కొవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, జిల్లాలో రెండు డోసులు దాదాపు అంతా పూర్తి చేసుకోవడంతో మహ మ్మారి పోయినట్లేనని అంతా ఊపిరిపీల్చుకున్నారు. రెండేళ్ల కొవిడ్‌ రక్క సినుంచి అన్ని వ్యవస్థలు తిరిగి గాడిలో పడ్డాయి. అంతా సద్దుమణిగిం దనుకున్న తరుణంలో మళ్లీ కొవిడ్‌ కేసులు పురివిప్పుతుండడంతో భ యాందోళనలు పెరుగు తున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుం డడంతో ఆస్పత్రుల్లో బాధితులు పెరుగుతున్నారు.

  ఇది చదవండి: బిడ్డ పుట్టాలంటే కీడుపాకకు వెళ్లాల్సిందే..! ఆ మూడు రోజులూ అక్కడే..! ఏపీలో వింత ఆచారం..


  మూడువారాల కింద టి వరకు రోజుకు ఒకటీ అరా కేసులే రావడంతో వైద్యఆరోగ్యశాఖ అధి కారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ గతవారంనుంచి పాజి టివ్‌లు రయ్‌ మంటూ పరుగులు తీస్తుండడంతో కలవరం మొదలైంది. ఈ వారంలోనే జిల్లాలో ఏకంగా 250 వరకు పాజిటివ్‌లు నిర్ధారణ అవ డంతో మహమ్మారి ముంచుకొస్తున్న సంకేతాలతో అధి కారులు ఉలిక్కిపడుతున్నారు. ఒక్క బుధవారం జిల్లా లో 41మందికి కొవిడ్‌ సోకింది. గురువారం ఈ సంఖ్య 45కి పెరిగింది. ఇందులో 35 కేసులు కాకినాడ నగరం లోనే గుర్తించారు. కాకినాడ జీజీహెచ్‌లో కొవిడ్‌తో పో రాడుతూ 52ఏళ్ల మహిళ మృతి చెందింది. ఆమెకు కిడ్నీ సంబంధిత వ్యాధి ఉండడం, కొవిడ్‌ ముదిరిపోవడంతో చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Corona cases, East Godavari Dist

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు