హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆ ప్రతిపాదనల వెనక ఆంతర్యమేంటో తెలుసా..? కాకినాడలో కాకరేపుతున్న కార్పొరేషన్ నిర్ణయాలు

ఆ ప్రతిపాదనల వెనక ఆంతర్యమేంటో తెలుసా..? కాకినాడలో కాకరేపుతున్న కార్పొరేషన్ నిర్ణయాలు

కాకినాడలో

కాకినాడలో వివాదాస్పదమవుతున్న కార్పొరేషన్ నిర్ణయాలు

కాకినాడ కార్పోరేషన్ (Kakinada Municipal Corporation) పేరు చెబితే చాలు స్మార్ట్ సిటీకి చిరునామా. వంద‌ల కోట్ల రూపాయాలు స్మార్ట్‌సిటీ అభివృద్ది పేరుతో వెచ్చించారు. అందుకు త‌గ్గట్టుగా కార్పోరేష‌న్ స‌హకారం కూడా మెండుగా ఉంటుంది. కానీ ఈమధ్య కాలంలో కొన్ని నిర్ణయాలు మాత్రం వివాద‌స్పద‌మ‌య్యాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kakinada, India

  P.Ramesh, News18, Kakinada

  కాకినాడ కార్పోరేషన్ (Kakinada Municipal Corporation) పేరు చెబితే చాలు స్మార్ట్ సిటీకి చిరునామా. వంద‌ల కోట్ల రూపాయాలు స్మార్ట్‌సిటీ అభివృద్ది పేరుతో వెచ్చించారు. అందుకు త‌గ్గట్టుగా కార్పోరేష‌న్ స‌హకారం కూడా మెండుగా ఉంటుంది. కానీ ఈమధ్య కాలంలో కొన్ని నిర్ణయాలు మాత్రం వివాద‌స్పద‌మ‌య్యాయి. ఆ వెనుకున్న పాత్రదారులెవ‌రు. సూత్రదారులెవరో తెలిసినా నిజాలు మాత్రం బ‌య‌టకురావు. కాకినాడ కార్పోరేషన్‌లో ఈ ఐదేళ్ల కాలంలో రెండు పార్టీలు పనిచేశాయి. తొలి నాలుగేళ్ల పాటు కార్పోరేష‌న్ (Corporation) మేయ‌ర్ ప‌ద‌వి అంతా టిడిపి చేతిలోనే కొనసాగింది. చివ‌రి ఏడాది పాల‌నలో మొత్తం సీన్ మారిపోయింది. 2019లో వైఎస్సార్‌సీపీ (YSRCP) అధికారం చేప‌ట్టిన త‌ర్వాత నుండి మార్పులు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఆధీనంలోకి కార్పోరేష‌న్ పగ్గాలు వెళ్లాయి.

  అయితే అప్పటి వ‌ర‌కూ చాలా నిధుల‌ను టిడిపి (TDP) వారే ఖ‌ర్చు చేశారు. అప్పటివరకు దీనిపై ఆరోప‌ణ‌లు చేసిన వైసీపీ సైతం.., అధికారం చేప‌ట్టిన త‌ర్వాత, టిడిపి పాట‌నే అనుస‌రించింది. మేమేం త‌క్కువ కాద‌న్నట్టుగా వ‌రుస‌గా అభివృద్ది ప‌నుల పేర‌ట తీర్మానాలు చేసేసింది. ఇంకేముంది అభివృద్ధి పరుగులు పెడుతుందనుకుంటే.. ఇప్పుడవే తీర్మానాలు వివాదాస్పదమయ్యాయి.

  ఇది చదవండి: ఆస్పత్రి సూపర్‌వైజర్‌కే వైద్యం అందలేదు.. ఇంతకంటే దారణం ఏమైనా ఉంటుందా..?

  ఇప్పుడివే వివాద‌స్పదం..!

  మున్సిపల్ చట్టరీత్యా పదవీ కాలం ముగిసే కౌన్సిల్ ఆఖరి 3నెలల కాలంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం ,ప్రభుత్వ ప్రణాళికల పనులు మినహా ఇతర పనులు చేపట్టకూడదు. కాని ఇందుకు భిన్నంగా కాకినాడ కార్పోరేషన్ కౌన్సిల్ ఆఖరి 12 గంటల ముందు కూడా రూ. 10కోట్ల పనులకు స్టాండింగ్ కమిటీ నిర్వహించింది. గత 3 నెలలుగా 300 కోట్ల రూపాయల అత్యవసరం కాని పనులు అనుచిత తీర్మానాలు, స్వప్రయోజనాల ప్రతిపాదనలు రూపొందించడం పట్ల రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

  ఇది చదవండి: విశాఖ బీచ్‌లో అద్భుతం.. పురాతన నిర్మాణం గుర్తింపు.. ఆ యుద్ధకాలం నాటిదేనా..?

  కాకినాడ నగరంలోని (Kakinada City) సురేష్ నగర్, శశికాంత్ నగర్ భూములను నివాస స్థలాలుగా మార్పు చేసేందుకు సిఫార్సు చేస్తూ కేటాయించిన 150 కోట్ల రూపాయల్లో వైఎస్సార్‌సీపీ నేతలు ప్రయోజనాలు పొందార‌నే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా రోడ్ల మీద రోడ్లు అవసరం లేకుండా ప్రతిపాదించ‌డం, అనవసరమైన పనులను తీర్మానించడం లాంటివి చేసి కార్పోరేష‌న్‌లో నిధుల కొరత ఏర్పడేలా చేశారనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

  ఇప్పటికే ఈ ప‌నుల‌న్నింటిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని ప్రత్యేక అధికారిగా వ‌చ్చిన క‌లెక్టర్‌ను కోర‌డం ప్రస్తుతం కాకినాడ‌లో హాట్ టాపిక్‌గా మారింది. భ‌విష్యత్తులో ఈ ఆరోప‌ణ‌ల‌ను మాజీలు ఎలా తిప్పికొడ‌తారో.. అక్కడ రాజ్యమేలుతున్న పాల‌కులు ఎలా ఎదుర్కొంటారో అనేది తేలాల్సి ఉంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News

  ఉత్తమ కథలు