P Ramesh, News18, Kakinada
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) లో ప్రముఖ క్షేత్రమైన అన్నవరం సత్యన్నారాయణస్వామి దేవస్థానం (Annavaram Satyanarayana Swamy Temple) ధర్మకర్తల మండలి నియామకం ఎట్టకేలకు పూర్తయింది. మొత్తం 16 మంది సభ్యులతో కూడిన ఉత్తర్వులను విడుదల చేసింది ప్రభుత్వం. దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో చక చకా ఏర్పాట్లు చేశారు. చాలా కాలం నుండి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ అనూయలకు అన్నవరం దేవస్థానం బోర్డు మెంబర్ పదవి కట్టబెట్టడానికి పలు పేర్లు సిఫార్సు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా దాదాపుగా అనుకున్న వారికే బోర్డు మెంటర్ల పదవి దక్కింది. ఇదిలా ఉంటే ధర్మకర్తల మండలి సభ్యులంతా పెద్ద ముహుర్తం చూసుకుని ప్రమాణస్వీకారం చేయాలని భావించారు.
అయితే వారి ముహుర్తాలను పక్కన పెట్టి ఉత్తర్వులు విడుదల చేసిన మరుసటి రోజే సభ్యులతా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి చేయాలని అన్నవరం ఈవో నుండి ఉత్తర్వులు రావడంతో ఎంపికైన ధర్మకర్తలు షాక్ అయ్యారు. కనీసం తాము ఎంపికైనట్లు తమ బంధువులకు కూడా పూర్తిగా తెలియదని, హంగామాగా ఆర్భాటంగా చేయాలని తాము భావిస్తే సింపుల్‌గా నియామక ఉత్తర్వులు విడుదల చేసిన తర్వాత రోజు ప్రమాణ స్వీకారం నిర్వహించడం పై అంత స్పీడు ఎందుకో అర్థం కావడం లేదని మరికొందరు సభ్యులు చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో కొందరు అధికారులు పెట్టిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. వారు అనుకున్నట్లుగా తిథి, ముహుర్తం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయాలని భావిస్తే అధికారులు మాత్రం ఆదరా బాదరాగా ప్రమాణస్వీకారం పెట్టడం సభ్యుల్లో కొంత మంది ఆసక్తి కనబరచడం లేదని అంటున్నారు. అయితే ఎంతమంది వస్తే వారి చేత మొదటగా ప్రమాణస్వీకారం చేయించడానికి అధికారులు నిర్ణయించారు. మిగిలిన వారు నెలరోజుల్లో ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం చేయొచ్చునని అంటున్నారు.
రెండేళ్ల పదవికాలం.. సభ్యులు వీరే
అన్నవరం దేవస్థానం వ్యవస్థాపక కుటుంబసభ్యుల్లో ఒకరైన ఐ.వి.రోహిత్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా పిఠాపురం పాదగయ మాజీ ఛైర్మన్ కొట్టెం దత్తుడు, తాడి రజిని(కొరుకొండ), ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి విద్యాకమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన దలే వీరవెంకట సత్యనారాయణ, శంఖవరం మాజీ సర్పంచి అశ్వని, నేతల వెంకటలక్ష్మి(సామర్లకోట), కారుకోపడి పోచమ్మ (రంపచోడవరం). సాపశెట్టి భూలక్ష్మి(ఎ.కొత్తపల్లి), పేరూరి బద్రినారాయణ(తేటగుంట),కె.వి. నాగేశ్వరరావు(శ్రీకాకుళం),బొద్దాని విజయలక్ష్మి(తాడేపల్లిగూడెం), నున్నా నరసింహరావు( కాకినాడ), కడియాల లక్ష్మణరావు(రాజమండ్రి), కర్రి బామిరెడ్డి (కాకినాడ). రాయుడు సత్యవతి(పిఠాపురం), ఎక్స్ ఆఫిషియో సభ్యుడిగా కోట లక్ష్మినరసింహా (శ్రీను) ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News